మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ న్యూ ఢిల్లీలో హజ్ 2022 డిప్యూటేషనిస్టుల కోసం రెండు రోజుల ఓరియంటేషన్ -కమ్ -ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మొత్తం హజ్ ప్రక్రియలో ప్రభుత్వం చేసిన ముఖ్యమైన సంస్కరణలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చాయని నఖ్వీ అన్నారు.
వంద శాతం డిజిటల్/ఆన్‌లైన్ హజ్ ప్రక్రియ భారతీయ ముస్లింలకు "హజ్ యాత్ర చేయడం సులభతరం" అనే కలను నెరవేర్చింది ఈ ప్రక్రియ "డిజిటల్ ఇండియా"కు ఉత్తమ ఉదాహరణలలో ఒకటని ఆయన చెప్పారు.
హజ్ యాత్రికుల ఆరోగ్యం శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ గణనీయమైన సంస్కరణలతో హజ్ 2022 జరుగుతోంది: నఖ్వీ.
భారతీయ హజ్ యాత్రికులకు సహాయం చేయడానికి సౌదీ అరేబియాలో మొత్తం 357 మంది హజ్ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ హజ్ ఆఫీసర్లు, హజ్ అసిస్టెంట్లు, డాక్టర్లు పారామెడిక్స్‌ను నియమించనున్నారు.
Posted On:
23 MAY 2022 4:37PM by PIB Hyderabad
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈరోజు న్యూ ఢిల్లీలో హజ్ 2022 డిప్యూటేషనిస్టుల కోసం రెండు రోజుల ఓరియంటేషన్-కమ్-ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పారదర్శకతతో "సత్వర నిర్ణయాల అమలుకు" నిబద్ధతతో "హజ్ సబ్సిడీ రాజకీయ మోసానికి" ముగింపు పలికిందని అన్నారు. మొత్తం హజ్ ప్రక్రియలో ప్రభుత్వం చేసిన గణనీయమైన సంస్కరణలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చేశాయని, రెండేళ్ల తర్వాత హజ్ యాత్ర చేసే హజ్ యాత్రికులపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు.
వంద శాతం డిజిటల్/ఆన్‌లైన్ హజ్ ప్రక్రియ భారతీయ ముస్లింలకు “హజ్ చేయడం సులభతరం” అనే కలను నెరవేర్చిందని ఈ ప్రక్రియ “డిజిటల్ ఇండియా”కు ఉత్తమ ఉదాహరణలలో ఒకటి అని నఖ్వీ అన్నారు.
హజ్ యాత్రికుల ఆరోగ్యం శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ గణనీయమైన సంస్కరణలతో హజ్ 2022 జరుగుతోందని మంత్రి అన్నారు. మొత్తం హజ్ 2022 ప్రక్రియ భారత ప్రభుత్వం, సౌదీ అరేబియా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో రూపొందించడం జరిగింది. వీటిలో అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, ఆరోగ్య సంబంధిత అవసరాలు మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ ప్రభుత్వ హజ్ సంస్కరణల్లో భాగంగా దశాబ్దాల నాటి హజ్ సబ్సిడీని రద్దు చేయడం; "మెహ్రం" (పురుష బంధువు)తో మాత్రమే హజ్ చేయడానికి మహిళలపై ఉన్న పరిమితిని తొలగించడం (దీని వలన 3,000 కంటే ఎక్కువ మంది ముస్లిం మహిళలు "మెహ్రం" లేకుండా హజ్ చేశారు. దాదాపు 2000 మంది ముస్లిం మహిళలు "మెహ్రం" లేకుండా హజ్ 2022కి వెళతారు); మొత్తం హజ్ ప్రక్రియను వంద శాతం డిజిటల్/ఆన్‌లైన్‌లో చేయడం, ఇందులో డిజిటల్ హెల్త్ కార్డ్, “ఇ–-మసీహా” ఆరోగ్య సౌకర్యం “ఈ–-లగేజ్ ప్రీ-ట్యాగింగ్” వంటివి ఉంటాయన్నారు. మక్కా -మదీనాలోని హజ్ యాత్రికులకు అక్కడ వసతి/రవాణాకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. 2022లో 79,237 మంది భారతీయ ముస్లింలు హజ్ యాత్రకు వెళతారని, వీరిలో 50 శాతం మంది మహిళలు ఉన్నారని నఖ్వీ చెప్పారు. వీరిలో 56,601 మంది భారతీయ ముస్లింలు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా 22,636 మంది ముస్లింలు హజ్ గ్రూప్ ఆర్గనైజర్స్ (హెచ్జీఓలు) ద్వారా 2022 హజ్ కోసం వెళతారు. హెచ్జీఓల మొత్తం ప్రక్రియ కూడా పారదర్శకంగా ఆన్‌లైన్‌లో చేయడం జరిగింది. దాదాపు 2000 మంది ముస్లిం మహిళలు "మెహ్రం" (పురుష సహచరుడు) లేకుండా హజ్ 2022 కోసం వెళతారు, ఈ మహిళలు లాటరీ విధానం లేకుండా హజ్‌కు వెళతారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా హజ్ యాత్ర జరగలేదు.
హజ్ 2022 కోసం, యాత్రికులు అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చిన్, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబైలోని 10 ఎంబార్కేషన్ పాయింట్ల నుండి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా వెళ్తారని నఖ్వీ తెలిపారు. హజ్ 2022 కోసం విమానాలు జూన్ 4 నుండి ప్రారంభమవుతాయి. భారతీయ హజ్ యాత్రికులకు సహాయం చేయడానికి సౌదీ అరేబియాలో మొత్తం 357 మంది హజ్ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ హజ్ ఆఫీసర్లు, హజ్ అసిస్టెంట్లు, డాక్టర్లు, పారామెడిక్స్‌ను నియమించనున్నారు. వీరిలో 04 మంది హజ్ కోఆర్డినేటర్లు, 33 మంది అసిస్టెంట్ హజ్ అధికారులు, 143 మంది హజ్ అసిస్టెంట్లు, 73 మంది వైద్యులు 104 మంది పారామెడిక్స్ ఉన్నారు. ఈ డిప్యూటేషన్‌లో 49 మంది మహిళలు ఉన్నారు.- 01 అసిస్టెంట్ హజ్ ఆఫీసర్, 03 హజ్ అసిస్టెంట్లు, 13 డాక్టర్లు 32 పారామెడిక్స్ కూడా ఉన్నారు. రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో, హజ్ డిప్యుటేషనిస్టులకు హజ్ తీర్థయాత్ర, మక్కా మదీనాలో వసతి, రవాణా, ఆరోగ్య సౌకర్యాలు, భద్రతా చర్యలు మొదలైన వాటి గురించి మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది.
వీరిని మక్కా (ఎన్సీఎన్టీ జోన్ అజీజియాలోని ప్రధాన కార్యాలయం శాఖలు, డిస్పెన్సరీలు ఆసుపత్రులు), మదీనా (కార్యాలయం శాఖలు, డిస్పెన్సరీలు ఆసుపత్రులు మదీనా విమానాశ్రయం) జెడ్డా విమానాశ్రయంలో నియమిస్తారు. అజీజియాలో మొత్తం 02 ఆసుపత్రులు 10 బ్రాంచ్ డిస్పెన్సరీలను ఏర్పాటు చేశారు; మక్కాలోని ఎన్సీఎన్టీ జోన్‌లో 01 బ్రాంచ్ డిస్పెన్సరీ; భారతీయ హజ్ యాత్రికులకు సరైన ఆరోగ్య సౌకర్యాలు ఉండేలా మదీనాలో 03 బ్రాంచ్ డిస్పెన్సరీలు, ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది.
(Release ID: 1827823)
Visitor Counter : 140