ప్రధాన మంత్రి కార్యాలయం

నార్వే ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 04 MAY 2022 2:15PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండో ఇండియా- నార్డిక్ సమిట్ జరిగిన సందర్భం లో కోపెన్ హేగన్ లో నార్వే ప్రధాని శ్రీ జోనస్ గహర్ స్టోర్ తో సమావేశమయ్యారు. ప్రధాని శ్రీ స్టోర్ 2021వ సంవత్సరం లో అక్టోబరు లో పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత ఇద్దరు నేతల మధ్య ఇదే ఒకటో సమావేశం.

ద్వైపాక్షిక సంబంధాల లో భాగం గా ప్రస్తుతం కొనసాగుతున్న కార్యకలాపాల ను ప్రధాన మంత్రులు ఇద్దరూ సమీక్షించారు. రాబోయే కాలం లో మరేయే రంగాల లో సహకారాని కి అవకాశాలు ఉన్నదీ వారు చర్చించారు. నార్వే యొక్క నైపుణ్యాలు, భారతదేశం లోని అవకాశాలు స్వాభావికం గా ఒకదానికి మరొకటి పూరకాలు గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. నేత లు ఇరువురూ బ్లూ ఇకానమి, నవీకరణ యోగ్య శక్తి, గ్రీన్ హైడ్రోజన్, సోలర్ ప్రాజెక్టులు మరియు విండ్ ప్రాజెక్టులు, గ్రీన్ శిపింగ్, మత్స్య పాలన, జల నిర్వహణ, వర్షం నీటి సంగ్రహణ, అంతరిక్ష సహకారం, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పన లో పెట్టుబడి, ఆరోగ్యం మరియు సంస్కృతి వంటి రంగాల లో సహకారాన్ని మరింతగా బలపరచుకొనేందుకు ఉన్న అవకాశాల పైన చర్చించారు.

ప్రాంతీయ మరియు ప్రపంచ ఘటనక్రమాల పైన కూడా చర్చ జరిగింది. ఐక్య రాజ్య సమితి భద్రత మండలి సభ్యత్వ దేశాలు అయినటువంటి భారతదేశం మరియు నార్వే లు ఐక్య రాజ్య సమితి లో పరస్పర హితం ముడిపడ్డ ప్రపంచ అంశాల లో ఒక దేశానికి మరొక దేశం సహకారాన్ని అందించుకొంటూ వస్తున్నాయి.

***



(Release ID: 1822813) Visitor Counter : 122