ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో చిన్న, సంప్రదాయ చేతివృత్తిపనివార్లకు మద్దతునిచ్చేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన ఎన్ఇహెచ్‌హెచ్‌డిసి, ఎట్సీ
ఈ ప్రాంతంలోని చేతివృత్తి పనివార్లకు సాధికారత మద్దతును, మార్కెట్ ప్రవేశానికి అవకాశాన్ని కల్పించనున్న సృజనాత్మక వస్తువులకు ప్రపంచ వాణిజ్య వేదిక అయిన ఎట్సీ
ఈ భాగస్వామ్యం చేతివృత్తిపనివార్ల శైలిని మలుపు తిప్పడమే కాక ఈ ప్రాంతానికి చెందిన దేశీయ ఉత్పత్తులు (జౌళి, కేన్, వెదురు ఉత్పత్తులు, ఉపకరణాలు, మరెన్నో) మిలియన్లమంది దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తుంది
Posted On:
09 MAY 2022 4:08PM by PIB Hyderabad
నార్త్ ఈస్టర్న్ హాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఈశాన్య హస్తకళలు, చేేనేత అభివృద్ధి సంస్థ -(ఎన్ఇహెచ్‌హెచ్‌డిసి)తో భాగస్వామ్యం కలిగి ఉన్న సృజనాత్మక, ప్రత్యేక వస్తువుల అంతర్జాతీయ వాణిజ్య వేదిక అయిన ఎట్సీ సంస్థ చిన్న అమ్మకందార్లు, చేనేత, చేతిపనివారికి మద్దతుగా మార్కెట్ అందుబాటు, సాధికారిత కోసం మద్దతు ఇచ్చేందుకు అవగాహనా పత్రం (ఎంఒయు)పై సంతకం చేసింది.
అవగాహనా పత్రంలో భాగంగా, ఎన్ఇహెచ్‌హెచ్‌డిసితో కలిసి ఈశాన్యప్రాంతపు హస్తకళలవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాధికారత కార్యక్రమాలను అభివృద్ధి చేయడమే కాక ఆన్‌లైన్ అమ్మకాలు, వ్యవస్థాపకతతో పాటుగా తమ ఉత్పత్తులకు విస్త్రత మార్కెట్ అవకాశాలు అందుబాటులో ఉండేందుకు ఎట్సీ కలిసి పని చేస్తుంది.
భారతీయ హస్తకళల రంగంలో చేతివృత్తిపనివారినీ, సృష్టికర్తలకు, చిన్న వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్ వ్యాపారాలను ప్రారంభించి నిర్వహించేందుకు ముఖ్యమైన పరికరాలను, వనరులను ఎట్సీ సమకూరుస్తుంది. ఈ విక్రేతలకు డిజిటల్ సాధికారత సేవలను అందించడమే కాక, ఎట్సీ గురించి తెలిసుకొనేందుకు, మార్కెట్లలో విక్రయించేందుకు ఎట్సీ శిక్షణా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది.
ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ, ఎన్ఇహెచ్‌హెచ్‌డిసి మేనేజింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ రాజీవ్ కుమార్ సింగ్ (రిటైర్డ్) మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంత దేశీయ హస్తకళలను ప్రోత్సహించడమే కాక చేతివృత్తి పనివార్లకు ఆర్థిక అవకాశాలను సృష్టించడమే మేం కీలకంగా దృష్టి కేంద్రీకరించగలిగాం. ఈ ప్రాంతంలో 21 లక్షల మంది చేనేతపనివారు, 14.5 లక్షల మంది చేతివృత్తిపనివారు ఉన్నప్పటికీ, సరైన మార్కెట్ అనుసంధానం లోపించింది. ఎట్సీతో అనుబంధం అన్నది మన చేతివృత్తి పనివార్లకు గేమ్‌ఛేంజర్‌గా ఉండడమే కాక తాము అనుకున్నట్టుగా వ్యవస్థాపకత సాధ్యతను అన్వేషించి, దేశీయ, ప్రపంచ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండేలా చేస్తుంది.
పబ్లిక్ పాలసీ & అడ్వకసీ వైస్‌ప్రెసిడెంట్ అయిన రాస్ లాజ్యునెస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎట్సీ దార్శనికత కీప్ కామర్స్ హ్యూమన్ ( వాణిజ్యాన్ని మానవీయంగా ఉంచడం) అన్నదానిపై ఉంటుందని, అలా చేయడం ద్వారా, మేం సమూహాల జీవనశైలిని మెరుగుపరచి, సాధికారం చేయగలమని తెలిసి
మా వ్యాపార శక్తిని , మా వేదికతను చిన్న అమ్మకందార్లు, వాణిజ్యవేత్తలకు సాధికారత కల్పించేందుకు ఉపయోగించడానికి కట్టుబడి ఉన్నాం. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయని, ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చేతివృత్తి పనివారులు 5.5 మిలియన్ అమ్మకందార్ల సమాజంలో భాగం అయ్యేలా వారిని సాధికారం చేయాలనుకుంటున్నామని, మా వేదికలను వారి కళలలోని సున్నితత్వాన్ని, సౌందర్యాన్ని, గుణాత్మకతను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు, అమ్మకం దార్లకు తెలిసేందుకు మా వేదికను ఉపయోగిస్తాం అన్నారు.
ఈ భాగస్వామ్యం ఈ ప్రాంతంలోని దేశీయ ఉత్పత్తులు (జౌళి, వెదురు ఉత్పత్తులు, ఉపకరణాలు, మరెన్నో వర్గాలు) ఎట్సీ వేదికపై మిలియన్ల మంది కొనుగోలుదార్లకు అందుబాటులో ఉంటుందుకు తోడ్పడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర సహా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన హస్తకళలవారిని ఎట్సీతో అనుసంధానం చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్ధిష్ట మొత్తంలో ఉచిత ప్రకటనల పరపతిని వారు అందుకుంటారు.
ఎట్సీ గురించిః
ఎట్సీ ఐఎన్‌సిని 2005లో స్థాపించారు. దీని కేంద్ర కార్యాలయం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది సృజనాత్మక, రసాత్మకత కలిగిన అమ్మకందార్లు, కొనుగోలుదార్ల ను రెండు విధాల మార్కెట్‌ను నిర్వహిస్తుంది. వాణిజ్యాన్ని దమానవీయంగా ఉంచాలన్న మిషన్‌ను ఈ మార్కెట్లు పంచుకుంటాయి, సమాజాలను బలోపేతం, ప్రజలను సాధికారం చేసేందుకు వ్యాపార, సాంకేతిక శక్తిని ఉపయోగించేందుకు కట్టుబడి ఉంటాయి. దాని ప్రాథమిక మార్కెట్ అయిన ఎట్సీడాట్ కామ్, ప్రత్యేకమైన, సృజనాత్మక వస్తువులకు ప్రపంచ గమ్యస్థానం. సృజనాత్మక వ్యాపారులకు చెక్కిన, ఎంపిక చేసిన వస్తువులను చూసి స్ఫూర్తిపొందేందుకు, సంతోషించేందుకు కొనుగోలుదార్లు ఎట్సీకి వస్తారు. అమ్మకందార్లకు, కీలకమైన వ్యాపార అవసరాలను పరిష్కరించే పలు ఉపకరణాలు, సేవలను అమ్మకందార్లకు ఎట్సీ అందిస్తుంది.
ఎట్సీ ఐఎన్‌సి హౌజ్ ఆఫ్ బ్రాండ్స్ పోర్ట్‌ఫోలియో (వ్యాపార సముచ్ఛయం)లో ఫ్యాషన్ రీసేల్ మార్కెట్ ప్లేస్ డీపాప్ (Depop), సంగీత వాయిద్యాల మార్కెట్ ప్లేస్ రివెర్బ్ (Reverb), బ్రెజిల్ ఆధారిత చేతితో తయారు చేసిన వస్తువల మార్కెట్ ప్లేస్ ఎలో 7 (Elo7) ఉన్నాయి. ప్రతి ఎట్సీ ఐఎన్‌సి మార్కెట్ ప్లేస్ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూనే, ఉత్పత్తి, మార్కెటింగ్, సాంకేతికత, వినియోగదారుల మద్దతు వంటి అంశాలలో నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా లబ్ధి పొందుతుంది.
ఎన్ఇహెచ్‌హెచ్‌డిసి గురించిః
1997లో స్థాపించిన నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఇహెచ్‌హెచ్‌డిసి), ఈశాన్య ప్రాంతంలోని దేశీయ హస్తకళలను అభివృద్ధి చేసి ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంది. సంభావ్య మార్కెట్లు, వినియోగదారులను హస్తకళల పనివారిని అనుసంధానం చేయడం ద్వారా ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అవకాశాలను కల్పించడమే కాక వినియోగదారులకు సాంస్కృతిక విలువను జోడిస్తుంది. భారత ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ( డిఒఎన్ఇఆర్) శాఖా పాలనా నియంత్రణలో ఈ కర్పొరేషన్ పని చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర సహా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన హస్తకళలశ్రేణిని అందిస్తుంది.
చేనేత ఉత్సత్తులను, హస్తకళల ఉత్పత్తులను ఈ ప్రాంతంలోని చేతివృత్తి పనివారల నుంచి, చేనేత పనివారి నుంచి సేకరించి, షిల్లాంగ్, గువాహతి, కోలకత, న్యూఢిల్లీ, బెంగళూరులలో ఉన్న పూర్వశ్రీ ఎంపోరియా చెయిన్ ద్వారా రిటైల్ అమ్మకాలను నిర్వహిస్తూ, చెన్నైలో సేల్స్ ప్రమోషన్ కార్యాలయాన్ని కలిగి ఉంది. అదనంగా, వివిధ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రదర్శనలు, వాణిజ్య ప్రదర్శనల ద్వారా ఈ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. చేతివృత్తిపనివారు, చేనేత పనివారు తమ నైపుణ్యాలను, జ్ఞానాన్ని ఆధునీకరించుకునేందుకు శిక్షణా కార్యక్రమాలను, సెమినార్లను కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
****
(Release ID: 1824033)
Visitor Counter : 141