వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

టిష్యూ కల్చర్ ప్లాంట్ల ఎగుమతుల పెరుగుదల కోసం చొరవ చూపుతున్న కేంద్రం ; కొత్త మార్కెట్లను యాక్సెస్ చేయడానికి ఎగుమతిదారులకు అందిస్తున్న సహాయం


బయోటెక్నాలజీ విభాగం DBT-గుర్తింపు పొందిన టిష్యూ కల్చర్ ల్యాబ్‌లు దిగుమతి చేసుకునే దేశాల నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం

Posted On: 08 MAY 2022 3:23PM by PIB Hyderabad

టిష్యూ కల్చర్ ప్లాంట్ల ఎగుమతులు పెంచేందుకు, కేంద్రం వ్యవసాయ ఉత్పత్తుల అధీకృత సంస్థ -అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌ పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ద్వారా "ఆకులు, సజీవ మొక్కలు, కట్ ఫ్లవర్స్, నాటడం మెటీరియల్ వంటి టిష్యూ కల్చర్ మొక్కల ఎగుమతి ప్రమోషన్" అనే అంశంపై అంతర్జాల సమావేశం  వెబ్‌నార్ నిర్వహించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT) గుర్తింపు పొందిన భారతదేశం అంతటా విస్తరించి ఉన్న టిష్యూ కల్చర్ ప్రయోగశాలలు ఇందులో పాల్గొన్నాయి.
భారతదేశం నుండి టిష్యూ కల్చర్ మొక్కలు దిగుమతి చేసుకుంటున్న మొదటి పది దేశాలు నెదర్లాండ్స్, అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, కెన్యా, సెనెగల్, ఇథియోపియా, నేపాల్. 2020-2021లో, టిష్యూ కల్చర్ ప్లాంట్‌ల భారతదేశం ఎగుమతులు  17.17 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి, నెదర్లాండ్స్  దేశం ఎగుమతుల్లో  50% వాటాను కలిగి ఉంది.
అపెక్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ బాడీ ఈ మార్కెట్‌లను అందుబాటులోకి తేవడంలో భారతీయ ఎగుమతిదారులు/టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీలకు ఏవిధంగా సహాయపడగలదో ఈ దేశాల్లోని టిష్యూ కల్చర్ ప్లాంట్‌ల తాజా వ్యాపార సరళి గురించి APEDA అధికారులు పాల్గొన్న వారికి  తెలియజేశారు. ఈ లాబొరేటరీ తో ఇది మొదటి పరస్పర చర్చా కార్యక్రమం అయినందున, APEDA తన పనితీరు గురించి వివరించింది, ఇంకా, ఎగుమతి ఆధారిత ప్లాంట్ టిష్యూ కల్చర్ ప్రయోగశాలల సామర్థ్యం, మొక్కల నాణ్యతను మెరుగు పరచడానికి విస్తరించిన ఇతర ఆర్థిక సహాయం, రెండోది దిగుమతి చేసుకునే ఫైటో-శానిటరీ నిబంధనలు ఎలా తీర్చగలదో సైతం వివరించింది. ఈ నిబంధనల అమలు వల్ల ఎగుమతిదేశాలు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. భారతదేశంలో పెరిగిన టిష్యూ కల్చర్ మొక్కల శ్రేణిని వివరించడానికి, ఉత్పత్తి చేసే దేశాల నుంచి దిగుమతి చేసుకోగల నిర్దిష్ట మొక్కలు/పంటల కోసం జెర్మ్‌ ప్లాజమ్‌ల జాబితాను అందించాలని APEDA ఎగుమతిదారులను కోరింది.-
ఎగుమతిదారులు, APEDA భారతదేశంలో అందుబాటులో ఉన్న టిష్యూ కల్చర్డ్ మొక్కలు, అటవీ మొక్కలు, కుండీలలో పెట్టిన మొక్కలు, అలంకారమైన రీతిననాటడం వంటి వివిధ రకాల పద్ధతులతో  వృక్ష జాలాలు ప్రదర్శించడానికి భారతదేశంలో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించాలని సూచించారు. భారతదేశం నుండి టిష్యూ కల్చర్ ప్లాంట్‌ల కోసం కొత్త మార్కెట్‌లను గుర్తించేందుకు దిగుమతిదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి విదేశాలకు వాణిజ్య ప్రతినిధి బృందాన్ని పంపడంలో APEDA నాయకత్వం వహించాలని కూడా వారు సూచించారు.
టిష్యూ కల్చర్ ప్లాంట్ లేబొరేటరీ టిష్యూ కల్చర్డ్ ప్లాంటింగ్ మెటీరియల్ ఉత్పత్తి, దాని ఎగుమతులలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపారు. ఎగుమతిదారులు విద్యుత్ ఖర్చు పెరగడం, ప్రయోగశాల లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, తక్కువ సామర్థ్యం స్థాయి, ప్రయోగశాల లో కాలుష్య సమస్యలు, సూక్ష్మ-ప్రయోగం చేసి భారతీయ మొక్కలు నాటడం,  సామగ్రి రవాణా ఖర్చు, HS కోడ్‌లో సమన్వయం లేకపోవడం వంటి సమస్యలపై APEDA అధికారుల దృష్టిని ఆకర్షించారు. లైవ్ ప్లాంటింగ్ మెటీరియల్‌ను ఎగుమతి చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న అటవీ నిర్బంధ విభాగాలు లేవనెత్తిన ఇతర దేశాల అభ్యంతరాలను ఈ సమావేశంలో చర్చించారు.
టిష్యూ కల్చర్ నిపుణులు, ఏపీఈడీఏ ఈ సమస్యలు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. టిష్యూ కల్చర్ ప్లాంట్ ల్యాబొరేటరీ ఎదుర్కొంటున్న అన్ని కష్టాలను పరిష్కరించడానికి APEDA రౌండ్-ది-క్లాక్ సేవకు హామీ ఇచ్చింది.
APEDA ఎగుమతి నాణ్యమైన టిష్యూ కల్చర్ ప్లాంటింగ్ మెటీరియల్‌ని ఉత్పత్తి చేయడానికి ప్రయోగశాలలు తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడంలో సహాయపడటానికి ఆర్థిక సహాయ పథకాన్ని (FAS) అమలు చేస్తోంది. ఇది వివిధ అంతర్జాతీయ ఫోరమ్‌లలో కొనుగోలుదారులు-విక్రేత సమావేశాలలో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ ప్రదర్శనలలో టిష్యూ కల్చర్ ప్లాంట్‌ల మార్కెట్ అభివృద్ధి, మార్కెట్ విశ్లేషణ ప్రమోషన్ ప్రదర్శన ద్వారా విభిన్న దేశాలకు టిష్యూ కల్చర్ మొక్కల పెంపకం సామగ్రిని ఎగుమతి చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది.
భారతదేశం తన విస్తార  పరిజ్ఞానంతో, బయోటెక్ నిపుణులతో విస్తారమైన టిష్యూ కల్చర్ అనుభవంతో పాటు ఎగుమతి ఆధారిత నాణ్యమైన నాటడం పదార్థాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయం చేయడానికి తక్కువ-ధరలో ఉండే  శ్రామిక శక్తిని కలిగి ఉంది. ఈ అంశాలన్నీ భారతదేశాన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు నాణ్యమైన వృక్షజాలం, విస్తృతమైన శ్రేణిని అందించే సంభావ్య ప్రపంచ సరఫరాదారుని చేస్తాయి, తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడతాయి.

***



(Release ID: 1823795) Visitor Counter : 162