గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రేపు న్యూఢిల్లీలో 'జాతీయ గిరిజన పరిశోధన సంస్థ'ను (ఎన్‌టీఆర్ఐ) ప్రారంభించనున్న శ్రీ అమిత్ షా
- గిరిజన వారసత్వం, సంస్కృతి మరియు గిరిజన పరిశోధనకు ఎన్‌టీఆర్ఐ నాడీ-కేంద్రంగాను.. ప్రచార మరియు సంరక్షణ ప్రధాన జాతీయ సంస్థగా నిలుస్తుంది
- దేశవ్యాప్తంగా 100 మందికి పైగా గిరిజన కళాకారులు, గిరిజన నృత్య కళాకారులు తమ దేశీయ ఉత్పత్తులు మరియు నృత్యాలను కార్యక్రమంలో ప్రదర్శిస్తారు.
Posted On:
06 JUN 2022 2:05PM by PIB Hyderabad
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ గిరిజన పరిశోధనా సంస్థను (ఎన్‌టీఆర్ఐ) కేంద్ర హోం శాఖ, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా రేపు (జూన్ 7వ తేదీ) న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. విద్య, కార్యనిర్వాహక మరియు శాసన రంగాలలో గిరిజనుల ఆందోళనలు, సమస్యలు విషయాలపై ఎన్‌టీఆర్‌ఐ ఒక ప్రధాన జాతీయ స్థాయి సంస్థగా ఉంటూ .. నాడీ-కేంద్రంగా వ్యవహరిస్తుంది. ఇది ప్రఖ్యాత పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు అలాగే విద్యా సంస్థలు మరియు వనరుల కేంద్రాలతో సహకరిస్తుంది మరియు అనుసంధానం చేస్తుంది. ఇది ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు (టీఆర్‌ఐలు), సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈలు), ఎన్ఎప్ఎస్ యొక్క రీసెర్చ్ స్కాలర్‌ల ప్రాజెక్ట్‌లను పర్యవేక్షిస్తుంది. పరిశోధన మరియు శిక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. దీని ఇతర కార్యకలాపాలేమిటంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర సంక్షేమ శాఖలకు పాలసీ ఇన్‌పుట్‌లను అందించడం, గిరిజన జీవనశైలి యొక్క సామాజిక-ఆర్థిక అంశాలను మెరుగుపరచడానికి లేదా మద్దతునిచ్చే అధ్యయనాలు మరియు కార్యక్రమాల రూపకల్పన చేయడం వంటివి ఉన్నాయి, దీనికి తోడు పీఎంఏఏజీవై యొక్క డేటా బేస్‌ను రూపొందించడం మరియు నిర్వహించడం, గిరిజన మ్యూజియంల ఏర్పాటు, నిర్వహణలో తగిన మార్గదర్శకాలను అందించడం మరియు భారతదేశంలోని సుసంపన్నమైన గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని ఒకే గొడుగు కింద ప్రదర్శించడం ఎన్‌టీఆర్ఐ కార్యకలాపాలలలో భాగంగా ఉండనుంది. గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, న్యాయ మరియు న్యాయవ్యవహారాల శాఖ మంత్రి శ్రీ. కిరెన్ రిజిజు; సహా ఇతర క్యాబినెట్ మరియు సహాయ మంత్రులు పాల్గొంటారు. గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రులు శ్రీమతి రేణుకా సింగ్ సరుత; శ్రీ బిశ్వేశ్వర్ తుడు; మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ. జాన్ బార్లా, గ్రామీణాభివృద్ధి శాఖ ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాన మంత్రి నేతృత్వంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను ప్రదర్శించేలా కార్యక్రమంలో ఒక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ గిరిజన కళాకారులు మరియు గిరిజన నృత్య బృందాలు వారి దేశీయ ఉత్పత్తులు, తమ ప్రదర్శనలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఎగ్జిబిషన్‌ను మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రజల కోసం తెరిచి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు గిరిజన బృందాలు నృత్య ప్రదర్శనలిస్తాయి.
***
(Release ID: 1831711)
Visitor Counter : 200