ప్రధాన మంత్రి కార్యాలయం

ఐఐఎస్సి బెంగళూరులో సెంటర్ ఫార్ బ్రెయిన్ రిసర్చ్ ను ప్రారంభించడం తో పాటు బాగ్ చీపార్థసారథి మల్టి స్పెశలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి  

Posted On: 20 JUN 2022 2:16PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఐఐఎస్ సి బెంగళూరు లో సెంటర్ ఫార్ బ్రెయిన్ రిసర్చ్ ను ప్రారంభించి, బాగ్ చీ పార్థసారథి మల్టీ స్పెశాలిటీహాస్పిటల్ కు శంకుస్థాపన కూడా చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సెంటర్ ఫార్ బ్రెయిన్ రిసర్చ్ ను @iiscbangalore లో ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాను. ఈ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసిన గౌరవం కూడా నాకు దక్కిన కారణం గా ఈ ప్రసన్నత మరింత ఎక్కువ గా ఉంది. మెదడు కు సంబంధించిన అనారోగ్యాల ను సరిచేయడం ఎలాగో అనేది పరిశోధించడం లో ఈ కేంద్రం సర్వప్రథమం గా ఉండగలదు.’’

‘‘ఆరోగ్య సంరక్షణ కు అత్యంత ప్రాధాన్యాన్ని ప్రతి దేశం ఇచ్చి తీరవలసినటువంటి కాలం లో బాగ్ చీ పార్థసారథి మల్టి స్పెశలిటీ హాస్పిటల్ వంటి ప్రయాస లు గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నాయి. రాబోయే కాలాల్లో, ఇది ఆరోగ్య సంరక్షణ సంబంధి సామర్ధ్యాల ను బలపరుస్తుంది. అంతేకాక, ఈ రంగం లోమార్గదర్శక ప్రాయమైనటువంటి పరిశోధన ను ప్రోత్సహిస్తుంది కూడా.’’ అని పేర్కొన్నారు.

 

 

 

సెంట‌ర్ ఫార్ బ్రెయిన్ రిసర్చ్ ను విశిష్టమైన పరిశోధన సదుపాయం గా అభివృద్ధిపరచడమైంది. వ‌య‌స్సు రీత్యా మెద‌డు లో ఏర్పడే అనారోగ్యాల పైన కీల‌కమైన ప‌రిశోధ‌నలను చేయ‌డానికి, నిదర్శన సహిత సార్వజనిక ఆరోగ్య జోక్యాల ను ప్రదానం చేయడానికి ఈ కేంద్రం లో శ్రద్ధ వహించడం జరుగుతుంది. కాగా 832 ప‌డ‌క‌ల‌ తో కూడిన బాగ్ చీ పార్థ‌సార‌థి మ‌ల్టి స్పెశలిటీ హాస్పిటల్ ను ఐఐఎస్ సి బెంగళూరు కేంపస్ లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్రం లో విజ్ఞ‌ానశాస్త్రం, ఇంజీనియరింగ్‌ మరియు చికిత్సల ను ఏకీకృతం చేయడం లో తోడ్పాటు లభించగలదు. ఇది దేశం లో రోగ చికిత్స సంబంధి ప‌రిశోద‌న‌ల‌ కు ప్రధానమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దేశం లో ఆరోగ్య సేవ‌ల ను మెరుగు ప‌రచడం లో దోహదపడే వినూత్న ప‌రిష్కారాల ను క‌నుగొనే దిశ లో కృషి చేస్తుంది.

 

 

***

 



(Release ID: 1835555) Visitor Counter : 111