జల శక్తి మంత్రిత్వ శాఖ

జాతీయ పథకం మంజూరు కమిటీ స్వచ్ఛ భారత్ మిషన్- గ్రామీణ్ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వార్షిక అమలు ప్రణాళిక పరిశీలన.

Posted On: 13 MAY 2022 3:08PM by PIB Hyderabad

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు ,  కేంద్రపాలిత ప్రాంతాల వార్షిక అమలు ప్రణాళికల పరిశీలన కోసం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ (SBM-G) ఫేజ్ II కింద నేషనల్ స్కీమ్ శాంక్షనింగ్ కమిటీ (NSSC) మూడవ సమావేశం ఈ రోజు జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమం  . డిపార్ట్‌ మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ (డిడిడబ్ల్యుఎస్), జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి విని మహాజన్, అధ్యక్షతన జరిగింది. అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సీనియర్ అధికారులు పాల్గొన్నారు. దీనికి NSSC సభ్యులు అయిన  - శ్రీ చండీ చరణ్ దే, రామకృష్ణ మిషన్ సమన్వయకర్త; శ్రీ శ్రీకాంత్ ఎం. నవ్రేకర్, నిర్మల్ గ్రామ్ నిర్మాణ కేంద్రం; Mr. రోహిత్ కుమార్, జాయింట్ సెక్రటరీ - MGNREGS, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ; ,  డాక్టర్ వి.కె. చౌరాసియా, జాయింట్ అడ్వైజర్ – PHEE (పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కూడా హాజరయ్యారు.

 

వార్షిక అమలు ప్రణాళిక,  అందులో లక్ష్యాలపై వ్యాఖ్యానిస్తూ, సెక్రటరీ DDWS, బహిరంగ మలవిసర్జన రహిత అభివృద్ధి స్థిరత్వాన్ని నిర్ధారించడం కొనసాగించాలని, ఇంకా మరుగుదొడ్లు  లేని కుటుంబాలకు ప్రాధాన్యతనివ్వాలి అని రాష్ట్రాలను కోరారు. గ్రామ వాతావరణంలో అనూహ్యమైన అభివృద్ధికి దారితీసే అన్ని గ్రామాలకు దృశ్య పరిశుభ్రతను తీసుకురావడానికి రెట్రోఫిట్టింగ్, నిర్మాణ నైపుణ్యాల సర్టిఫికేషన్ పథకం -CSCల నిర్మాణం, ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ ,  స్వచ్ఛత కార్యకలాపాలను కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు.

 

శ్రీమతి బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన గోబర్ధన్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, ,  మల బురద నిర్వహణ వంటి కార్యక్రమాలు వేగవంతం చేయాల్సిన ప్రాముఖ్యత ,  ఆవశ్యకతపై మహాజన్ ఉద్ఘాటించారు;

చర్చను ప్రారంభించిన శ్రీ అరుణ్ బరోకా, ప్రత్యేక కార్యదర్శి – DDWS ,  మిషన్ డైరెక్టర్ SBM-G ,  JJM SBM-G ఫేజ్ II పై సమగ్ర ప్రదర్శనను అందించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SLWM), కీలకమైన పాలసీ జోక్యాలు ,  స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్, సినిమా పోటీలు, సర్పంచ్ సంవాద్‌లు, స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ ,  సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను నిషేధించడం వంటి ఇతర ప్రధాన కార్యక్రమాల గురించి కూడా ఆయన మాట్లాడారు.

 

 

 

 

 

 

 

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లేదా లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు ఉన్నగ్రామాలను సులభంగా బహిరంగ మలవిసర్జన రహిత  కంటే ఎక్కువ- ODF ప్లస్ మోడల్ కేటగిరీకి మార్చవచ్చని సిఫార్సు చేశారు.  అంతేకాకుండా, 5000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను కూడా ప్రాధాన్యతపై తీసుకోవచ్చు. ఇంకా, బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, గోబర్ధన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్ ,  ఫేకల్ స్లడ్జ్ మేనేజ్‌మెంట్ కోసం వ్యూహాలు కూడా వివరించారు.

 

ప్రత్యేకంగా, వార్షిక అమలు ప్రణాళిక -AIPలో, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను బట్టి  అంచనా వేసినట్లుగా, IHHLలు, CSCలు, ODF ప్లస్ గ్రామాలు ,  జిల్లాల కోసం NSSC భౌతిక లక్ష్యాల ఆమోదాన్ని కోరుతూ ప్రణాళిక అంచనాల కమిటీ (PAC) చేసిన పరిశీలనలు ,  సూచనలను వారు వివరించారు.

 

 

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ రోహిత్ కుమార్, బయో-గ్యాస్ ప్లాంట్లు, సోక్ పిట్‌లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ ల పరంగా పూర్తి చేసిన పనులను జాబితా చేశారు ,  గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా MGNREGS కింద అన్ని పనులకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రాలు తమ గ్రే వాటర్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలన్నింటికీ ముందుగానే భూమిని సేకరించాలని డాక్టర్ చౌరాసియా సలహా ఇచ్చారు, తద్వారా పెరి-అర్బన్ గ్రామాల పనిని అడ్డంకులు లేకుండా నిర్వహించవచ్చని వారి ఆలోచన.

 

శ్రీ నవ్రేకర్ మాట్లాడుతూ స్థానిక భాషల్లో సాంకేతిక సాహిత్యాన్ని అందించడం, నిర్వహిస్తున్న వివిధ పనులపై వినియోగదారులను సమాయత్తం చేయడం, అమలు చేసేవారికి సాంకేతిక శిక్షణ అందించడం; రాష్ట్ర స్థాయి సామర్థ్య నిర్మాణాన్ని నిర్వహించడానికి ,  సాంకేతిక  సరైన అమలును నిర్ధారించడానికి మూడవ పక్షం ద్వారా వేగవంతమైన అంచనాను నిర్వహించడం తప్పక నిర్వహించాల్సిందిగా పేర్కొన్నారు.

 

రాష్ట్రాల ప్రతినిధులు తమ సంవత్సర అమలు ప్రణాళిక-AIP లలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

***



(Release ID: 1825291) Visitor Counter : 111