సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

14 జూన్, 2022న మంగోలియా బుద్ధ పూర్ణిమ సందర్భంగా 11 రోజుల ప్రదర్శన కోసం బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి మంగోలియాకు తీసుకెళ్లనున్నారు.


శ్రీ కిరణ్ రిజిజు నేతృత్వంలోని 25 మంది సభ్యుల ప్రతినిధి బృందం వీటితో పాటు వెళ్లనుంది

భారతదేశం-మంగోలియా సంబంధాలలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయి. రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంబంధాలను ఇది మరింత పెంచుతుంది: శ్రీ కిరణ్ రిజిజు

బుద్ధ భగవానుడి బోధనలు మానవాళిని మరింత శాంతి, సామరస్యం మరియు శ్రేయస్సు వైపు నడిపిస్తాయి: శ్రీ కిరణ్ రిజిజు

బుద్ధ భగవానుడి శాంతి మరియు కరుణ సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది: శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 11 JUN 2022 4:53PM by PIB Hyderabad

మంగోలియా ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శించే కార్యక్రమంలో భాగంగా మంగోలియన్ బౌద్ధ పూర్ణిమ వేడుకల్లో భాగంగా 11 రోజుల ప్రదర్శన కోసం బుద్ధ భగవానుడి నాలుగు పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి మంగోలియాకు 14 జూన్ 2022న తీసుకువెళుతున్నారు. 25 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ఈ పవిత్ర అవశేషాలతో పాటుగా మంగోలియాకు 12 జూన్ 2022న బయలుదేరుతారు. పవిత్ర అవశేషాలు గండన్ మొనాస్టరీ ఆవరణలోని బట్సాగన్ ఆలయంలో ప్రదర్శింస్తారు. ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉంచబడిన పవిత్ర బుద్ధుని అవశేషాలను 'కపిల్వాస్తు అవశేషాలు' అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి 1898లో కపిల్వాస్తు పురాతన నగరంగా భావించబడే బీహార్‌లోని ఒక ప్రదేశం నుండి కనుగొనబడ్డాయి.

image.png
ఈ పర్యటన గురించి ఈరోజు న్యూ ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో  శ్రీ కిరణ్ రిజిజు మాట్లాడుతూ..భారతదేశం-మంగోలియా సంబంధాలలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయి అని మరియు రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంబంధాలను మరింత పెంచుతుందని అన్నారు.

2015లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగోలియా పర్యటనను మంత్రి గుర్తు చేసుకుంటూ..మంగోలియాను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అని, మంగోలియాకు ఈ పవిత్ర అవశేషాలను తీసుకెళ్లడం మా దృక్పథానికి పొడిగింపు అని కేంద్ర మంత్రి అన్నారు. శతాబ్దాల క్రితం నుండి మనం సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంబంధాలను కలిగి ఉన్న దేశాలతో మన సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రధాన మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.

మంగోలియా మరియు భారతదేశం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పొరుగు దేశాలుగా చూసుకుంటాయని మరియు ఈ సామాన్యత కారణంగా మంగోలియాను మన ‘మూడవ పొరుగు దేశం’ అని కూడా చెప్పవచ్చని శ్రీ రిజిజు వివరించారు.

బుద్ధ భగవానుడి బోధనలు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సముచితంగా ఉంటాయని మరియు మానవాళిని  శాంతి, సామరస్యం మరియు శ్రేయస్సు వైపు నడిపిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశం శాంతి మరియు సామరస్యాన్ని విశ్వసిస్తుందని ప్రపంచానికి భారతదేశం యొక్క సాంస్కృతిక బహుమతి అయిన బుద్ధ భగవానుడి బోధనల ద్వారా ప్రపంచమంతటా ఈ సందేశాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి అన్నారు. పవిత్ర అవశేషాల పట్ల తమ హృదయాలలో చాలా ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతున్న మంగోలియా ప్రజలకు ప్రత్యేక బహుమతిగా 11 రోజుల ప్రదర్శన కోసం ఈ అవశేషాలను తీసుకెళ్తున్నట్లు మంత్రి వివరించారు.

వర్చువల్‌గా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు డోనర్ శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ..బుద్ధ భగవానుడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా గౌరవించబడ్డాడని అన్నారు. 2015లో మంగోలియాను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అని, ప్రధాన మంత్రి సందర్శించిన అదే మఠంలో వీటిని ప్రదర్శిస్తారని మంత్రి వెల్లడించారు. బుద్ధ భగవానుడి శాంతి, కరుణ సందేశాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని బౌద్ధ స్థలాలు, స్థానాలు మరియు బౌద్ధ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులపై పని చేస్తోంది. తాజాగా ఖుషీనగర్‌ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

ఈ పవిత్ర  అవశేషాలకు ప్రత్యేక అతిథి హోదా ఇవ్వబడుతుంది. ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉంచబడిన వాతావరణ నియంత్రణ కేసులోనే తీసుకోబడుతుంది. పవిత్ర అవశేషాలను తీసుకెళ్లేందుకు భారత వైమానిక దళం ప్రత్యేక విమానం సి-17 గ్లోబ్ మాస్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంగోలియా సాంస్కృతిక మంత్రితో పాటు మంగోలియా అధ్యక్షుడి సలహాదారు మరియు ఇతర ప్రముఖులు,పెద్ద సంఖ్యలో బౌద్ద సన్యాసులు మంగోలియాలో వీటిని స్వీకరిస్తారు; మంగోలియాలో లభ్యమయ్యే బుద్ధ భగవానుడి అవశేషాలు కూడా భారతదేశంలోని అవశేషాలతో పాటు ప్రదర్శించబడతాయి. ఈ రెండింటి కోసం రెండు బుల్లెట్ ప్రూఫ్ కేసింగ్‌లు అలాగే రెండు సెరిమోనియల్ క్యాస్కెట్‌లను భారత ప్రతినిధి బృందం తీసుకువెళుతోంది.

2015లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మంగోలియాను తొలిసారిగా సందర్శించిన సందర్భంగా గంధన్ ఆశ్రమాన్ని సందర్శించారు. హంబా లామాకు బోధి వృక్ష మొక్కను బహుకరించారు. రెండు దేశాల మధ్య శతాబ్దాల నాటి బౌద్ధ సంబంధాలను ఎత్తి చూపుతూ, శ్రీ నరేంద్ర మోదీ మంగోలియన్ పార్లమెంట్‌లో తన ప్రసంగంలో భారతదేశం మరియు మంగోలియాలను ఆధ్యాత్మిక పొరుగు దేశాలుగా నిర్వచించారు.

మంగోలియాతో భారతదేశం సుదీర్ఘకాలంగా సాంస్కృతిక & చారిత్రక సంబంధాలను పంచుకుంటుంది మరియు ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మంగోలియన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. అందులో భాగంగా మంగోలియాలోని గండన్ మొనాస్టరీ లోపల బట్సాగన్ ఆలయంలో 11 రోజులపాటు బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రదర్శించడానికి అనుమతించారు.

ఈ అవశేషాలను చివరిసారిగా 2012లో దేశం నుండి బయటకు తీసుకెళ్ళారు. ఆ ప్రదర్శన శ్రీలంకలో నిర్వహించబడింది. ఆ  ద్వీప దేశం అంతటా అనేక ప్రదేశాలలో ప్రదర్శించబడింది. అనంతరం మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. వాటి ప్రకారం ఈ పవిత్ర అవశేషాలను వాటి సున్నితమైన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రదర్శన కోసం దేశం నుండి బయటకు తీసుకెళ్లకూడదు. అందుకోసం పురాతన వస్తువులు మరియు కళల సంపదకు చెందిన  'ఏఏ' వర్గం క్రింద ఉంచబడ్డాయి.

25 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో సంస్కృతిక శాఖ జేఎస్  శ్రీమతి అమిత ప్రసాద్ సర్భాయ్; ఏడీజీ శ్రీమతి నాను భాసిన్ నేతృత్వంలోని అధికారిక మీడియా బృందం; నేషనల్ మ్యూజియం నుండి సాంకేతిక నిపుణులు; ఐబీసీ (అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య) ప్రతినిధులు భారతదేశానికి మంగోలియా సాంస్కృతిక దూత అయిన ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్‌లు ఉన్నారు.

అంతకుముందు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జేఎస్ శ్రీమతి లిల్లీ పాండేయా నేతృత్వంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు, నేషనల్ మ్యూజియం క్యూరేటర్‌లతో కూడిన ముందస్తు బృందం ఈ అవశేషాలను స్వీకరించడానికి సన్నాహక ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మరియు అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి జూన్ 8, 2022న మంగోలియాకు వెళ్లింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన అనంతరం భారతదేశం వివిధ రంగాలలో మరియు సాంస్కృతిక రంగాలలో మంగోలియాకు మద్దతు ఇస్తోంది. భారతదేశం మంగోలియన్ కంజుర్ పై108 సంపుటాల 75 కాపీలను ముద్రించి మంగోలియన్ ప్రభుత్వానికి మరియు అక్కడి వివిధ బౌద్ధ సంస్థలకు అందజేసింది. కంజుర్ రాతప్రతుల డిజిటలైజేషన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 500 మంది మంగోలియన్ సన్యాసులు భారతదేశంలోని వివిధ మఠాలు మరియు సంస్థలలో చదువుతున్నారు. ఇందు కోసం భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా వారి ప్రయాణాన్ని మరియు వీసాలను సులభతరం చేసింది.

బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాల గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Click here for more details of the sacred relics of Lord Buddha

***


(Release ID: 1833304) Visitor Counter : 157