పార్లమెంటరీ వ్యవహారాలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతిష్ఠాత్మక వారోత్సవ వేడుకలను (30.05.2022 నుంచి 05.06.2022) వరకు నిర్వహించనున్న పార్లమెంరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
Posted On:
29 MAY 2022 4:55PM by PIB Hyderabad
భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని సంస్మరించుకునేందుకు, వేడుక జరుపుకునేందుకు, ముఖ్యంగా భారత్ అమృత్ కాలంలో అడుగిడుతున్న సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 30.05.2022 నుంచి 05.06.2022 వరకు ప్రతిష్ఠాత్మక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఎకెఎఎం) వారోత్సవాలను జరుపుకోనుంది. ప్రతిష్ఠాత్మక వారోత్సవాలలో భాగంగా, యువ పార్లమెంట్ గురించి వీడియో ట్యుటోరియల్‌కు విస్త్రతమైన ప్రచారాన్ని ఇస్తోంది. మన ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేసేందుకు, విద్యార్ధులలో ప్రజాస్వామ్య పద్ధతిని వ్యాప్తి చేసేందుకు, భిన్న అభిప్రాయాలను సహించడాన్ని ప్రోత్సహించడమే కాక, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడంతో పాటుగా పార్లమెంటరీ విధానాలను, పనితీరును వారికి పరిచయం చేయడమన్న యువ పార్లమెంట్ ఉన్నత ఆదర్శాలను ఈ ట్యూటోరియల్ ప్రదర్శించనుంది. ఈ ట్యుటోరియల్ ఎకెఎఎం సందేశాన్ని కలిగి ఉంటుంది.
విస్త్రతమైన వీక్షకులసంఖ్య కోసం వీడియో - ట్యుటోరియల్‌ను దిగువన పేర్కొన్న వివరాల ప్రకారం సంసద్ టీవీలో ప్రసారం చేయనున్నారు:-
ప్రీమియర్ - 30.05.22న ఉదయం 10 గంటలకు
తొలి రిపీట్ టెలికాస్ట్ (తిరిగి ప్రసారం): 02.06.2022న మధ్యాహ్నం 02 గంటలకు
రెండవ రిపీట్ టెలికాస్ట్ (తిరిగి ప్రసారం): 05.06.2022న సాయంత్రం 06 గంటలకు
మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ యువ పార్లమెంట్ పథకం (నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీం -ఎన్‌వైపిఎస్) యూట్యూబ్ ఛానెల్‌పై కూడా ఈ వీడియో- ట్యుటోరియల్‌ను ప్రసారం చేయనున్నారు. దీనిని https://youtu.be/ut32HqVbHeg అన్న లింక్ ను క్లిక్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.
పైన పేర్కొన్న వాటికి అదనంగా కొన్ని పాఠశాలలు ఈ వారోత్సవాల్లో భాగంగా యువ పార్లమెంట్లను ప్రదర్శించనున్నాయి.
అమృత్ కాలం సమయంలో అన్ని శాసనసభల పనిని కాగితరహితంగా పరివర్తన చేయాలని డిజిటల్ లెజిస్లేటర్ల (శాసనసభలు)కు మిషన్ మోడ్ ప్రాజెక్టు అయిన నేషనల్ ఇ విధాన్ అప్లికేషన్ (ఎన్ఇ విఎ) లక్ష్యంగా పెట్టుకుంది. ఒక దేశం- ఒక దరఖాస్తు అన్న సూత్రం ఆధారం అభివృద్ధి చేసిన ఎన్ఇవిఎ ప్రభుత్వ విభాగాలతో సంపర్కంతో సహా మొత్తం ప్రభుత్వ లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో ఒకే వేదికపై అన్ని శాసనసభలకూ తోడ్పడుతుంది. ఎన్ఇవిఎ https://www.neva.gov.in అన్న లింక్ ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు, దాని మొబైల్ ఆప్ ప్లే స్టోర్ & ఆప్ స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.
ప్రతిష్ఠాత్మక వారోత్సవాల సందర్భంగా, సామర్ధ్య నిర్మాణ చర్యగా, సిపిఎంయు, ఎన్ఇవిఎ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాసనసభల అధికారులకు వర్చువల్ పద్ధతిలో 02 &03 జూన్, 2022న రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వర్చువల్ శిక్షణలో పాలుపంచుకోవడానికి అవసరమైన లింక్ పోర్టల్, మొబైల్ ఆప్‌లలో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1829297)