రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
‘‘ఇండస్ట్రీ కనెక్ట్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాన్ క్లేవ్"ను ప్రారంభించిన కేంద్ర రసాయనాలు , ఎరువులు, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా
పరిశ్రమ , విద్యాసంస్థలు కలిసి పనిచేయడమే కాకుండా కలిసి అభివృద్ధి చెందడం చాలా కీలకం
జ్ఞానాన్ని సృష్టించడం , దాని వాణిజ్యీకరణ అనేది ఒక నది యొక్క రెండు చివరల వంటిది, వీటిని క్రమ పద్ధతి లో పరస్పర చర్యల ద్వారా అనుసంధానం చేయాలి: శ్రీ భగవంత్ ఖుబా
Posted On:
18 MAY 2022 11:50AM by PIB Hyderabad
న్యూఢిల్లీ లోని హాబిటాట్ వరల్డ్, ఇండియా హాబిటాట్ సెంటర్ లో ‘‘ డిసిపిసి ఆధ్వర్యంలో ‘‘ఇండస్ట్రీ కనెక్ట్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాన్ క్లేవ్"ను కేంద్ర రసాయనాలు , ఎరువులు, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా
ప్రారంభించారు. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ విభాగం (డిసిపిసి) ఆధ్వర్యంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ భారత్
కార్యక్రమాన్ని సాకారం చేయడానికి స్వదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ (సిఒఇ) చేస్తున్న
ప్రయత్నాలను కేంద్ర మంత్రి అభినందించారు.
కనుగొన్న విషయాలను ప్రదర్శించడానికి, తగిన పరిశ్రమ భాగస్వామిని గుర్తించడానికి, పరిశ్రమ భవిష్యత్తు ఆవశ్యకతలను అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో డిసిపిసి ,సిపెట్ ప్రయత్నాలను అభినందిస్తూ, ఎనర్జీ ఎఫిషియెన్సీ డివైజెస్, వేస్ట్ మేనేజ్ మెంట్, రీసైక్లింగ్, స్మార్ట్ పాలిమర్స్, హెల్త్ కేర్ లో పాలిమర్స్ మొదలైన రంగాలలో సిఒఇ లు పనిచేస్తున్నాయని, తద్వారా టెక్నాలజీ స్వదేశీకరణకు దోహదపడుతుందని అన్నారు. అందువల్ల, స్టార్టప్లు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుల పరిశోధన ఫలితాలు భారతదేశాన్ని స్వదేశీ సాంకేతికతలకు కేంద్రంగా
మారుస్తాయని, . బయో మెడికల్ డివైజ్లు, బొమ్మల వంటి ప్రాజెక్ట్లు భారతదేశాన్ని తక్కువ దిగుమతిపై ఆధారపడేలా
చేస్తాయని,తద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తాయని ఆయన అన్నారు.
భాగస్వాముల మధ్య సహకారానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ, "పరిశ్రమలు
విద్యారంగం కలిసి పని చేయడమే కాకుండా, కలిసి అభివృద్ధి చెందడం కూడా ఎంతో కీలక మని శ్రీ భగవంత్ ఖుబా అన్నారు.జ్ఞానాన్ని సృష్టించడం ,దాని వాణిజ్యీకరణ అనేది ఒక నది కి రెండు చివరల వంటిదని, ఇది అన్ని వాటాదారుల మధ్య క్రమమైన పరస్పర చర్యల ద్వారా కలిసి ఉండాలని అన్నారు. కైజెన్ అనే జపనీస్ భావనను వర్తింపజేయాలని, దేశంలో పరిశోధన ,సృజనాత్మకత ల సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి సైలోలలో పనిచేయడాన్ని విరమించుకోవాలని ఆయన వాటాదారులందరినీ కోరారు.
పరిశోధన , ఆవిష్కరణ ప్రక్రియ ను
ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిపెట్ తో పాటు ఇతర విద్యా సంస్థల లో సెంటర్ ఆఫ్
ఎక్స లెన్స్ ను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.సంక్లిష్టమైన పారిశ్రామిక సమస్యలకు సుస్థిరమైన , ప్రత్యామ్నాయ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి , సాంకేతిక పరిజ్ఞానం విధాన పరిశోధనలో సహకార పరిశోధన అభివృద్ధి ప్రయత్నాల ద్వారా వారికి మద్దతు ఇవ్వడానికి ఒక దార్శనికతతో పరిశోధనను చేపట్టాలని ఆయన వేదికపై ఉన్న శాస్త్రవేత్తలను అభ్యర్థించారు. ‘‘ఈ పరిశోధన వాణిజ్యీకరణను సృష్టించడానికి పరిశ్రమ పుష్ తదుపరి దశను ఎనేబుల్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి పరిశ్రమ అవసరాలను తెలుసుకోవడం కోసం ఇటువంటి కాన్ క్లేవ్ లు, ఇంటరాక్షన్ లు ఉపయోగకరంగా మారతాయి‘‘ అని kendra మంత్రి అన్నారు.
మన ప్రధాన మంత్రి ఇచ్చిన అత్మనిర్భర్ పిలుపును పునరుద్ఘాటిస్తూ, "భారత దేశానికి నైపుణ్యం ఉన్న మానవ వనరులకు ఎలాంటి కొరత లేదు, పరిశ్రమలను ఆక ర్షించడానికి, మన ఉత్ప త్తులను ప్రపంచ స్థాయిలో మార్కెట్ చేయడానికి ప్ర భుత్వం అనేక
చర్యలు తీసుకుంటోంది.భారత ప్రభుత్వం పరిశ్రమ సమస్యల పట్ల సున్నితంగా ఉంటుంది . సంస్థలు , ప్రక్రియలను ప్రోత్సహించడం, నిధులు సమకూర్చడం ,స్థాపించడం ద్వారా వాటికి మద్దతు ఇవ్వాలనుకుంటుంది. ఇది మన దేశాన్ని ఆర్థికాభివృద్ధి దిశగా నడిపిస్తుంది‘‘ అన్నారు.
మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను (కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్) కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా తెలియజేశారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఆర్ అండ్ డిని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది . 2011 నుంచి వివిధ ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో 13 సిఒఇలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిధులతో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పాటు, పరిశ్రమల అవసరాల కోసం దేశంలోని ఇతర ప్రయోగశాలలు ,సంస్థల సామర్థ్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈరోజు రిగిన కార్యక్రమంలో సిపెట్ ఇ-న్యూస్ లెటర్ తో పాటు పోర్టల్ ఫర్ సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ (సిఒఇ) ను, ఇండస్ట్రీ కనెక్ట్ ను కూడా శ్రీ భగవంత్ ఖుబా ప్రారంభించారు.
ప్రారంభ కార్యక్రమం తరువాత, క్రింది అంశాలపై ఒక టెక్నికల్ సెషన్ నిర్వహించారు.
బయో ఇంజినీరింగ్డ్ పాలిమరిక్ సిస్టమ్స్, పాలిమర్స్ ఆధారిత బయో మెడికల్ డివైజెస్, పాలిమర్ ఆధారిత టాయ్స్ ,అడ్వాన్స్ డ్ పాలిమర్స్ అండ్ కాంపోజిట్ లు.
వివిధ సీఓఈల శాస్త్రవేత్తలు తాము కనుగొన్న ఫలితాలపై పారిశ్రామికవేత్తలకు ప్రజంటేషన్ ఇచ్చారు. సిపెట్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ (డాక్టర్) శిశిర్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు.
ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్, సిపెట్ సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పరిశ్రమలు, సంఘాలు ఈ సదస్సులో భౌతికంగా, వర్చువల్ గా పాల్గొన్నారు.
****
(Release ID: 1826433)
Visitor Counter : 136