మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచిన పిఎం కేర్స్
తిరువనంతపురంలో ప్రయోజనాలను పంపిణీ చేసిన కేంద్ర సహాయమంత్రి వి. మురళీధరన్
Posted On:
30 MAY 2022 3:08PM by PIB Hyderabad
అర్హులైన పిల్లలకు పిఎం కేర్స్ కింద లబ్ధులను విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ వి. మురళీధరన్ సోమవారం తిరువనంతపురంలోని సివిల్ స్టేషన్‌లో నిర్వహించిన వేడుకలో అందచేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 11మంది పిల్లలు కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఈ ఉపకారాన్ని అందుకున్నారు. వీరిలో ఎనిమిదిమంది పిల్లలు 18 ఏళ్ళకన్నా తక్కువ వయసు ఉన్నవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశంతో కూడిన లేఖ, ఆర్ధిక ప్రయోజనాల కోసం పిఎం కేర్స్ అకౌంట్‌కు సంబంధించిన పాస్ బుక్, ఉచిత చికిత్స, ఆరోగ్య సంరక్షణ కోసం హెల్త్ కార్డ్, విద్యా ప్రయోజనాలను పిల్లలకు పంపిణీ చేశారు. మొత్తం 112మంది కేరళకు చెందిన పిల్లలు ఈ సాయాన్ని అందుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి నవ్‌జోత్ సింగ్ ఖోసా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1829593)
Visitor Counter : 123