ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీలోని లేడీ హార్డింజ్‌ మెడికల్ కాలేజీ మరియు అసోసియేటెడ్ హాస్పిటల్‌లో కొత్త ఓపీడీ/ఐపీడీ బ్లాకులను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా


గౌరవనీయులైన ప్రధాన మంత్రి నిర్దేశించినట్టుగా ఆరోగ్య సంరక్షణ మరియు ఆధునిక వైద్య సదుపాయాల మధ్య సమన్వయంతో ఆరోగ్య రంగంలో సమగ్రంగా పనిచేయడమే మా లక్ష్యం: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

ఆరోగ్యాన్ని అన్నివర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలి, అందుబాటు ధరలో మరియు పేషెంట్ ఫ్రెండ్లీగా మార్చాలి: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కేవలం వ్యాధుల చికిత్సకు మాత్రమే పరిమితం కాదు. వాటి ద్వారా సామాజిక న్యాయం కూడా ప్రోత్సహించబడుతుంది: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర సహాయ మంత్రి

Posted On: 09 MAY 2022 2:13PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ (ఎల్‌హెచ్‌ఎంసీ) మరియు అనుబంధ ఆసుపత్రిలో 'న్యూ స్టేట్ ఆఫ్ ఆర్ట్' మల్టీ-స్పెషాలిటీ అవుట్-పేషెంట్ మరియు ఇన్-పేషెంట్ (ఓపిడీ/ఐపీడీ) బ్లాకులను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ప్రారంభించారు.
image.png

 

image.pngimage.png
ఈ చొరవ ద్వారా ఎల్‌హెచ్‌ఎంసీకి చెందిన కొత్త ఐపీడీ బ్లాక్ బెడ్‌ల సామర్ధ్యం  877 నుండి 1000 కంటే ఎక్కువకు చేరుతుంది. ఐపీడీ బ్లాక్‌లో అదనపు అత్యంత అధునాతన సీటీ స్కానర్ ఉంది. కొత్త మల్టీ-స్పెషాలిటీ ఓపీడీ బ్లాక్‌లో అన్ని మెడికల్ మరియు సర్జికల్ స్పెషాలిటీలు, ఆయుర్వేదం, యోగా & నేచురోపతి & హోమియోపతితో సహా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం అదనపు సౌకర్యాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. " దేశం 'టోకెన్' నుండి 'మొత్తం' విధానం వైపు మళ్లిందని అన్నారు. ఈ రోజు, మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నాయకత్వంలో ఆరోగ్య సంరక్షణ మరియు ఆధునిక వైద్య సదుపాయాల మధ్య సమన్వయంతో ఆరోగ్య రంగంలో సమగ్రంగా పనిచేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పేదల వైద్యం ఖర్చు తగ్గించడంతో పాటు వైద్యుల సంఖ్యను వేగంగా పెంచేందుకు కృషి చేస్తున్నారు. మనం సమగ్రంగా ఆలోచించి దీర్ఘకాలానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి. ఈ సంవత్సరం మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నప్పుడు, మనం 100 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే దృక్పథంతో కలిసి పని చేయాలి" అన్నారు.

కేంద్రం చేసే ఏ కార్యక్రమం అయినా అమలు చేయడంలో రాష్ట్రాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన గత 3-రోజుల స్వాస్థ్య చింతన్ శివిర్‌లో రాష్ట్ర ఆరోగ్య మంత్రులందరూ తమ ఉత్తమ విధానాలను పంచుకున్నారు మరియు దానిని విశ్వవ్యాప్తం చేయడం ఎలా అనే దాని గురించి చాలా ఫలవంతమైన చర్చలు జరిగాయి" అని ఆయన చెప్పారు.

భారత ప్రభుత్వం రూపొందించిన ఏదైనా కార్యాచరణ ప్రణాళిక, కార్యక్రమం లేదా పథకం అమలుకు జన్ భగీదరి చాలా ముఖ్యమైనదని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్నారు. "ఆరోగ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం, సరసమైన మరియు రోగికి అనుకూలమైనదిగా చేయడం చాలా ముఖ్యం. మన ప్రయత్నాలు దేశం యొక్క పురోగతి దిశలో ఉండాలి; దేశం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు.
image.png
దేశ రాజధానిలో అత్యంత పురాతనమైన వైద్య కళాశాలకు హాజరు కావడం పట్ల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " ఈ వైద్య కళాశాలకు శతాబ్దానికి పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ కాలంతో పాటు అభివృద్ధి చెందుతోంది. మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కేవలం వ్యాధుల చికిత్సకు మాత్రమే పరిమితం కాదన్నది గమనించాల్సిన విషయం. పేదలకు అందుబాటు ధరలో మరియు నాణ్యమైన వైద్యం లభించినప్పుడు, వ్యవస్థపై వారి విశ్వాసం బలపడుతుంది." అని తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ రామ్ చంద్ర, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


 

****



(Release ID: 1824031) Visitor Counter : 147