సహకార మంత్రిత్వ శాఖ
గుజరాత్ పర్యటనలో రెండవ రోజైన నేడు గోద్రాలోని పంచామృత్ డెయిరీలో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించి, అంకితం చేసిన కేంద్ర హోం , సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
పిడిసి బ్యాంక్ ప్రధాన కార్యాలయం కొత్త భవనం, 3 మొబైల్ ఎటిఎమ్ వ్యాన్ లు, గంటకు 30 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్, మాలేగావ్ (మహారాష్ట్ర) వద్ద పంచామృత్ బట్టర్ కోల్డ్ స్టోరేజీ డైరీ ప్లాంట్ ను అంకితం చేసి, ఉజ్జయిన్ (మధ్యప్రదేశ్) వద్ద డైరీ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన శ్రీ అమిత్ షా
కొన్నేళ్ళుగా దేశం నలుమూలల నుండి సహకార ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రజలు గత ప్రభుత్వాల నుండి సహాయం కోరుతూనే ఉన్నా వారు ఏమీ చేయలేదు:
సహకార ఉద్యమానికి, ఒక సంవత్సరం క్రితం మొదటిసారిగా, కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇచ్చి, బడ్జెట్ ను ఏడు రెట్లు పెంచారు;
సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన
తరువాత రానున్న ఐదు సంవత్సరాల లోనే
శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార రంగంలో పెద్ద విప్లవం:
అమూల్ అనే పేరు వినిపించినప్పుడల్లా ప్రతిచోటా ప్రజలు ముగ్ధులవుతారు: రూ.60 వేల కోట్ల టర్నోవర్ కలిగిన ఇంత పెద్ద సహకార ఉద్యమాన్ని ఊహించడం కష్టం.
శ్రీ మోదీ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించారు: గో సంరక్షణ , ప్రోత్సాహం కోసం ఎంతో కృషి చేశారు
కేంద్రంలోని నర
Posted On:
29 MAY 2022 4:47PM by PIB Hyderabad
గుజరాత్ పర్యటన లో ఉన్న కేంద్ర హోం , సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా రెండవ రోజు ఆదివారం నాడు గోద్రా లోని పంచామృత్ డెయిరీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు.
పిడిసి బ్యాంక్ ప్రధాన కార్యాలయం కొత్త భవనం, 3 మొబైల్ ఎటిఎమ్ వ్యాన్ లు, గంటకు 30 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్, మాలేగావ్ (మహారాష్ట్ర) వద్ద పంచామృత్ బట్టర్ కోల్డ్ స్టోరేజీ డైరీ ప్లాంట్ ను అంకితం చేసి, ఉజ్జయిన్ (మధ్యప్రదేశ్) వద్ద డైరీ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి
శ్రీ భూపేంద్ర పటేల్ , కేంద్ర మంత్రి
శ్రీ పురుషోత్తం రుపాల తో సహా పలువురు
ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా తన
ప్రసంగంలో, ఈ రోజు జరిగిన ఐదు
కార్యక్రమాలు మూడు జిల్లాల (పంచ్ మహల్ మాలేగావ్,ఉజ్జయిని) సహకార ఉద్యమాన్ని
బలోపేతం చేయనున్నాయని అన్నారు.
నేడు పంచమహల్, మహిసాగర్ ,దాహోద్ జిల్లాలలోని 1,598 పాల మార్కెట్లు 73 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తూ బలమైన యూనియన్ గా మన ముందు ఉన్నాయి. 18 లక్షల లీటర్ల పాలు, రూ.300 కోట్ల టర్నోవర్ సాధించడం ఎంతో భారీ విజయం
సహకార ఉద్యమంతో సంబంధం ఉన్న దేశం నలుమూలల నుండి ప్రజలు సహకార ఉద్యమానికి అవసరమైన సహాయాన్ని పొందాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారని, దీని కోసం ప్రజలు గత ప్రభుత్వాల నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నారని, వారు ఏమీ చేయలేదని కేంద్ర సహకార మంత్రి అన్నారు. ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సహకార
కార్యకలాపాల కోసం సంవత్సరం క్రితం
మొదటిసారిగా కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేసి, దానికి ప్రాధాన్యత నిచ్చారని చెప్పడానికి నేను గ ర్విస్తున్నాను.
దీనితో పాటు ప్రధాన మంత్రి సహకార సంఘాల బడ్జెట్ ను ఏడు రెట్లు పెంచారు. ఇది కాకుండా, సహకార చక్కెర మిల్లులకు చక్కెర ధర పెరగడం వల్ల ప్రయోజనం పొందడానికి,ప్రధాన మంత్రి దానిపై పన్ను తొలగించారు. అన్ని సహకార సంస్థల పై మ్యాట్ (మ్యాట్) టాక్స్ 18 శాతంగా ఉండ గా, శ్రీ మోదీ సహకార సంస్థల ప్ర యోజనాల కోసం కంపెనీలతో సమానంగా దానిని తగ్గించారు. శ్రీ మోదీ సర్ ఛార్జీని 12 నుంచి 7 శాతానికి తగ్గించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మండీలను నేరుగా నాబార్డుతో అనుసంధానించే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందకోసం రూ. 6,500 కోట్లు ఖర్చు చేయనుంది.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Z3HO.jpg
‘‘అమూల్ గురించి ఎప్పుడు మాట్లాడినా దేశ విదేశాల ప్రజల కళ్లు మెరుస్తుంటాయి అని శ్రీ అమిత్ షా అన్నారు.60 వేల కోట్ల టర్నోవర్ తో భారీ సహకార ఉద్యమాన్ని ఊహించడం కష్టం. సహకార శాఖ మంత్రి గా నేను
చెబుతున్నాను. నరేంద్ర మోదీ సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. వచ్చే ఐదు సంవత్సరాలలో శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో సహకార రంగంలో ఒక పెద్ద విప్లవం ఉంటుంది‘‘ అని శ్రీ అమిత్ షా అన్నారు. అనేక కొత్త ప్రాంతాలను జోడించడం, వారి డేటాబేస్ ను తయారు చేయడం, దాని కోసం శిక్షణను ఏర్పాటు చేయడం గురించి చర్చ జరుగుతోంది. పి ఎ సి ఎస్ ల సంఖ్యను మూడింతలు చేయడానికి చట్టపరమైన సంస్కరణల గురించి కూడా మేము ఆలోచిస్తున్నాము అని చెప్పారు.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004638Y.jpg
కేంద్ర హోం ,సహకార శాఖల మంత్రి ఇంకా తమ ప్రసంగం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించారని, గోవుల సంరక్షణ కు, ప్రోత్సహించడానికి కృషి చేశారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో సేంద్రియ ఉత్పత్తుల ధరలు పెరగడమే కాకుండా ఉత్పత్తి కూడా పెరుగుతుంది.ఇటీవల, అమూల్ సహజ వ్యవసాయం నుండి ఉత్పత్తి చేయబడిన సేంద్రీయ గోధుమ పిండిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది దీని తరువాత కూరగాయలు ఉంటాయి. ఏడాదిలోగా 100కు పైగా జిల్లాల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేసి భూమి, సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతను ధృవీకరించాలని అమూల్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో భాగంగా మన స్వదేశీ ఆవులు, గేదెలను
మరింత ఎక్కువ పాలు ఇచ్చేలా
సంరక్షించాలని శ్రీ మోదీ ఒక బృహత్తర
నిర్ణయం తీసుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ ఇంకా ఇటువంటి అనేక చొరవలు తీసుకున్నారు.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0051GIB.jpg
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓబీసీ కులాల కోసం అనేక సంస్కరణలు
చేపట్టిందని శ్రీ షా అన్నారు. ‘‘శ్రీ నరేంద్ర మోదీ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ గుర్తింపు ఇచ్చారు. ఓబీసీలకు మెడికల్ సీట్లలో కేంద్ర కోటాలో రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు కల్పించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెనుక బ lడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీ
ప్రజలకు ఇళ్లు, వంటగ్యాస్, విద్యుత్తు, మరుగుదొడ్లు, ఆరోగ్య బీమా వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరింది‘‘ అని శ్రీ అమిత్ శా పేర్కొన్నారు.
*****
(Release ID: 1829298)
Visitor Counter : 160