భారత పోటీ ప్రోత్సాహక సంఘం

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ ద్వారా బయోకాన్ బయోలాజిక్స్‌లో సుమారు 15% ఈక్విటీ వాటాల‌ను కొనుగోలు చేయడం కోసం బయోకాన్ బయోలాజిక్స్‌లో కోవిడ్‌షీల్డ్ టెక్నాలజీస్‌ను ఐక్యం చేయ‌డం ద్వారా విలీనాన్ని ఆమోదించిన సిసిఐ

Posted On: 19 MAY 2022 11:55AM by PIB Hyderabad

 సీర‌మ్ ఇనిస్టిట్యూట్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా బ‌యోకాన్ బ‌యొలాజిక్స్‌లో సుమారు 15% ఈక్విటీ వాటాల‌ను కొనుగోలు చేసేందుకు కోవిషీల్డ్ సాంకేతిక‌ల‌ను బ‌యోకాన్ బ‌యోలాజిక్స్‌లో ఐక్యం చేయ‌డం ద్వారా విలీనం చేసేందుకు కాంపిటిష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదాన్ని తెలిపింది. 
సీరం ఇనిస్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (కొనుగోలుదారు) పూర్తిగా యాజ‌మాన్యం వ‌హించే అనుబంధ సంస్థ అయిన కోవిషీల్డ్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిటిపిఎల్‌)ను ఐక్యం చేసి బ‌యోకాన్ బ‌యొలాజిక్స్ లిమిటెడ్ (ల‌క్ష్యిత సంస్థ‌)లో విలీనం చేయ‌డం అన్న‌ది ఈ ప్ర‌క్రియ‌లో భాగం.ప్ర‌తిపాదిత విలీన ప‌థ‌కానికి అనుగుణంగా కొనుగోలుదారు సంస్థ  ల‌క్ష్యిత సంస్థ‌లో పూర్తిగా డైల్యూట్ (వాటాల‌ను సాదార‌ణీక‌రించి )చేసిన 15% ఈక్విటీ వాటాల‌ను కొనుగోలు చేస్తుంది. 
సీరం ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ అయిన కొనుగోలుదారు సంస్థ‌ను కోవిడ్‌-19కి వ్య‌తిరేకంగా వాక్సిన్ల‌ను, చికిత్స‌ల‌ను మ‌రింత అభివృద్ధి చేసి వాణిజ్యీక‌రించేందుకు ఏర్పాటు చేశారు. ఇత‌ర సాంక్ర‌మిక వ్యాధుల‌కు కూడా వాక్సిన్ల‌ను అభివృద్ధి చేయాల‌న్న ప్ర‌ణాళిక‌లు దానికి ఉన్నాయి. ప్ర‌స్తుతం త‌న స్వంత ఉత్ప‌త్తి సంస్థ‌ను ఏర్పాటు చేసే ప్ర‌క్రియ‌లో కొనుగోలుదారు సంస్థ ఉంది. 
సిటిపిఎల్ సంస్థ కొనుగోలుదారు పూర్తి యాజ‌మాన్యంలో ఉన్న అనుబంధ సంస్థ‌. ప్రతిపాది లావాదేవీల నేప‌థ్యంలో ల‌క్ష్యిత సంస్థ‌తో విలీనం చేయ‌నున్నారు. ఈ సంస్థ మార్కెటింగ్ వ్యాపారాన్ని, వాక్సిన్లు, మందులు, ఇత‌ర ఔష‌ధీయ ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌ను, పంపిణీని చేసేందుకు ఏర్పాటు చేశారు. 
ల‌క్ష్యిత సంస్థ బ‌యోకాన్ లిమిటెడ్ అనుబంద సంస్థ‌. ఇది, డ‌యాబెటిస్‌, ఆంకాల‌జీ (కాన్స‌ర్‌) నెఫ్రాల‌జీ (మూత్ర‌పిండాలు) , ఆటోఇమ్యూన్ వ్యాధుల వంటి దీర్ఘ‌కాలిక‌, తీవ్ర‌వ్యాధులు చికిత్స‌ను అందిస్తుంది. ల‌క్ష్యిత సంస్థకు బెంగ‌ళూరు, చెన్నైల‌లో ప‌రిశోధ‌నా, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. దానితో పాటుగా, బెంగ‌ళూరు, మ‌లేసియాల‌లో మోనోక్లోన‌ల్ యాంటీబాడీస్‌, రీకాంబినెంట్ ప్రోటీన్లు, ఇన్సులిన్ల‌కు ఉత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయి. 
దీనికి సంబంధించిన వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వుల‌ను సిసిఐ జారీ చేయ‌నుంది. 

 

***
 



(Release ID: 1826780) Visitor Counter : 124