నౌకారవాణా మంత్రిత్వ శాఖ

అంతర్గత నౌకాశ్రయ సౌకర్యాలను మరింత లోతుగా మరియు ఆప్టిమైజేషన్ చేయడానికి రూ.3,004.63 కోట్ల అంచనా వ్యయంతో పారాదీప్ పోర్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతుంది.


శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ " పారాదీప్ పోర్ట్ మెగా పోర్ట్‌గా మారే దిశగా ఈ ప్రాజెక్ట్ మైలురాయి అని మరియు తూర్పు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా ఉందని" చెప్పారు.

Posted On: 29 MAY 2022 1:56PM by PIB Hyderabad

ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆర్థికంగా, సామాజికంగా మరియు పర్యావరణపరంగా స్థిరమైన మరియు ఆచరణాత్మకంగా బట్వాడా చేయగల పెట్టుబడి పెట్టదగిన ప్రాజెక్టులతో పాటు దీర్ఘకాలికంగా వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రణాళికపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా బలమైన సంకల్పం మరియు నాయకత్వాన్ని ఆధారం చేయడం ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకుంది. పారాదీప్ పోర్ట్‌లో క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ ఆ దూరదృష్టితో కూడిన కార్యక్రమాలలో ఒకటి. ఇది ఓడరేవును ప్రపంచ స్థాయి ఆధునిక ఓడరేవుగా మారుస్తుంది. ఇది క్యాప్సైజ్ నౌకను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తూర్పు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధాని దృష్టి సారిస్తుండటంతో భవిష్యత్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పారాదీప్ పోర్ట్‌లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) విధానంలో నిర్మించడం, నిర్వహించడం మరియు బదిలీ చేయడం (బిఓటీ) ఆధారంగా వెస్ట్రన్ డాక్‌ను అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా అంతర్గత నౌకాశ్రయ సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడం మరియు ఆప్టిమైజేషన్ చేయడం ఈ ప్రాజెక్ట్‌లో ఉంటుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,004.63 కోట్లు. ఇందులో బిఓటీ ప్రాతిపదికన కొత్త వెస్ట్రన్ డాక్‌ను అభివృద్ధి చేయడం మరియు ఎంపిక చేసిన రాయితీదారు ద్వారా వరుసగా రూ. 2,040 కోట్లు మరియు రూ. 352.13 కోట్ల వ్యయంతో మూలధన డ్రెడ్జింగ్; మరియు పారాదీప్ పోర్ట్ యొక్క పెట్టుబడి సాధారణ మద్దతు ప్రాజెక్ట్ మౌలిక సదుపాయాలను అందించడానికి రూ. 612.50 కోట్ల వరకు ఉంది.

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ పారాదీప్ ఓడరేవు మెగా పోర్ట్‌గా మారడానికి ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయి అని అన్నారు. ఇది తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ కేప్ సైజ్ నౌకలను నిర్వహించడంలో పోర్ట్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని, పోర్ట్ సామర్థ్యం 25 ఎంఎంటిపిఏకి అదనంగా దోహదపడుతుందని మరియు ఓడరేవు సామర్థ్యంలో మెరుగుదల, మెరుగైన కార్గో హ్యాండ్లింగ్,  వాణిజ్యం పెంపు,  ఉపాధి కల్పన మరియు సహా సామాజిక-ఆర్థిక వృద్ధికి దారి తీస్తుందని మంత్రి చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ ఓడరేవులో రద్దీని తగ్గించడంతో పాటు బొగ్గు దిగుమతులను చౌకగా చేసే సముద్ర రవాణాను పెంపొందిస్తుంది. ఉపాధి అవకాశాల కల్పనకు దారితీసే పోర్ట్‌లోని లోతట్టు ప్రాంతాలలో పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. ప్రాజెక్ట్ తర్వాత 18 మీటర్ల డ్రాఫ్ట్ అవసరమయ్యే భారీ నౌకలను పోర్ట్  సులభంగా నిర్వహించగలదు. దాంతో లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతుంది మరియు ప్రస్తుత ప్రపంచ పోటీ వాతావరణంలో ఎగ్జిమ్‌ వాణిజ్యాన్ని పెంచుతుంది.

1966లో ఇనుప ఖనిజం ఎగుమతి కోసం మోనో కమోడిటీ పోర్ట్‌గా పారాదీప్ పోర్ట్ అథారిటీ ప్రారంభించబడింది. గత 54 సంవత్సరాలలో, ఇనుప ఖనిజం, క్రోమ్ ఖనిజం, అల్యూమినియం కడ్డీలు, బొగ్గు, పిఓఎల్, ఎరువుల ముడి పదార్థాలు, లైమ్ స్టోన్, క్లింకర్, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, కంటైనర్లు మొదలైన అనేక రకాల ఎగ్జిమ్‌ కార్గోను నిర్వహించడానికి పోర్ట్ రూపాంతరం చెందింది. పారదీప్ పోర్ట్ అథారిటీ (కన్సెషనింగ్ అథారిటీ) 25 ఎంటిపిఏ (సంవత్సరానికి రెండు దశల్లో సంవత్సరానికి మిలియన్ టన్నులు) అంతిమ సామర్థ్యంతో ఎంచుకున్న బిఓటీ రాయితీదారు ద్వారా కేప్ సైజు నౌకలను నిర్వహించడానికి వీలుగా బ్రేక్‌వాటర్ పొడిగింపు & ఇతర అనుబంధ పనుల వంటి సాధారణ సహాయక ప్రాజెక్ట్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌ పారాదీప్ పోర్ట్ సమీప ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటును పరిగణనలోకి తీసుకుని గ్రాన్యులేటెడ్ స్లాగ్ & ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతితో పాటు బొగ్గు & సున్నపురాయి దిగుమతుల అవసరాన్ని తీరుస్తుంది.


 

****



(Release ID: 1829300) Visitor Counter : 105


Read this release in: Hindi , English , Urdu , Odia , Tamil