నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నావికాదళ సేవల్లోని అగ్నివీరులకు ఆరు ఆకర్షణీయ అవకాశాలు


నౌకాయాన శాఖ ప్రకటన..

అగ్నివీరులకు అత్యున్నత ఉద్యోగ జీవితం లక్ష్యంగా
నావికాదళంతో కలసి నౌకాయాన శాఖ కసరత్తు...

వాణిజ్య నావికాదళంలో చక్కని ఉద్యోగాలు పొందేలా
శిక్షణ అందించడమే అగ్నిపథ్ ధ్యేయం

Posted On: 18 JUN 2022 3:32PM by PIB Hyderabad

   వాణిజ్య నావికాదళంలో నైపుణ్యవంతమైన వివిధ పాత్రల నిర్వహణలో అగ్నివీరులకు లావాదేవీలు అందించడమే లక్ష్యంగా అగ్నివీరులకు ఆరు ఆకర్షణీయమైన సేవా అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఓడరేవులు, నౌకాయానం-జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ  మేరకు ఒక ప్రకటన చేసింది. భారతీయ నావికాదశంలో సేవల అనంతరం అగ్నివీరులకు ఈ అవకాశాలను కల్పించనున్నారు. అగ్నివీరులు సుసంపన్నమైన నావికాదళ అనుభవం సముపార్జించడానికి, అవసరమైన శిక్షణను పొందడానికి ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య నావికాదళ సేవల్లో చేరడానికి తగిన యోగ్యాతా ధ్రువీకరణను పొందడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ పరిధిలోని నౌకాయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం శనివారం ముంబైలో ఈ పథకం నిబంధనలను ప్రకటించింది.

   డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ప్రకటించిన ఈ పథకాల ప్రకారం, అగ్నివీరులకు భారత నావికాదళం రేటింగ్‌నుంచి వాణిజ్య నావికాదళం సర్టిఫైడ్ రేటింగ్స్ వరకూ పరర్తనా ప్రక్రియను అమలుచేస్తారు. అలాగే, భారత నావికాదళంలోని ఎలెక్ట్రికల్ రేటింగ్స్‌నుంచి, వాణిజ్య నావికాదళం సర్టిఫైడ్ ఎలెక్ట్రో టెక్నికల్ రేటింగ్ వరకూ బదలాయింపు ప్రక్రియ ఉంటుంది. ఇలా వాణిజ్య నావికాదళంలో నియమితులైన వారందరికీ చక్కని అవకాశాలు అందుబాటులో ఉంటాయి. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ పథకాల్లో భారతీయ నావికాదళం ద్వారా తమ అవకాశాలను అన్వేషించుకోవాలని సంకల్పించిన అగ్నివీరులకు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం-జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇండియన్ నేషనల్ డాటాబేస్ ఫర్ సీఫేరర్స్ (ఐ.ఎన్.డి.ఒ.ఎస్.)గా సి.డి.సి.గా అవకాశం కల్పిస్తుంది. ఇందులో మెకానికల్ లేదా ఎలెక్ట్రానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లమా, లేదా ఎలెక్ట్రానిక్స్, ఎలెక్ట్రికల్ విభాగంలో ఐ.టి.ఐ. ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అగ్నివీరుల ప్రయోజనాలే లక్ష్యంగా కొన్ని పథకాలను రూపొందించారు. ఆయా అర్హతలతో పనిలో చేరిన వారికి లేదా,  విధి నిర్వహణా కాలంలో ఆయా అర్హతలను సముపార్జించిన వారికి ఈ ప్రయోజనాలు సమకూరుతాయి.

  

  భారతదేశం సాయుధ బలగాలను ఆధునికీకరించే ప్రయత్నంలో భాగంగా రూపొందించిన అగ్నిపథ్ పథకం, యువతకు దేశసేవ చేసేందుకు తగిన చక్కని అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో మంచి మంచి అవకాశాలను చేజిక్కించుకోగలిగే వృత్తిపరమైన అనుభవాన్ని, శిక్షణను యువజనులు సముపార్జించేందుకు కూడా ఈ పథకం వీలు కలిగిస్తుంది. వాణిజ్య నావికాదళం ద్వారా అగ్నివీరులకు  ప్రపంచస్థాయి అవకాశాలను కల్పించేందుకు ఓడరేవులు, నౌకాయాన-జలమార్గాల మంత్రిత్వ శాఖ, భారతీయ నావికాదళంతో సమష్టిగా పనిచేస్తుంది. నావికాదశంలో నాలుగేళ్లపాటు సేవలందించిన అనంతరం అగ్నివీరులు వాణిజ్య పదవులుల్లో ప్రత్యామ్నాయ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ కృషి దోహదపడుతుంది.

   ఈ పథకం గురించి కేంద్ర ఓడరేవులు, నౌకాయానం-జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, అగ్నిపథ్ పథకాన్ని ఎంతో విశిష్టమైన కార్యక్రమంగా అభివర్ణించారు. భారతీయ సాయుధ బలగాలను పరిపూర్ణ యువశక్తి నిలయాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పరివర్తనా పూర్వకమైన అగ్నిపథ్ పథకం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత్వానికి ఇది నిదర్శనం. ఈ పథకం ద్వారా యువత సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అలవర్చుకుంటారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మన నావికాదళంలో సేవలందించినంత కాలం వారు మంచి అనుభవం సంపాదిస్తారు. ప్రపంచ స్థాయి వాణిజ్య నావికాదళంలో ఉద్యోగ జీవితాన్ని పొందేందుకు కూడా సమాయత్తమవుతారు. వాణిజ్య నావికాదళంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల భర్తీ విషయంలో ఏర్పడిన అంతరాన్ని పూడ్చివేసేందుకు ఈ పథకాల ద్వారా భారతీయ నావికాదళంతో కలసికట్టుగా మేం పనిచేస్తున్నాం. నౌకాయాన రంగంలో అగ్నివీరులు చక్కని ఉద్యోగ జీవితాన్ని పొందేందుకు, వాణిజ్య నావికాదళంలో వారు చక్కని ఉద్యోగ జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇది దోహదపడుతుంది, సుసంపన్నమైన వారి నైపుణ్యం, అనుభవం ద్వారా భారతీయ సముద్రవనరుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు వారికి చక్కని అవకాశం దక్కుతుంది.” అని అన్నారు.

  ప్రపంచ వాణిజ్య నౌకలకు సిబ్బందిని, మానవ వనరులను అందించడంలో భారతదేశం అదిపెద్ద సరఫరాదారుగా కొనసాగుతోంది. ఎస్.టి.సి.డబ్ల్యు. ఒప్పందం ప్రకారం యోగ్యతా ధ్రువీకరణ పొందిన భారతీయ నావికులకు అంతర్జాతీయంగా విపరీతమైన గిరాకీ ఉంది. కాగా, నౌకాయాన రంగంలో అగ్నివీరులు ఉద్యోగ జీవితాన్ని సజావుగా పొందేందుకు వీలుగా తాజాగా ఈ పథకాలను రూపొందించారు. ఇందుకోసం కేంద్ర ఓడరేవులు, నౌకాయానం-జలమార్గాల మంత్రిత్వ శాఖ శ్రద్ధగా, అంకితభావంతో పనిచేస్తూ వస్తోంది.

 

****


(Release ID: 1835129) Visitor Counter : 187