సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
భారత్ పురావస్తు శాఖ (ఎఎస్ఐ) భాగస్వామ్యంతో పురానా ఖిలాలో శనివారం యోగ మహోత్సవ్‌ను నిర్వహించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మను కలిపి ఉంచే మాధ్యమం యోగ: శ్రీ అర్జున్ మేఘ్‌వాల్
ఆరోగ్యవంతమైన, చురుకైన జీవితానికి యోగ కీలకం: శ్రీమతి మీనాక్షి లేఖి
Posted On:
18 JUN 2022 11:05AM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 వేడుకల్లో భాగంగా శనివారం న్యూఢిల్లీలోని పురాణా ఖిలాలో భారత్ పురావస్తు శాఖ (ఎఎస్ఐ) భాగస్వామ్యంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా మహోత్సవ్‌ను నిర్వహించింది. ప్రజలలో సాంస్కృతిక శ్రేయస్సుకు శాశ్వత విలువను ఆపాదించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ కార్యక్రమానికి సాంస్కృతిక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్, సాంస్కృతిక శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి హాజరయ్యారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు, 40 దేశాలకు చెందిన విదేశీ డెలిగేట్లు సహా 500మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
కార్యక్రమం సరస్వతి వందనంతో ప్రారంభమై, తదనంతరం మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా సూచనల మేరకు యోగా సెషన్ జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, చురుకైన, ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా కీలకమని శ్రీమతి మీనాక్షి లేఖి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కృషి ఫలితంగా యోగా అంతర్జాతీయ స్థాయి సహా సుదూర తీరాలకువిస్త్రతంగా వ్యాపించిందని ఆమె పేర్కొనన్నారు.
శరీరం, మనసు, నైతికత, ఆలోచనల సరళతకు యోగా దారి తీస్తుందని ఆమె ఉద్ఘాటించారు. సరళంగా ఉండేందుకు ప్రకృతితో అనుసంధానం కావడం, యోగ సాధన చేయడం యొక్క ప్రాధాన్యతను శ్రీమతి లేఖి చర్చించారు.
శరీరాన్ని, మనస్సును, బుద్ధిని, ఆత్మను కలిపి ఉంచేందుకు యోగ తోడ్పడుతుందని శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యోగ సాధన చేయడం ద్వారా, ఇతరులతో దాని లబ్ధిని పంచుకోవడం ద్వారా 21 జూన్‌న నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1835237)
Visitor Counter : 162