స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు

రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంపు


ఆర్.బి.ఐ. నిర్ణయం
2022-23లో జి.డి.పి. వృద్ధి రేటు 7.2శాతం
ద్రవ్యోల్బణం 6.7శాతం ఉంటుందని అంచనా..

రూపేకార్డు మొదలుకొని క్రెడిట్ కార్డులతో
యు.పి.ఐ. అనుసంధానానికి అవకాశం.

ఇ-మ్యాండేట్ లావాదేవీ పరిమితి
రూ. 15,000కు హెచ్చింపు...
సహకార బ్యాంకుల గృహనిర్మాణ రుణ పరిమితి వందశాతానికి పైగా హెచ్చింపు...

Posted On: 08 JUN 2022 11:32AM by PIB Hyderabad

కీలక విధాన రేట్లు

  • రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి, 4.90శాతం చేయాలని 2022 జూన్ 6-8 తేదీల మధ్య సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ.) ద్రవ్య విధాన కమిటీ (ఎం.పి.సి.) ఏకగ్రీవంగా నిర్ణయించింది.
  • ఈనిర్ణయం పర్యవసానంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 4.65శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్ 5.15శాతానికి సర్దుబాటు అయింది.
  • అభివృద్ధికి మద్దతును అందిస్తూనే, ద్రవ్యోల్బణం లక్ష్య పరిధిలోనే ఉండేలా చూడాలని కూడా ఎం.పి.సి. నిర్ణయించింది.
  • ద్రవ్యోల్బణం

2022వ సంవత్సరంలో సాధారణ వర్షపాతం ఉంటుందని, భారతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 105 అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తూ 2022-23వ సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7శాతం ఉండవచ్చని భావిస్తున్నారు.

1వ  త్రైమాసికం (క్యు1) - 7.5శాతం

2వ త్రైమాసికం (క్యు 2) - 7.4శాతం

3వ త్రైమాసికం (క్యు3) - 6.2%

4వ త్రైమాసికం (క్యు4) - 5.8%

  • అభివృద్ధి సూచన

  కొన్ని దశాబ్దాల తరబడి ఎక్కువ స్థాయిలో నమోదవుతున్న ద్రవ్యోల్బణం, అభివృద్ధి మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు, ముడి చమురు, ఇతర సరకుల ధరలు పెరగడం, కోవిడ్-19 వంటి సరఫరా వ్యవస్థల అడ్డంకులు తదితర పరిణామాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెనుగులాడుతోందని ద్రవ్య విధాన కమిటీ అభిప్రాయపడింది.

  • భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నట్టుగా ఏప్రిల్, మే నెలలో వెలువడిన ఆర్థిక సూచికలు తెలియజేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో గిరాకీ క్రమంగా కోలుకుంటూ ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ నెమ్మదిగా మెరుగుపడుతూ వస్తోంది. వ్యాపార ఉత్పాదనల ఎగుమతి రెండంకెల స్థాయిలో అభివృద్ధి వరుసగా 15వ నెలలో కూడా నమోదైనట్టు మే నెలలో తేలింది. కాగా, చమురు, బంగారం మినహా మిగతా సరకుల దిగుమతులు ఆరోగ్యకరమైన వేగంతో విస్తరిస్తూనే ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే స్వదేశీ ఉత్పాదనల గిరాకీ క్రమంగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.
  • 2022-23వ ఆర్థిక సంవత్సరంలో స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.డి.పి.) వాస్తవ అభివృద్ధి 7.2శాతం వరకూ ఉండవచ్చని అంచనా వేశారు.

1వ  త్రైమాసికం (క్యు1) - 16.2 శాతం

2వ త్రైమాసికం (క్యు2) - 6.2శాతం

3వ త్రైమాసికం (క్యు3) - 4.1శాతం

4వ త్రైమాసికం (క్యు4) - 4.0శాతం

  • 2021-22వ సంవత్సరంలో భారతదేశపు స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.డి.పి.) వృద్ధి 8.7శాతం ఉండవచ్చని మే నెల 31న విడుదలైన జాతీయ గణాంక కార్యాలయం (ఎన్.ఎస్.ఒ.) తాత్కాలిక అంచనాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందున్న జి.డి.పి. కంటే ఇది ఎక్కువ.

సహకార బ్యాంకుల ప్రయోజనాల కోసం చర్యలు

  1. ఇదివరకు ధరలు సవరించినప్పటినుంచి ఇప్పటి వరకూ పెరిగిన గృహనిర్మాణ రేట్లను, వినియోగదారుల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ, సహకార బ్యాంకులు మంజూరు చేసే వ్యక్తిగత గృహ నిర్మాణ రుణాల పరిమితులను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఒకటవ కేటగిరీ పట్టణ సహకార బ్యాంకుల రుణాల పరిమితిని రూ. 30లక్షల నుంచి రూ. 60లక్షలకు , రెండవ కేటగిరీ పట్టణ సహకార బ్యాంకుల పరిమితిని రూ. 70లక్షలనుంచి  రూ. 140 లక్షలకు పెంచారు.
  2. ఇక రూ. 100కోట్ల లోపు నెట్వర్త్ ఉన్న ప్రాంతీయ సహకార బ్యాంకులకు (ఆర్.సి.బి.లకు) సంబంధించి పరిమితులు రూ. 20లక్షలనుంచి రూ. 50లక్షలకు,  ఇతర ప్రాంతీయ సహకార బ్యాంకుల పరమితిని రూ. 30లక్షల నుంచి రూ. 70 లక్షలకు పెంచారు.
  3. పట్టణ సహకార బ్యాంకులు ఇకపై ఖాతాదార్లకు ఇళ్ల ముంగిటికే బ్యాంకింగ్ సేవలను విస్తరించవచ్చు. దీనితో ఖాతాదారుల అవసరాలను, ప్రత్యేకించి వయోజనుల, విభిన్న సామర్థ్యాలు కలిగిన ఖాతాదార్ల అవసరాలను ఈ బ్యాంకులు మెరుగైన రీతిలో తీర్చేందుకు అవకాశం ఉంటుంది.
  • గ్రామీణ సహకార బ్యాంకులు ఇపుడు వాణిజ్యపరమైన స్థిరాస్థి వర్గాలకు ఆర్థిక సహాయం (అంటే నివాస గృహనిర్మాణ ప్రాజెక్టులకు రుణాలు)  అందించేందుకు అవకాశం కల్పించారు. మొత్తం ఆస్తుల్లో 5శాతం మేర అంటే, ప్రస్తుత సగడు గృహనిర్మాణ ఆర్థిక సహాయ పరమితి పరిధికి లోబడి ఈ రుణం అందిస్తారు.

 

  • ఇ-మ్యాండేట్ లావాదేవీల పరిమితి పొడిగింపు.

 ఖాదాదార్ల సౌకర్యాన్ని మరింత పెంచేందుకు, చందాలు, బీమా ప్రీమియంలు వంటి రికరింగ్ చెల్లింపులకు, ఎక్కువ విలువతో కూడిన విద్యారుసుం చెల్లింపులకు సంబంధించి ఇ-మ్యాండేట్ ఆధారిత ఆధారిత లావాదేవీల పరిమితిని రూ. 5,000నుంచి రూ. 15,000కు పెంచారు.

  • యు.పి.ఐ. చెల్లింపు వ్యవస్థ పరిధిని పెంచడం.

రూపే కార్డులు మొదలుకొని ఇపుడు క్రెడిట్ కార్టులను కూడా యు.పి.ఐ. వేదికకు అనుసంధానం చేయవచ్చు. దీనితో వినియోగదారులు జరిపే డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరింపజేయడానికి అవకాశం ఏర్పడుతుంది. యు.పి.ఐ.వ్యవస్థ అనేది భారతదేశంలో పూర్తి సమ్మిళిత చెల్లింపుల విధానంగా రూపొందింది. ప్రస్తుతం 26కోట్లమంది వినియోగదార్లు, 5కోట్ల మంది వ్యాపారులు యు.పి.ఐ. వేదికతో అనుసంధానమై ఉన్నారు.

  • ద్రవ్య విధాన కమిటీ (ఎం.పి.సి.)లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తి దాస్‌తో పాటుగా, డాక్టర్ శశాంక్ భిడే, డాక్టర్ అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ, డాక్టర్ రాజీవ్ రంజన్, డాక్టర్ మైకేల్ దేవవ్రత పాత్ర ప్రతినిధులుగా వ్యవహరించారు. 

 

  • ఎం.పి.సి. తదుపరి సమావేశం 2022 ఆగస్టు నెల 2-4 తేదీల మధ్య జరుగుతుంది.

RBIరిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వివరణాత్మక ప్రసంగ పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.

 

***



(Release ID: 1832525) Visitor Counter : 176