యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిమాచల్ ప్రదేశ్‌లో సిర్మూర్ మజ్రాలో హాకీ ఆస్ట్రోటర్ఫ్‌కు శంకుస్థాపన చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 08 MAY 2022 5:47PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు మ‌రియు  క్రీడలు, సమాచార & ప్రసారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు హిమాచల్ ప్రదేశ్‌లోని మజ్రా ప్రాంతంలో హాకీ ఆస్ట్రోటర్ఫ్‌కు శంకుస్థాపన చేసిన చేశారు. ఆనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ ప్రజలు క్రీడలలో రాణించేందుకు గాను సహజ ప్రతిభను కలిగి ఉన్నారు. వారు  దానిని ఉపయోగించుకొనేలా  ప్రతి సౌకర్యాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిశ్చయించుకుంది అని అన్నారు. ఈ హాకీ టర్ఫ్‌కు రూ.6 కోట్లు వెచ్చించనున్నామని, ఇందులో క్రీడాకారులకు బాలికల హాస్టల్, దుస్తులు మార్చుకునే గదులు, మరుగు దొడ్లు, కోచింగ్ సదుపాయాలు తదితర  అన్ని సౌకర్యాలు ఉంటాయని శ్రీ ఠాకూర్ వెల్ల‌డించారు. ప్ర‌తిభ క‌లిగిన వారిని గుర్తించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం టాలెంట్ హంట్ కార్యక్రమాలు నిర్వహించవచ్చని సూచించారు. రాష్ట్రంలోని వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు. రాబోయే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021లో గట్కా, కలరిపయట్టు, తంగ్-టా, మల్లఖంబా మరియు యోగాసన అనే ఐదు సంప్రదాయ ఆటలు ఉంటాయని, వాటిని ప్రపంచ వేదికపై ప్రాచుర్యం కల్పించ‌డానికి  భారత ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో సంప్రదాయ క్రీడలకు కూడా గుర్తింపు లభిస్తుందని మంత్రి అన్నారు. పాంటా సాహిబ్‌లో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు.
ఈ ఏడాది  బెంగళూరులో ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా యూనివర్శిటీ క్రీడ‌ల‌లో రెండు జాతీయ రికార్డులు మ‌రియు  76 యూనివర్శిటీ గేమ్స్‌ల‌లో గ‌త‌ రికార్డులు బద్దలయ్యాయని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి తెలిపారు.యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ తరపున షిల్లై తహసీల్ కుల్దీప్ సింగ్ కోటా గ్రామానికి చెందిన దివ్యాంగ్‌కు స్కూటీని బహూకరించారు. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో కూడిన ప్రాంతంలో మంత్రి రెండు రోజుల పవర్ ప్యాక్డ్ టూర్ ఈ రోజు ముగిసింది. శ్రీ ఠాకూర్ శనివారం హర్యానా సీఎం శ్రీ మనోహర్ లాల్, ఇతర ప్రముఖులతో కలిసి పంచకుల (హర్యానా)లోని ఇంద్రధనుష్ ఆడిటోరియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లోగో, గీతం, మస్కట్ మరియు జెర్సీని ఆవిష్కరించారు.  పాటియాల (పంజాబ్)లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్‌) యొక్క నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ప్రాజెక్ట్‌లకు ఫ్లాగ్ చేశారు.
                                                                           

***


(Release ID: 1823793) Visitor Counter : 155