వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
తీవ్రమైన అవసరం ఉన్న, స్నేహపూరితమైన, లెటర్ ఆఫ్ క్రెడిట్ (పరపతి పత్రం) ఉన్న దేశాలకు గోధుమల ఎగుమతిని కొనసాగించనున్న భారత్ ః గోయల్
భారత్ ఎన్నడూ ప్రపంచానికి సంప్రదాయ గోధుమ సరఫరాదారు కాదుః శ్రీ గోయల్
భారతీయ ఎగుమతి నిబంధనలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేయరాదుః శ్రీ గోయల్
Posted On:
25 MAY 2022 5:12PM by PIB Hyderabad
తీవ్రమైన అవసరం ఉన్న, స్నేహపూరితమైన, లెటర్ ఆఫ్ క్రెడిట్ (పరపతి పత్రం) ఉన్న దేశాలకు గోధుమల ఎగుమతిని భారత్ కొనసాగిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ, వాణిజ్యం & పరిశ్రమ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ ఏడాది గోధుమ ఉత్పత్తిలో 7% నుంచి 8% పెరుగుదల ఉంటుందని అంచనా వేశామని, అయితే తీవ్రమైన వేడిమి, వడగాలుల కారణంగా తొందరగా పంటను కోయవలసి వచ్చిందని, దీనితో ఉత్పత్తి నష్టాలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో, తాము ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నది దేశీయ వినిమయానికి సరిపోతుందని శ్రీ గోయల్ వెల్లడించారు.
అంతర్జాతీయ గోధుమ మార్కెట్‌లో భారత్ సంప్రదాయ పోటీదారు కాదని, గోధుమ ఎగుమతులు కేవలం 2 ఏళ్ళ కిందట ప్రారంభమయ్యాయని అన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరంలో మాట్లాడుతూ, గత ఏడాది 7 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ఎగుమతి చేశామని, అందులో అత్యధిక రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభమైన గత రెండు నెలలో ఎగమతి చేశామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు & ఆహారం, ప్రజాపంపిణీ, వాణిజ్యం & పరిశ్రమలు, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు.
ప్రపంచ వాణిజ్యంలో భారత గోధుమ ఎగుమతులు 1%కన్నా తక్కువగా ఉన్నాయని, తమ ఎగముతి నిబంధనలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేయకూడదంటూ, తాము బలహీనమైన దేశాలకు, పొరుగుదేశాలకు గోధుమల ఎగుమతిని అనుమతిస్తున్నామని మంత్రి చెప్పారు.
***
(Release ID: 1828363)
Visitor Counter : 134