సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

సూక్ష్మ & చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల స‌మూహాల అభివృద్ధి కార్య‌క్ర‌మం (ఎంఎస్ఇ-సిడిపి) నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల ఆమోదం

Posted On: 27 MAY 2022 4:16PM by PIB Hyderabad

సూక్ష్మ & చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల స‌మూహాల అభివృద్ధి కార్య‌క్ర‌మం (మైక్రో & స్మాల్ ఎంట‌ర్‌ప్రైజెస్ క్ల‌స్ట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం - ఎంఎస్ఇ- సిడిపి)కి నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం ఆమోదించింది. వీటిని 15వ ఆర్థిక క‌మిష‌న్ కాలంలో వీటిని అమ‌లు చేయ‌నున్నారు. దిగువ‌న పేర్కొన్న చొర‌వ‌ల ద్వారా సూక్ష్మ‌& చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఉత్పాద‌క‌త‌ను, పోటీత‌త్వాన్ని పెంచ‌డ‌మే ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. అవి -  
సాధార‌ణ సౌక‌ర్య కేంద్రాలు (సిఎఫ్‌సిలు)ః ప్రాజెక్టు విలువ రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ గ్రాంట్లు అందులో 70%గానూ, ఒక‌వేళ ఆ విలువ రూ 10 కోట్ల నుంచి రూ. 30 కోట్లుగా ఉంటే 60^గా ఉంటుంది. ఇక ఈశాన్య ప్రాంతాలు& కొండ ప్రాంత రాష్ట్రాలు, ద్వీప ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలలొ ప్రాజెక్టు విలువ‌ రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ప్పుడు అందులో 80%గా, రూ. 10 కోట్ల నుంచి రూ. 30 కోట్ల విలువ క‌లిగిన ప్రాజెక్టుల‌లో 70%గా కేంద్ర ప్ర‌భుత్వ గ్రాంట్లు ఉంటాయి.  ఒక‌వేళ ప్రాజెక్టు విలువ రూ. 30 కోట్ల‌క‌న్నా ఎక్కువగా ఉన్న‌ప్పుడు సిఎఫ్‌సికి ప్రాజెక్టును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, రూ. 30వేల కోట్ల‌ను గ‌రిష్ట ప్రాజెక్టు విలువగా భావించి, ప్ర‌భుత్వ సాయాన్ని అంచ‌నా వేస్తారు. 
మౌలిక స‌దుపాయాల అభివృద్ధిః  నూత‌న పారిశ్రామిక ఎస్టేట్ / అంత‌స్తులు క‌లిగిన ప‌రిశ్ర‌మ‌ల స‌ముదాయం ఏర్పాటుకు ప్రాజెక్టు విలువ రూ. 5 కోట్ల నుంచి రూ. 15 కోట్లు ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ గ్రాంట్ల‌ను 60%కి ప‌రిమితం చేశారు. ఇక, ఉనికిలో ఉన్న పారిశ్రామిక ఎస్టేట్ / అంత‌స్తులు క‌లిగిన ప‌రిశ్ర‌మ‌ల స‌ముదాయాన్ని ఆధ‌/న‌ఇక‌రించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు విలువ రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లుగా ఉంటే అందులో ప్ర‌భుత్వ గ్రాంటు 50%గా ఉంటుంది.   ఈశాన్య ప్రాంతాలు& కొండ ప్రాంత రాష్ట్రాలు, ద్వీప ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలలొ నూత‌న పారిశ్రామిక ఎస్టేట్ / అంత‌స్తులు క‌లిగిన ప‌రిశ్ర‌మ‌ల స‌ముదాయాన్ని నిర్మించేందుకు ప్రాజెక్టు విలువ రూ. 5 కోట్ల నుంచి రూ. 15క కోట్లుగా ఉంటే ప్ర‌భుత్వ గ్రాంటు 70%గా ఉండ‌గా, ఉనికిలో ఉన్న పారిశ్రామిక ఎస్టేట్ / అంత‌స్తుల ప‌రిశ్ర‌మ‌ల స‌ముదాయ ఆధునికీక‌ర‌ణకు ఉద్దేశించిన ప్రాజెక్టు విలువ రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వ గ్రాంటు అందులో 60% గా ఉంటుంది. మౌలిక స‌దుపాయాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు విలువ రూ. 10 నుంచి 15 కోట్ల‌కు వ‌ర‌కు ఉన్నప్ప‌టికీ, దాని గ‌రిష్ట విలువ‌ను రూ. 10 కోట్లుగా ప‌రిగ‌ణించి అందుకు అనుగుణంగా గ‌ణ‌న చేసి ప్ర‌భుత్వ సాయాన్ని అందిస్తారు.
ఎంఎస్ఇ- సిడిపికి సంబంధించిన నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు డిసి కార్యాల‌యం (ఎంఎస్ఎంఇ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

***



(Release ID: 1828923) Visitor Counter : 244