మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జూన్ 12 నుండి 20 వరకు బాల కార్మికుల నిర్మూలన వారోత్సవాలను జరుపుకుంటున్న ఎన్‌సిపిసీఆర్‌


దేశంలోని 75 ప్రాంతాల్లో పిల్లలు పనులు చేస్తున్న చోట రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణ

Posted On: 12 JUN 2022 11:02AM by PIB Hyderabad

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసీఆర్‌) వివిధ ప్రాంతాలలో "భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. "ఆజాది కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా 75 ప్రాంతాల్లో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల కార్మికుల నిర్మూలన వారోత్సవాన్ని జరుపుకుంటోంది. పలు  జిల్లాల్లో 12 జూన్ నుండి జూన్ 20, 2022 వరకు బాల కార్మికుల సమస్యపై దృష్టి పెట్టడం మరియు దానిని నిర్మూలించడానికి మార్గాలను కనుగొనడంపై కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా స్క్రాప్ & ఆటోమొబైల్ మార్కెట్‌లలో 75 చోట్ల పిల్లలు లేబర్ పనిలో నిమగ్నమై ఉన్న చోట రెస్క్యూ ఆపరేషన్లు 2022 జూన్ 12 నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర కమిషన్ (ఎన్‌సిపిసీఆర్‌) జిల్లా అధికారుల సహాయంతో నిర్వహించబడతాయి. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిఎల్‌ఎస్‌ఏ, చైల్డ్ లైన్, పోలీస్/ఎస్‌జేపియూ, లేబర్ డిపార్ట్‌మెంట్ మరియు ఇతర అధికారులు ఇందులో పాల్గొంటారు.

బాల కార్మికుల నిర్మూలన వారంలో  చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్ల ప్రక్రియను చర్చించేందుకు డిఎంలు, ఎస్‌సిపీసీఆర్‌లు, డిఎల్‌ఎస్‌ఏ, ఎస్‌జెపీయూలు, లేబర్‌డిప్ట్, చైల్డ్‌లైన్‌ అధికారులతో పాటు ఇతర వాటాదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. 18 రాష్ట్రాలు/యుటిల నుండి 800 కంటే ఎక్కువ మంది అధికారులు ఈ సమావేశాలలో పాల్గొన్నారు.

పలు సందర్భాలలో వర్తించే బాలలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలతో పాటు  బాల కార్మికుల రక్షణ మరియు పోస్ట్-రెస్క్యూపై డ్రాఫ్ట్ ఎస్‌ఓపిని ఎస్‌సిపీసీఆర్‌ అభివృద్ధి చేసింది. బాల కార్మిక కేసుల బాధితులైన పిల్లల విచారణ మరియు పునరావాసం కోసం నిర్దేశించబడిన ప్రక్రియ యొక్క అవగాహనను సులభతరం చేయడానికి ప్రయత్నం చేయబడింది.

అలాగే ఎస్‌సిపీసీఆర్‌కు చెందిన బాలస్వరాజ్ పోర్టల్‌లో వారి రక్షణ మరియు పునరావాస ప్రక్రియ కోసం బాల కార్మికుల కోసం ప్రత్యేక లింక్‌ను రూపొందించే ప్రక్రియలో కమిషన్ ఉంది.

బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన కమిషన్ల (సిపిసిఆర్‌) చట్టం, 2005లోని సెక్షన్ 3 ప్రకారం చట్టబద్ధమైన సంస్థగా  బాలల హక్కుల పరిరక్షణ మరియు సంబంధిత విషయాల కోసం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్‌సిపీసీఆర్‌) భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది. కమీషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (సిపిసిఆర్‌) చట్టం, 2005లోని సెక్షన్ 13(1) ప్రకారం..బాలల హక్కులు ముఖ్యంగా అత్యంత దుర్బలమైన మరియు అట్టడుగున ఉన్నవారికి రక్షణ కల్పించేందుకు కొన్ని విధులను అందించింది. వీటితో పాటు జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ & రక్షణ) చట్టం, 2015, ఉచిత & నిర్బంధ విద్య కోసం బాలల హక్కు (ఆర్‌టీఈ) చట్టం, 2009 మరియు లైంగిక నేరాల నుండి పిల్లల నిరోధక చట్టం, 2012 అమలును పర్యవేక్షించడానికి కూడా కమిషన్ ఆదేశించబడింది.


 

*****



(Release ID: 1833380) Visitor Counter : 564