వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం... ప్రధానమంత్రి గతి శక్తి ని అనుకరిస్తుంది: శ్రీ పీయూష్ గోయల్

प्रविष्टि तिथि: 07 JUN 2022 11:38AM by PIB Hyderabad

పరిశ్రమల స్థాపనకు కేరళ రాష్ట్రంలోని సహజసిద్ధమైన అవకాశాలను ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి పెట్టుబడిదారులను కోరారు. వ్యాపార కార్యకలాపాలకు అడ్డంకులు లేకుండా చేయడంతోపాటు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ విజన్‌పై ప్రధాని చాలా స్పష్టంగా ఉన్నారని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సుపరిపాలన సందేశాన్ని ప్రచారం చేస్తోందని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు.

కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పి.రాజీవ్ ప్రసంగిస్తూ సంవత్సరంలో లక్ష ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బెంగళూరు-కొచ్చి పారిశ్రామిక కారిడార్‌ను తిరువనంతపురం వరకు పొడిగించాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.  డిపిఐఐటి జాయింట్ సెక్రటరీ రాజేంద్ర రత్నూ, కిన్‌ఫ్రా ఎండి సంతోష్ కోశి థామస్, కేరళ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సుమన్ బిల్లా, ఎన్‌ఐసిడిసి వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ చౌదరి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

***


(रिलीज़ आईडी: 1831819) आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil