రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అభివృద్ధి, పర్యావరణం, జీవావరణాల మధ్య సమతుల్యతను నిర్వహించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
16 JUN 2022 12:41PM by PIB Hyderabad
అభివృద్ధి, పర్యావరణం, జీవావరణాల మధ్య సమతుల్యతను నిర్వహించవలసిన అవసరాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నొక్కి చెప్పారు. ఇండస్ట్రియల్ డీ కార్బొనైజేషన్ సమ్మిట్ (2022) (ఐడిఎస్-2022) - రోడ్ మ్యాప్ ఫర్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2070 అన్న అంశంపై జరిగిన సదస్సును ప్రారంభిస్తూ విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ఇంధనాలను అభివృద్ధి చేయడం చాలా అవసరమని ఆయన అన్నారు. ఈ అంశాల్లో విపరీతమైన ఏకపక్ష ధోరణి దేశానికి ప్రయోజనకరం కాదని ఆయన పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో మనం మన ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని శ్రీ గడ్కరీ సూచించారు. హరిత ఉదజని మన ప్రాధాన్యత అని, బయోటెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మనం జీవద్రవ్య ఉత్పత్తిని పెంచుకోవచ్చని, జీవ ద్రవ్యాన్ని ఉపయోగించి మనం బయో ఎథినాల్ ను, బయో- ఎల్ఎన్‌జి, బయో- సిఎన్‌జిని తయారు చేసుకోవచ్చన్నారు. ఇథెనాల్, మిథెనాల్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. మన ఎగుమతులను పెంచేందుకు, దిగుమతులను తగ్గించుకునేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సృష్టించుకుని, తగిన పరిశోధనలను చేయాలని మంత్రి అబిప్రాయపడ్డారు.
దిగువన ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి విsవరాలను చూడవచ్చు.
***
(Release ID: 1834676)
Visitor Counter : 139