భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

మాగ్మా హెచ్‌డిఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో వాటాల‌ను కొనుగోలు చేసేందుకుస‌నోతి ప్రాప‌ర్టీస్ ఎల్ఎల్‌పికి సిసిఐ ఆమోదం

Posted On: 19 MAY 2022 11:54AM by PIB Hyderabad

పోటీ చ‌ట్టం 2002లోని సెక్ష‌న్ 31(1) కింద‌ మాగ్మా హెచ్‌డిసిఎల్ జ‌న‌ర‌ల్  ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో (మాగ్మా హెచ్‌డిఐ/ ల‌క్ష్యిత సంస్థ‌) లోని వాటాదారు అయిన స‌నోతీ ప్రాప‌ర్టీస్ ఎల్ఎల్‌పి (స‌నోతి/   కొనుగోలుదారు) ద్వారా  కొనుగోలు చేసేందుకు సిసిఐ ఆమోదించింది. 
ప్ర‌తిపాదిత క‌ల‌యిక ద్వారా స‌నోటి ద్వారా మాగ్మా హెచ్‌డిఐ మొత్తం ఈక్విటీ వాటా మూల‌ధ‌నంలో 55.39% ల‌క్ష్యంలోని నిర్ధిష్ట ఈక్విటీ వాటాదారుల ప్ర‌తిపాదిత స‌మ్మ‌తి ద్వారా పూనావాలా ఫిన్‌కార్ప్, సిరెం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ క‌లిగి ఉన్న ల‌క్ష్యిత నిర్ధిష్ట ఈక్విటీ వాటాల‌ను ఏక‌కాలంలో కొనుగోలు చేయ‌నుంది. 
స‌నోటీ సంస్థ వాణిజ్య‌, ఆవాస రియ‌ల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వాణిజ్యంలో నిమ‌గ్న‌మై ఉంది. 
మాగ్మా హెచ్‌డిఐ భార‌త‌దేశంలో సాధార‌ణ‌/  నాన్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో నిమిగ్న‌మై పూర్తి శ్రేణిలో సాధార‌ణ‌/  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్ప‌త్తుల అందిస్తుంది. 
సిసిఐ వివ‌ర‌ణాత్మ‌క ఉత్త‌ర్వుల‌ను జారీ చేయ‌నుంది. 

 

***
 


(Release ID: 1826779) Visitor Counter : 129