ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

19 జూన్ 2022 నుండి 11 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల‌లో పోలియో సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్


- బూత్‌లు, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్ల‌డం, మొబైల్ మరియు ట్రాన్సిట్ టీమ్‌ల ద్వారా దాదాపు 3.9 కోట్ల మంది ఐదేండ్ల‌ లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయ‌డ‌మే లక్ష్యం

- పిల్లలకు అదనపు రక్షణను అందించడానికి భారత ప్రభుత్వం తన సాధారణ వ్యాధి నిరోధక కార్యక్రమంలో ఇంజెక్ట్ చేయగల ఇనాక్టివేటెడ్ పోలియోవైరస్ వ్యాక్సిన్‌ని ప్రవేశపెట్టింది

Posted On: 18 JUN 2022 1:12PM by PIB Hyderabad

పోలియో వ్యాక్సిన్ చుక్కలు వేయడానికి గాను 9 జూన్ 2022 నుండి దేశంలోని 11 రాష్ట్రాలు/యుటీలలో  మొదటి ఉప-జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్స‌వం నిర్వహించబడుతోంది. బీహార్, ఛండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్‌ల‌లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌బ‌డుతుంది. కేంద్ర చేప‌ట్టిన ఈ పోలియో కార్య‌క్ర‌మంలో భాగంగా బూత్, ఇంటింటికి వెళ్ల‌డం, మొబైల్ మరియు ట్రాన్సిట్ టీమ్‌ల ద్వారా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు క‌లిగిన‌ 3.9 కోట్ల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయ‌డం లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లలకు అదనపు రక్షణను అందించడానికి, భారత ప్రభుత్వం తన సాధారణ వ్యాధి నిరోధక కార్యక్రమంలో ఇంజెక్ట్ చేయదగిన ఇనాక్టివేటెడ్ పోలియోవైరస్ వ్యాక్సిన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతంలోని 10 ఇతర దేశాలతో పాటు భారతదేశంను మార్చి 27, 2014న పోలియో రహిత దేశంగా ధ్రుక‌వీక‌రించింది. దేశంలో చివరి పోలియో కేసు 2011 జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా పోలియో ఆఫ్ఘనిస్థాన్ మరియు పాకిస్థాన్ అనే రెండు దేశాలలో ఇప్పటికీ స్థానికంగా ఉంది. భారతదేశాన్ని "పోలియో-రహితష అని ధ్రువీక‌రించిన‌ప్ప‌టికీ పోలియో వైరస్ దిగుమతి లేదా వ్యాక్సిన్ ఉత్పన్నమైన పోలియో వైరస్ల ఆవిర్భావం కొనసాగుతుంది.  ఇది మ‌న  దేశంలో అధిక జనాభా రోగ నిరోధక శక్తిని సున్నితమైన నిఘాను నిర్వహించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం (యుపీఐ) కింద అదనపు వ్యాక్సిన్‌లను ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం తన పిల్లలను మరింత ఎక్కువ టీకాతోనివారించగల వ్యాధులు (వీపీడీల‌) నుండి రక్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అన్ని టీకాలు దేశంలోని ప్రతి  బిడ్డకు కూడా చేరువ‌య్యేలా చూడ‌డం చాలా ముఖ్యంగా పని చేస్తోంది. జాతీయ పోలియో కార్యక్రమం కింద నేర్చుకున్న పాఠాలు మరియు వ్యవస్థలు సాధారణ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు 90 శాతం కంటే ఎక్కువగా పూర్తి రోగనిరోధక కవరేజీని సాధించడానికి ఉపయోగించబడుతున్నాయి.
రాష్ట్ర  ప్రభుత్వాలు మరియు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, రోటరీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు  ఇతర భాగస్వాములు పోలియో నిర్మూలనలో మాత్రమే కాకుండా సాధారణ వ్యాధి నిరోధక చర్యలను మెరుగుపరచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. తల్లిదండ్రులందరూ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు క‌లిగిన‌ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

***


(Release ID: 1835121) Visitor Counter : 257