హోం మంత్రిత్వ శాఖ
హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు సంక్షేమ, పునరావాస బోర్డు (వార్బ్) ద్వారా 'సిఏపిఎఫ్ పునరావాస్' పోర్టల్ ప్రారంభించిన హోం మంత్రిత్వ శాఖ
పదవీ విరమణ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల్లో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర సాయుధ పోలీసు దళం , అస్సాం రైఫిల్స్ సిబ్బందికి పోర్టల్ సహకరిస్తుంది
వార్బ్ పోర్టల్ లో వ్యక్తిగత వివరాలు, అనుభవం నమోదు చేసుకుని అర్హతకు తగిన ఉద్యోగాన్ని తమకు నచ్చిన ప్రాంతంలో పొందేందుకు సిబ్బందికి అవకాశం కలుగుతుంది
కేంద్ర సాయుధ పోలీసు దళం సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం
సిబ్బంది సంక్షేమం, కేంద్ర సాయుధ పోలీసు దళం పునరావాస అవసరాలు తీర్చడంలో కీలకంగా మారనున్న పోర్టల్
Posted On:
07 MAY 2022 3:50PM by PIB Hyderabad
పదవీ విరమణ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల్లో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర సాయుధ పోలీసు దళం , అస్సాం రైఫిల్స్ సిబ్బందికి సహకారం అందించాలన్న లక్ష్యంతో హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు సంక్షేమ, పునరావాస బోర్డు (వార్బ్) ద్వారా హోం మంత్రిత్వ శాఖ 'సిఏపిఎఫ్ పునరావాస్' పోర్టల్ ను ప్రారంభించింది. ఈ పోర్టల్ లో తమ వ్యక్తిగత వివరాలు, అనుభవం నమోదు చేసుకుని అర్హతకు తగిన ఉద్యోగాన్ని తమకు నచ్చిన ప్రాంతంలో పొందేందుకు పదవీ విరమణ చేసిన సిబ్బందికి అవకాశం కలుగుతుంది. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల రిజిస్ట్రేషన్ కోసం హోం మంత్రిత్వ శాఖ కోసం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం కింద హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఒక పోర్టల్‌ను నిర్వహిస్తోంది. కేంద్ర సాయుధ పోలీసు దళం సిబ్బంది వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది.
తానూ నిర్వహిస్తున్న రెండు వెబ్ సైట్లను హోం మంత్రిత్వ శాఖ అనుసంధానం చేసింది. దీనివల్ల ' సిఏపిఎఫ్ పునర్వాస్' ద్వారా పునరావాసం కోసం పదవీ విరమణ చేసిన సిబ్బంది పొందుపరిచిన వివరాలను ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం కింద హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు పరిశీలించేందుకు వీలవుతుంది. దీనితో ఉద్యోగార్ధులు, ఉపాధి కల్పించే సంస్థలు ఒక వేదిక ద్వారా పని చేయగలుగుతాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ చర్యతో ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలకు ' సిఏపిఎఫ్ పునర్వాస్' కింద అవసరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది.
భద్రతా సేవలు అవసరమయ్యే వ్యాపార సంస్థల సంఖ్య పెరగడంతో ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. సంస్థల సంఖ్య పెరగడంతో భద్రతా సిబ్బంది అవసరం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో పదవీ విరమణ చేసి తిరిగి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న సిబ్బంది వివరాలను హోం మంత్రిత్వ శాఖ పోర్టల్ ద్వారా తీసుకుని అనుభవం, శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలకు వీలవుతుంది. అనుభవం, అర్హతల మేరకు పదవీ విరమణ చేసిన కేంద్ర సాయుధ పోలీసు దళం సభ్యులు తమకు నచ్చిన ప్రాంతంలో అర్హతలకు తగిన ఉపాధిని పొందేందుకు ఎలక్ట్రానిక్ వేదిక అవకాశం కలిగిస్తుంది.
కేంద్ర హోంశాఖ తీసుకున్న ఈ నిర్ణయం కేంద్ర సాయుధ పోలీసు దళం సిబ్బంది సంక్షేమం, పునరావాస అవసరాలు తీర్చడంలో కీలకంగా ఉంటుంది.
***
(Release ID: 1823576)
Visitor Counter : 290