మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

21వ శతాబ్దానికి జాతీయ విద్యా విధానం 2020 ఒక విజ్ఞాన పత్రం.... శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌


జాతీయ విద్యా విధానంపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌

Posted On: 28 MAY 2022 6:20PM by PIB Hyderabad

జాతీయ విద్యా విధానం అమలుపై పూణెలోని సింబయాసిస్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడిన శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ 21వ శతాబ్ధానికి జాతీయ విద్యా విధానం 2020 ఒక విజ్ఞాన పత్రం వంటిదని అన్నారు. అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చి సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేశామని  శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ వివరించారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు భారతదేశం కేంద్రంగా మారిందని అన్నారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కి భారతదేశం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.

ప్రపంచంలో పరిస్ధితులు వేగంగా మారుతున్నాయని శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ అన్నారు. మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న నూతన ప్రపంచంలో భారతదేశానికి సముచిత స్థానం లభించేలా చూసేందుకు విద్యావేత్తలు తమ వంతు సహకారాన్ని అందించాలని శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ కోరారు. సార్వత్రిక  సాంకేతికత మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చాయని మంత్రి అన్నారు. అభివృద్ధి క్రమంలో ప్రస్తుతం ప్రపంచం ఒక కూడలిలో ఉందని అన్నారు. సాంకేతికత మరియు ఆటోమేషన్‌ నూతన ప్రపంచ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. సాంకేతికత మరియు ఆటోమేషన్‌ అంశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. రూపుదిద్దుకుంటున్న నూతన ప్రపంచానికి నాయకత్వం వహించే అంశంలో సాంకేతికత మరియు ఆటోమేషన్‌ రంగాలలో సమకూర్చుకునే సామర్ధ్యం కీలకంగా ఉంటుందని శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ అన్నారు. సాంకేతికత మరియు ఆటోమేషన్‌ రంగాలలో అనివృద్ధి సాధించేందుకు భారతదేశానికి, ముఖ్యంగా భారతదేశ విద్యావేత్తలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ అన్నారు.

మార్పులు చేసేందుకు వీలు లేని విధంగా గతంలో దేశ విద్యా విధానం ఉండేదని శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ అన్నారు. సంపూర్ణ, బహుళ అంశాల బోధన అందించడం ఒక సవాల్‌గా ఉంటుందని అన్నారు. ఈ లోటుపాట్లను సవరించి సంపూర్ణ బోధన మరియు అభ్యాసాన్ని అందించి అనువైన  మరియు బహుళ అంశాలు అందించే విధంగా నూతన విద్యా విధానం 2020 రూపుదిద్దుకుందని ఆయన వివరించారు.

.గత 75 ఏళ్లలో హక్కులను గుర్తించి వాటి కోసం పోరాడిన భారతీయులు ఇకపై కర్తవ్యాలు, బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధం కావాలని శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ అన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం వహించాలని ఆయన కోరారు. హక్కులు, కర్తవ్యాలపై ప్రజలు దృష్టి సారించే పనిచేసేలా చూసేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు.

ఆన్‌లైన్‌ విద్య విద్యారంగంలో నూతన ఒరవడిని తెచ్చిందని శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ అన్నారు. దీనికి అనుగుణంగా విద్యా రంగానికి చెందినవారు సాంటేతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా భోథనా పద్ధతులకు రూపకల్పన చేసే అంశంపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నాణ్యమైన ఈ కంటెంట్‌ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆన్‌లైన్ విద్య కోసం ఎస్‌ఓపీలను రూపొందించడం వల్ల విద్యా మార్కెట్‌లో దోపిడీని అరికట్టి సమాచార చౌర్యాన్ని అరికట్టేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. నూతన విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ ప్రమాణాల మేరకు ప్రజలను రూపుదిద్ది, ప్రపంచ అంచనాలను అందుకోవడానికి కృషి జరగాలని శ్రీ ధర్శేంధ్ర ప్రధాన్‌ అన్నారు.  మన విద్యాసంస్థలు భౌతిక అంచనాల సాధన కేంద్రాలుగా కాకుండా విజ్ఞాన సాధికారత సాధన కేంద్రాలుగా రూపు దిద్దుకోవాలని మంత్రి అన్నారు.

***


(Release ID: 1829217) Visitor Counter : 130