యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ప్రతిష్టాత్మక హాకీ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న - పంజాబ్ బాలురు
రోడ్ రేసింగ్ టైటిళ్ళను కైవసం చేసుకున్న - కర్నాటకకు చెందిన బోర్జి, రాజస్థాన్ కు చెందిన కస్వాన్
Posted On:
10 JUN 2022 5:36PM by PIB Hyderabad
గత పోటీల్లో రెండుసార్లు తడబడిన పంజాబ్ హాకీ జట్టు శుక్రవారం జరిగిన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలుర హాకీ టైటిల్ ను కైవసం చేసుకుంది.
ఉదయం జరిగిన ఇతర పోటీల్లో, కర్ణాటక సైక్లింగ్ లో స్వర్ణాన్ని సాధించి, పతకాల పట్టికలో నాల్గవ స్థానానికి చేరుకుంది.
బాలికల 20 కిలోమీటర్ల రోడ్ సైక్లింగ్ టైమ్ ట్రయల్ (32:51.84 సెకన్లు) లో కర్ణాటకకు చెందిన చైత్ర బోర్జి 11వ స్వర్ణాన్ని కైవసం చేసుకుని, ఇంతవరకు ఈత క్రీడాకారులు సాధించిన 8 స్వర్ణాలకు జోడించారు.
క్రితం సాయంత్రం వరకు 33 పతకాలను సాధించిన హర్యానా; 32 పతకాలను సాధించిన మహారాష్ట్ర తమ ఉన్నత స్థానాలను మరింత మెరుగుపరచుకోడానికి ఈ ఉదయం ఎటువంటి స్వర్ణాలను సాధించలేకపోయాయి.
చిన్న రాష్ట్రమైన లడఖ్ జట్టు లోని ఏకైక మహిళా సైక్లిస్ట్, లీక్జెస్ ఆంగ్మో, 33:52.52 సెకన్ల సమయంలో బోర్జి తర్వాత రెండో స్థానంలో నిలిచి, ఈ క్రీడోత్సవాల్లో ఆ రాష్ట్రానికి మొదటి పతకాన్ని సాధించి పెట్టింది. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ కస్వాన్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆదిల్ అల్తాఫ్ కంటే 30 కిలోమీటర్ల ముందు బాలుర టైమ్-ట్రయల్ ను కైవసం చేసుకున్నాడు.
నీలిరంగు హాకీ మైదానంపై, ఉత్కంఠభరితమైన ఫైనల్ పోటీ లో పంజాబ్ జట్టు 3-1 పాయింట్లతో ఫేవరెట్ ఉత్తరప్రదేశ్ ను చిత్తు చేసింది.
భరత్ ఠాకూర్ (4వ & 47వ) మరియు రాజిందర్ సింగ్ తమ 5వ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జాతీయ ఛాంపియన్ ల దాడిని అణిచివేశారు. ఆకట్టుకున్న ఉత్తరప్రదేశ్ జట్టు 10 పెనాల్టీ కార్నర్ల ను సంపాదించింది, కానీ ఒక్కటి మాత్రమే అనుకూలంగా మల్చుకోగలిగింది. 11వ నిమిషంలో, డ్రాగ్-ఫ్లిక్కర్ కెప్టెన్ శారదా నంద్ తివారీ ద్వారా, ఇది సమానత్వాన్ని పునరుద్ధరించడానికి తోడ్పడింది.
"మేము రెండు సార్లు రజతం, కాంస్యం సాధించాము, అయితే, ఈ రోజు బాలురు ఖచ్చితమైన హాకీ ని ప్రదర్శించారు.", అని కోచ్ యుధ్వీందర్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఒడిశా 8-0 పాయింట్లతో జార్ఖండ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇలా ఉండగా, ఆతిథ్య హర్యానా పై 3-2 తో విజయం సాధించిన తమిళనాడు బాలికల జట్టు, 3-0 తో గుజరాత్ ను ఓడించిన జార్కండ్ తో ఫైనల్స్ లో తలపడనుంది.
నిషా మరియు ఆర్తిల స్ట్రయిక్ ల కారణంగా ఆతిథ్య జట్టు 2-0 తో ఆధిక్యంలోకి రావడంతో, తమిళనాడు హాఫ్ టైమ్ లో డౌన్ మరియు అవుట్ గా నిలిచింది. కానీ ఎ. మహాలక్ష్మి పునరుద్ధరణ లో బ్రేస్ స్కోర్ చేసింది. అదేవిధంగా ఆర్. యువ రాణి అదనపు సమయంలో ఒక లూజ్ బాల్ పై దూసుకెళ్లి జట్టు విజయానికి దోహదపడ్డంతో పాటు, ఆతిథ్య జట్టును నిరాశకు గురిచేసింది.
విలువిద్య పోటీల్లో, టాప్స్ డెవలప్‌మెంట్ స్క్వాడ్ కు చెందిన అథ్లెట్ పార్త్ సలుంకే, బాలురను అధిగమించి, అగ్ర స్థానంలో నిలవగా, చండీగఢ్ కు చెందిన దివ్యాంష్ కుమార్, పశ్చిమ బెంగాల్ కు చెందిన జుయెల్ సర్కార్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
కాంపౌండ్ బాలికల్లో రాజస్థాన్ కు చెందిన ప్రియా గుర్జార్ క్వాలిఫికేషన్ లో అగ్రస్థానం సాధించగా, పంజాబ్‌కు చెందిన ప్రణీత్ కౌర్, అవ్నీత్ కౌర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
హర్యానాలోని పంచకులలో జరిగిన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలలో బాలికల వ్యక్తిగత టైమ్ ట్రయల్ 20 కి.మీ. పతక విజేతలు
అన్ని ఫైనల్స్ ఫలితాలు (ఉదయం సెషన్)
సైక్లింగ్ - బాలికల వ్యక్తిగత టైమ్ ట్రయల్ 20 కి.మీ:
స్వర్ణం : చైత్ర బోర్జీ (కర్ణాటక) 32:51.84;
రజితం : లీక్జెస్ ఆంగ్మో (లడఖ్) 33:52.52;
కాంస్యం : రవీనా బిష్ణోయ్ (రాజస్థాన్) 33:57.27
హర్యానాలోని పంచకుల లో జరిగిన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో బాలుర వ్యక్తిగత టైమ్ ట్రయల్ 30 కి.మీ. పతక విజేతలు
సైక్లింగ్ - బాలుర వ్యక్తిగత టైమ్ ట్రయల్ 30 కి.మీ:
స్వర్ణం : ముఖేష్ కస్వాన్ (రాజస్థాన్) 38:38.63;
రజితం : ఆదిల్ అల్తాఫ్ (జమ్మూ & కాశ్మీర్) 39:22.69;
కాంస్యం : పర్మా రామ్ (రాజస్థాన్) 39:48.32
ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో బాలుర హాకీ ఫైనల్స్ లో విజయం సాధించిన పంజాబ్ బాలుర హాకీ జట్టు సంబరాలు జరుపుకుంది.
హాకీ - బాలురు :
ఫైనల్ : పంజాబ్ జట్టు ఉత్తరప్రదేశ్ జట్టుపై 3-1 గోల్స్ తేడా తో విజయం సాధించింది.
కాంస్యం : ఒడిశా జట్టు జార్ఖండ్ జట్టుపై 8-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ఇతర కీలక ఫలితాలు:
ఫుట్-బాల్ (బాలికలు)
సెమీ-ఫైనల్ 1 : జార్ఖండ్ జట్టు గుజరాత్ జట్టు ను 3-0 పాయింట్ల తేడాతో ఓడించింది.
సెమీ-ఫైనల్ 2 : తమిళనాడు జట్టు హర్యానా జట్టు ను 3-2 పాయింట్ల తేడాతో ఓడించింది.
టెన్నిస్ - బాలుర సింగిల్స్:
1. దక్ష్ ప్రసాద్ (మధ్యప్రదేశ్) పై రుషీల్ ఖోస్లా (ఉత్తరప్రదేశ్) 6-2; 6-2 పాయింట్లతో విజయం సాధించాడు.
2. పర్వ్ నాగే (హర్యానా) పై ధ్రువ్ హిర్పారా (గుజరాత్) 6-3; 6-4 పాయింట్లతో విజయం సాధించాడు.
టెన్నిస్ - బాలికల సింగిల్స్:
1. శ్రుతి అహ్లావత్ (హర్యానా) పై సుహిత మరూరి (కర్ణాటక) 2-6; 6-1; 7-6 పాయింట్లతో విజయం సాధించింది.
2. వైష్ణవి అడ్కర్ (మహారాష్ట్ర) పై ఆకాంక్ష నిట్టురే (మహారాష్ట్ర) 6-2; 6-4 పాయింట్లతో విజయం సాధించింది.
*****
(Release ID: 1833129)
Visitor Counter : 122