హోం మంత్రిత్వ శాఖ
భారతదేశ హరిత ఇంధన చొరవను సాకారం చేసేందుకు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన ఎంహెచ్ ఎ, ఎస్ఇసిఐ
प्रविष्टि तिथि:
07 MAY 2022 11:15AM by PIB Hyderabad
కార్బన్ తటస్థ ఆర్ధిక వ్యవస్థ దిశగా కదలేందుకు పునరావృత ఇంధనాన్ని ప్రోత్సహించాలన్న భారత ప్రభుత్వ కృషి దిశగా కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సిఎపిఎఫ్‌లు), జాతీయ భద్రతా గార్డు (ఎన్ఎస్ జి) ఆవరణలలో సోలార్ ఎనర్జీ పానెళ్ళను ఏర్పాటు చేసే ప్రతిపాదన అమలుకు కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శనంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ), సోలార్జ్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఇసిఐ) న్యూఢిల్లీ కేంద్ర హోం కార్యదర్శి, నూతన & పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమక్షంలో మే 6 అవగాహనా ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేశారు. ఇంటికప్పుపై సోలార్ పివి పవర్ ప్లాంట్లను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు రెండు పార్టీల మధ్య సహకార, సమన్వయాలను ఈ అంబ్రెల్లా (ఆధిపత్య) ఎంఒయు అంచనా వేస్తోంది .
అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా సిఎపిఎఫ్‌లు & ఎన్ఎస్‌జి ఆవరణలలో మొత్తం 71.68 మెగావాట్ల సౌర శక్తి సంభావ్యతను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఇసిఐ) అంచనా వేసింది. సౌరశక్తి ప్రాజెక్టుల క్షేత్రంలో నైపుణ్యం కలిగిన ఎస్ఇసిఐ ప్రత్యక్షంగా లేదా కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ (పోటీ వేలం ప్రక్రియ) ద్వారా ఎంపిక చేసిన ఒక ఏజెన్సీ లేదా ఏజెన్సీల ద్వారా రూఫ్ టాప్ సోలార్ పివి పవర్ ప్లాంట్లను అమలు చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తోడ్పడనుంది.
***
(रिलीज़ आईडी: 1823496)
आगंतुक पटल : 240