బొగ్గు మంత్రిత్వ శాఖ

2021-22కు గాను కార్య‌సాధ‌న ఎజెండా స్థితుగ‌తుల‌ను విడుద‌ల చేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ‌

Posted On: 08 JUN 2022 11:58AM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ 2021-22 సంవ‌త్స‌రానికి సంబంధించిన కార్యసాధ‌న ఎజెండా స్థితిగ‌తుల‌ను విడుద‌ల చేస్తూ, దిగువ‌న పేర్కొన్న అంశాల‌పై విస్త్ర‌తంగా దృష్టి సారించింది:

1. బొగ్గు రంగ సంస్క‌ర‌ణ‌లు
2. బొ గ్గు ప‌రివ‌ర్త‌న- సుస్థిర‌త‌
3. వ్య‌వ‌స్థాగ‌త నిర్మాణం
4. భ‌విష్య‌త్ అజెండా
ఇది 2021-22 కోసం మంత్రిత్వ శాఖ తొలి ఎజెండా ప‌త్రం. దీనిని ఒక సంక‌ల‌నంగా రూపొందించి ఏడాది పొడ‌వునా నిత్య ప‌ర్య‌వేక్ష‌ణ‌, మ‌దింపుల ద్వారా విస్త్రతంగా దృష్టి సారించిన నాలుగు రంగాల బాధ్య‌త‌ను న‌డిపించేందుకు అంద‌రు సీనియ‌ర్ అధికారుల‌కు అందించ‌డం జ‌రిగింది. ఇందులో మొత్తంగా 24 విధులు ఉన్నాయి, అందులో నాలుగు విధుల‌ను రానున్న సంవ‌త్స‌రంలో కొన‌సాగించ‌నున్నారు. 
ఈ ఎజెండా 2024 నాటికి ఒక బిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి దిశ‌గా క‌ద‌ల‌డంతో స‌హా ఉత్ప‌త్తి ల‌క్ష్యాల ప్ర‌ధాన సామ‌ర్ధ్యాలపై దృష్టి పెడుతూనే బొగ్గు రంగాన్ని నూత‌న సాంకేతిక‌త‌ల దిశ‌గా న‌డిపించ‌డం స‌హా మొత్తం అన్ని రంగాల‌పైనా ప‌రిగ‌ణించింది. 
ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22కు ప్రాజెక్టులు, ఝ‌రియా మాస్ట‌ర్ ప్లాన్‌, నియంత్ర‌ణా సంస్క‌ర‌ణ‌లు (అన్వేష‌ణ‌),  బొగ్గు శుద్ధి (బెనిఫీసియేష‌న్‌), బొగ్గు గ‌నుల ప‌రిర‌క్ష‌ణ‌, కోకింగ్ బొగ్గ వ్యూహం, మార్కెటింగ్ సంస్క‌ర‌ణ‌లు, బొగ్గు ధ‌ర‌ల సంస్క‌ర‌ణ‌లు, భూసేక‌ర‌ణలో సంస్క‌ర‌ణ‌లు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు బ‌ట్వాడా & నిల్వ‌,  పొరుగుదేశాల‌లో బొగ్గు ఎగుమ‌తులు, వేలం ద్వారా కేటాయించిన గ‌నుల‌లో బొగ్గు ఉత్ప‌త్తిని పెంచేందుకు వ్యూహం స‌హా ప‌లు అంశాలు బొగ్గు రంగ సంస్క‌ర‌ణ‌ల‌లో పొందుప‌రిచారు. 
అదే స‌మ‌యంలో బొగ్గు నుంచి ప‌రివ‌ర్త‌న‌, బొగ్గు త‌వ్వ‌కాలు నిలిపివేసిన భూముల‌లో కూడా ఆదాయాన్ని ఆర్జించ‌డం, డాటా మైనింగ్ /  డ్రోన్లలో  ఆర్టిఫిషియ‌ల్‌ ఇంటెలిజెన్స్ (ఎఐ) వినియోగం, సుస్థిర‌త ( నిక‌ర సున్నా ఉద్గారాల దిశ‌గా) దృష్టి పెట్ట‌డం. 
పైన పేర్కొన్న ఎజెండాలోని సంస్థాగ‌త సామ‌ర్ధ్య నిర్మాణం విభాగంలో  కోల్ కంట్రోల‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (సిసిఒ), కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (సిఎంపిఎఫ్ఒ), బొగ్గు ప‌రీక్ష‌ల ప్ర‌యోగ‌శాల‌ల ఆధునీక‌ర‌ణ‌, సిబ్బంది నాణ్య‌త‌, శిక్ష‌ణ స‌మ‌స్య‌లుకు సంబంధించిన సంస్క‌ర‌ణ‌లు ఉన్నాయి. 
బొగ్గు నుంచి ర‌సాయ‌నం స‌హా. సిన్ గ్యాస్‌, హైడ్రోజ‌న్ గ్యాస్‌, ద్ర‌వ ఇంధ‌నాలు, ర‌సాయ‌నాలు, ఎరువులు, సిఐఎల్ -  ఇవిలు, ఎల‌క్ట్రిక్ చార్జింగ్ పాడ్స్ త‌యారీ స‌హా లో నూత‌న ప‌రిశ్ర‌మ‌లకు (స‌న్‌రైజ్ ఇండ‌స్ట్రీస్)  గ‌ల అవ‌కాశాల అన్వేష‌ణ త‌దిత‌రాలు స‌హా వివిద అంశాల‌ను భ‌విష్య‌త్ ఎజెండాలో పొందుప‌రిచారు. అలాగే, త‌గిన శ్ర‌ద్ధ‌తో ప‌రిగ‌ణించి అటువంటి లేదా నూత‌న వ్యాపారాల స్వాధీనం, విలీనాలు, మీడియా ప్ర‌చారం, సిఎస్ఆర్ కార్య‌క‌లాపాల సన్నిహిత ప‌ర్య‌వేక్ష‌ణ వంటివ‌న్నీ కూడా ఆర్ధిక సంవ‌త్స‌రం 2022-23కు  ఎజెండాలో కొన‌సాగిస్తున్నారు. 
ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22కు బొగ్గు మంత్రిత్వ శాఖ కార్య‌సాధ‌న స్థితిగ‌తుల‌కు సంబంధించిన వివ‌రాలు బొగ్గు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో దిగువ‌న పేర్కొన్న లింక్ ద్వారా అందుబాటులో ఉన్నాయి: -
https://coal.nic.in/sites/default/files/2022-05/31-05-2022b-wn.pdf

***



(Release ID: 1832528) Visitor Counter : 96