హోం మంత్రిత్వ శాఖ

అమర్‌నాథ్ యాత్ర ఏర్పాట్లను ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా యాత్రికులకు కల్పించవలసిన సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించిన కేంద్ర హోం శాఖ మంత్రి


ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకులు లేకుండా యాత్రీకులు దర్శనం చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది.. శ్రీ అమిత్ షా

అమర్‌నాథ్ యాత్రికుల కదలిక, వసతి, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ మరియు ఆరోగ్యం తో సహా అవసరమైన అన్ని సౌకర్యాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన శ్రీ అమిత్ షా

కోవిడ్-19 మహమ్మారి ముగిసిన తరువాత తొలిసారిగా జరుగుతున్న అమర్‌నాథ్ యాత్ర

ఎక్కువ ఎత్తులో ఉన్నందున యాత్రికుల ఆరోగ్య సంబంధిత సమస్యలకు గురి కాకుండా చూసేందుకు తగిన ఏర్పాట్లు

సమాచార వ్యవస్థను పటిష్టం చేసేందుకు మొబైల్ టవర్ల సంఖ్య పెంపు.

కొండ చరియలు విరిగి పడితే ప్రత్యామ్నాయ మార్గాల కోసం పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ

తగిన సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచి 6,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో తగిన వైద్య పడకలు ఏర్పాటు చేయాలి

ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితిని ఎదుర్కోవడానికి అంబులెన్స్‌లు మరియు హెలికాప్టర్‌లను సిద్ధం చేయాలి

యాత్రికుల సౌకర్యార్థం అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా అన్ని రకాల రవాణా సేవలను మెరుగుపరచాలి

Posted On: 17 MAY 2022 4:04PM by PIB Hyderabad

అమర్‌నాథ్ యాత్ర కోసం జరుగుతున్న  ఏర్పాట్లను కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. సమావేశానికి సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జమ్మూ కాశ్మీర్ ముఖ్య కార్యదర్శి,కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు,విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.అమర్‌నాథ్ యాత్ర భద్రత, యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కేంద్ర హోంమంత్రి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జమ్మూ కాశ్మీర్ ముఖ్య  కార్యదర్శి, భద్రతా సంస్థల సీనియర్ అధికారులు  ఇందులో పాల్గొన్నారు.

ఎటువంటి ఇబ్బందులు,  అడ్డంకులు  లేకుండా యాత్రీకులు  దర్శనం చేసుకుని, యాత్ర పూర్తి చేసుకునేలా చూసినందుకు  మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. కదలిక, వసతి, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ మరియు యాత్రికుల  ఆరోగ్యంతో సహా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని శ్రీ షా ఆదేశాలు జారీచేశారు. కోవిడ్-19 మహమ్మారి ముగిసిన తరువాత తొలిసారిగా అమర్‌నాథ్ యాత్ర జరుగుతున్నదని శ్రీ షా అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎతైన ప్రదేశంలో యాత్రికులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసేందుకు యాత్ర జరిగే మార్గంలో మొబైల్ టవర్ల సంఖ్య పెంచాలని సూచించారు. దీనివల్ల సమాచారం త్వరితగతిన జరుగుతుందని శ్రీ షా అన్నారు. కొండ చరియలు  విరిగి పడితే ప్రత్యామ్నాయ మార్గాల కోసం పరికరాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. తగిన సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచి,   6,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో తగిన వైద్య పడకలు ఏర్పాటు చేసి, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు  అంబులెన్స్‌లు మరియు హెలికాప్టర్‌లను సిద్ధంగా ఉంచాలని శ్రీ అమిత్ షా సూచించారు. యాత్ర జరిగే సమయంలో అన్ని రకాల రవాణా సౌకర్యాలను ఎక్కువ చేసి, యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు శ్రీ షా ఆదేశాలు జారీచేశారు. 

తొలిసారిగా ప్రతి యాత్రికుడికి ఆర్ఎఫ్ఐడి కార్డు ను అందజేసి అయిదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని జమ్మూ కాశ్మీర్ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. యాత్ర జరిగే మార్గంలో టెంట్ సిటీ, వైఫై హాట్‌స్పాట్‌లు మరియు సరైన లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనితో పాటు, బాబా బర్ఫానీ దర్శనాన్ని ఆన్‌లైన్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  పవిత్ర అమర్‌నాథ్ గుహలో ఉదయం మరియు సాయంత్రం జరిగే హారతి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది.  బేస్ క్యాంపులో మత మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

***(Release ID: 1826201) Visitor Counter : 136