సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

జాతీయ ప్రయోజనాల కోసం చర్య తీసుకోవాలని పిలుపునిచ్చిన డైరెక్ట్-టు-మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ కాన్‌క్లేవ్

Posted On: 02 JUN 2022 4:12PM by PIB Hyderabad

జూన్ 1 2022న దిల్లీలోని ప్రసార భారతిలోని ఆకాశవాణి రంగ్‌భవన్ ఆడిటోరియంలో టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఇండియా (TSDSI) సహకారంతో ఐఐటీ కాన్పూర్ 'డైరెక్ట్ టు మొబైల్, 5G బ్రాడ్‌బ్యాండ్ - కన్వర్జెన్స్ రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియా' అనే అంశంపై కాన్‌క్లేవ్ నిర్వహించింది.


ట్రాయ్ ఛైర్మన్ డా. పిడి వాఘేలా ఈ కాన్‌క్లేవ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, టిఎస్‌డిఎస్‌ఐ ఛైర్మన్ ఎన్‌జి సుబ్రమణ్యం, టెలికమ్యూనికేషన్స్ విభాగంలో సభ్యుడు (టెక్నాలజీ) ఎకె తివారీ, ప్రసార భారతి సిఇఒ శశి శేఖర్ వెంపటి, ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరాండీకర్, టిఎస్‌డిఎస్‌ఐ డీజీ శ్రీమతి పమేలా కుమార్ ఇందులో పాల్గొన్నారు. ప్రారంభ ప్రసంగాలలో భాగంగా టెలికమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి కె. రాజారామన్ వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. ఈ సమావేశానికి టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ బ్రాడ్‌కాస్ట్ పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు.


ఐఐటీ కాన్పూర్, టిఎస్‌డిఎస్‌ఐ, ప్రసార భారతి సంయుక్తంగా ‘డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్‌’పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. స్మార్ట్ ఫోన్‌లు మరియు ఇతర స్మార్ట్ పరికరాలలో నెక్స్ట్‌జెన్ బ్రాడ్‌కాస్ట్ సాంకేతికతను మొదటిసారిగా ఈ సమావేశంలో ప్రదర్శించారు.


ట్రాయ్ ఛైర్మన్ డా. పీడీ వాఘేలా కాన్‌క్లేవ్‌లో ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ, 'డైరెక్ట్ టు మొబైల్, 5జీ బ్రాడ్‌బ్యాండ్ బ్రాడ్‌కాస్ట్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, మీడియా మరియు ఇతర సంబంధిత వాటాదారులందరినీ ఒకచోట చేర్చే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. సేవల డిజిటలైజేషన్ ద్వారా వ్యక్తిగత డెలివరీ & వినియోగదారు పరికరాల కలయికకు దారితీసిందని ఆయన అన్నారు. విస్తృతమైన సేవలు అందించాలనే తపన, ప్రసార & బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్‌లను ఒకదానికొకటి కలిసేలా ప్రేరేపిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ సేవలకు బ్రాడ్‌కాస్టింగ్ సేవలను అందించడం ఇప్పుడు సాధ్యమేనని ఆయన అన్నారు.


కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వినియోగదారుల దృక్కోణం నుండి మాట్లాడుతూ, “డైరెక్ట్-టు-మొబైల్ మరియు 5జీ బ్రాడ్‌బ్యాండ్ మధ్య కలయిక భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగాన్ని మరియు స్పెక్ట్రమ్ వినియోగాన్ని మెరుగుపరుస్తుందన్నారు. దాదాపు ప్రతి ఒక్కరూ ఇప్పుడు తమ మొబైల్‌ల ద్వారా వీడియో కంటెంట్‌ని వినియోగిస్తున్నారు, యాప్‌ల ద్వారా మొబైల్‌లో వార్తలను చూడవచ్చు, ప్రసార భారతి కూడా దాని స్వంత న్యూస్‌ఆన్‌ఎయిర్ యాప్‌ని కలిగి ఉంది, ఇందులో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. డైరెక్ట్-టు-మొబైల్ మరియు 5జీ బ్రాడ్‌బ్యాండ్ మధ్య ఈ కలయిక వల్ల మౌలిక సదుపాయాలలో కొన్ని మార్పులు మరియు కొన్ని నియంత్రణ మార్పులు వస్తాయి.


 “కనెక్టివిటీ అవసరాన్ని తీర్చడానికి పరిష్కారం కన్వర్జ్డ్ నెట్‌వర్క్‌ని సృష్టించడం. ప్రసార, బ్రాడ్‌బ్యాండ్ & సెల్యులార్ నెట్‌వర్క్‌ల కలయిక వీటి కోఎగ్జిస్టెన్స్ సమస్యలను పరిష్కరిస్తుంది" అని టెలికమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కె. రాజారామన్ తన వీడియో సందేశంలో తెలిపారు.


ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్, ప్రొఫెసర్ అభయ్ కరాండీకర్ తన ప్రసంగంలో పెరిగిన వీడియో వినియోగం, ప్రత్యేకంగా స్ట్రీమింగ్ సేవలు, ఐఓటీ, గ్రూప్ కనెక్షన్లు, అత్యవసర ప్రతిస్పందన కమ్యూనికేషన్ సిస్టమ్‌లు మొదలైన అనేక కొత్త సేవలతో పాటు అవసరాన్ని & మద్దతును సృష్టించాయి.


టిఎస్‌డిఎస్‌ఐ చైర్మన్ ఎన్‌జీ సుబ్రమణ్యం మాట్లాడుతూ సెల్యులార్ పరిశ్రమ 5జీని అవలంబిస్తున్నదని మరియు ప్రసార పరిశ్రమ ఇప్పుడు ఇంటర్నెట్, వైఫై & 5జీలో భాగమైందని అన్నారు. కనెక్టివిటీ ఈ కొత్త యుగానికి వెన్నెముకగా ఏర్పరుచుకున్నందున, ఇవి కలిసి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పరివర్తన రేపటి రోజులను నడిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

భారతదేశంలో బ్రాడ్‌కాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ కన్వర్జెన్స్ ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని టిఎస్‌డిఎస్‌ఐ డీజీ శ్రీమతి పమేలా కుమార్ అన్నారు. ప్రపంచంలో మొబైల్ కమ్యూనికేషన్‌లో మొదటి స్థానంలో డేటా వినియోగదారుగా ఉన్నందున, భారతదేశం దీనికి మార్గదర్శకత్వం వహించాలని ఆమె అన్నారు.


 ‘సాంఖ్య ల్యాబ్స్’ సీఈఓ పరాగ్ నాయక్‌తో ఒకరితో ఒకరు పరస్పరం జరిపిన సంభాషణలో, ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ వెంపటి వ్యూహాత్మక, జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుండి భారతదేశం వంటి దేశానికి డైరెక్ట్ టు మొబైల్ ప్రసారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.


ఈ కాన్‌క్లేవ్‌ చివరలో డైరెక్ట్ టు మొబైల్ మరియు 5జీ బ్రాడ్‌బ్యాండ్ కలయికపై శ్వేతపత్రం విడుదల చేసింది. భారతదేశంలో డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ సామర్థ్యాలను గ్రహించి, దానిని సాధించేందుకు వివిధ వాటాదారులకు సిఫార్సులు చేసింది.


డైరెక్ట్-టు-మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్‌పై శ్వేత పత్రాన్ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు - 

https://prasarbharati.gov.in/white-paper-on-direct-to-mobile-broadcasting/

దిగువ QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మీరు శ్వేతపత్రాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు.
 
శ్వేతపత్రంలోని ముఖ్య సిఫార్సులను వీడియో రూపంలో ఇక్కడ చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=YjSiGoB8qvU
 
కాన్‌క్లేవ్‌లో డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ యొక్క ప్రదర్శనను చూడటానికి లింక్‌పై క్లిక్ చేయండి లేదా క్రింది QR కోడ్‌ని స్కాన్ చేయండి.
https://prasarbharati.gov.in/demo-of-direct-to-mobile-broadcasting/
 
కాన్‌క్లేవ్‌ యొక్క పూర్తి వీడియోను ఇక్కడ చూడండి -
https://www.youtube.com/watch?v=hxrs5Q2-j1w

 

*****



(Release ID: 1830853) Visitor Counter : 161