రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
గంగా బ్రిడ్జి సహా ఝార్ఖండ్‌లో కొత్త లింక్ ఎన్‌హెచ్ -133 బి నిర్మాణం, మణిహరి బైపాస్ నిర్మాణం, బీహార్‌లో ఎన్‌హెచ్-131 ఎ విస్తరణను అక్టోబర్ 2024కు పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా సాగుతున్న పనులు
Posted On:
13 JUN 2022 3:56PM by PIB Hyderabad
ఝార్ఖండ్ లో 0.200 కిమీ నుంచి గంగా బ్రిడ్జి సహా 15.885 కిమీ నూతన లింక్ ఎన్‌హెచ్-133బి , మణిహరి బైపాస్ 0.000 కిమీ నుంచి 5.500 కిమీ వరకు పనులతో పాటుగా బీహార్‌లోని ఎన్‌హెచ్-131 ఎ 5.500 కిమీ నుంచి 6.00 కిమీ వరకూ 4 లేన్ ప్రమాణాలతో శరవేగంతో నడుస్తున్నాయి. ఈ సమాచారాన్ని కేంద్ర రహదారుల రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ సోమవారం తన ట్వీట్ల పరంపరలో వెల్లడించారు.
దాదాపు 21.68 కిమీల విస్తరించిన ఎన్‌హెచ్-133 బి ప్రాజెక్టు నూతన అనుసంధానం 6 కిమీల పొడవైన గంగా వంతెన (ప్రపంచంలోనే మూడవ పొడవైన కేబుళ్ళ వంటి అదనపు ఆసరాతో ఉండే ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జి), మణిహరి బైపాస్, ఎన్‌హెచ్ 131ఎవిస్తరణతో కూడిన ప్రత్యేక ప్రాజెక్టు అని మంత్రి పేర్కొన్నారు.
.ఈ రహదారి పూర్తి అయితే, అది సాహిబ్‌గంజ్ (ఝార్ఖండ్)ని మణిహరి (బీహారి)తో అనుసంధానం చేస్తుందని, తద్వారా ప్రయాణ దూరాన్ని 1/10 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని శ్రీ గడ్కరీ తెలిపారు. ఇది ఈశాన్య ప్రాంతాన్ని అనుసంధానం చేసే వ్యూహాత్మక పాయింట్‌గా కూడా ఉంటుందన్నారు. దాదాపు 1900 కోట్ల విలువైన ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 2750 నిర్మాణపనివారు శ్రమిస్తున్నారని ఆయన వివరించారు.
ఇది భగల్పూర్‌లోని విక్రమ్ శిలా వంతెన వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, స్థానిక ప్రజానీకానికి ఉపాధి అవకాశాలను అందించడాన్ని వేగవంతం చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టును అక్టోబర్ 2024కు పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అత్యద్భ/తమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్న దృక్పథంతో నూతన భారతదేశం రూపుదిద్దుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు.
***
(Release ID: 1833687)
Visitor Counter : 138