హోం మంత్రిత్వ శాఖ
రేపు న్యూఢిల్లీలో సైబర్ రక్షణ, జాతీయ భద్రతపై (సైబర్ అపరాధ్ సే ఆజాదీ - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) జాతీయ సదస్సు
ఈ సదస్సు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర హోం వ్యవహరాలు, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
దేశంలో సైబర్ నేరాలను నిరోధించడంలో సామూహిక అవగాహనను సృష్టించడంపై జరుగుతున్న కృషిలో ఈ సదస్సు భాగం
Posted On:
19 JUN 2022 2:38PM by PIB Hyderabad
75ఏళ్ళ స్వతంత్ర భారత్‌లో దేశం సాధించిన పురోగతిని, విజయాలను పురోగతికి అద్దం పట్టేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో యావత్‌దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను జరుపుకుంటోంది.
ఈ సందర్భంలో సైబర్ రక్షణ, జాతీయ భద్రత (సైబర్ అపరాధ్ సే ఆజాదీ - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్)పై జాతీయ సదస్సును న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సును హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖల దమంత్రి శ్రీ అమిత్ షా సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. దేశంలో సైబర్ నేరాలను నిరోధించడంపై సామూహిక అవగాహనను కల్పించడం కోసం జరుగుతున్న కృషిలో ఈ సదస్సు భాగం.
భారత సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్ర (14సి) విభాగం సోమవారం జరుగనున్న సదస్సుకు ముందుగా జూన్ 8 నుంచి 17 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్న బ్యానర్ కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోని 75 ప్రదేశాలలో సైబర్ హైజీన్, సైబర్ నేరాల్ నిరోధం, సైబర్ రక్షణ, జాతీయ భద్రత గురించి ఉత్సవాలను నిర్వహిస్తోంది.
ఈ సదస్సులో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యప్రాంతాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రడ్డి, హోం వ్యవహారాల శాఖ మంత్రి సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖ, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులో పాలుపంచుకోనున్నారు.
***
(Release ID: 1835388)
Visitor Counter : 160