యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

పదుకొనే-ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లోని అత్యాధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో లో పోటీ పడేందుకు మరిన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవాలి... శ్రీ అనురాగ్ ఠాకూర్ పిలుపు

Posted On: 03 MAY 2022 4:37PM by PIB Hyderabad

ఆటలు ఆడటానికి వారాంతం లేదా సెలవుల కోసం వేచి ఉండకుండా ఎక్కడైనా మరియు ఎప్పుడైనా ఆటలు ఆడాలని కేంద్ర సమాచారప్రసార   మరియు యువజన వ్యవహారాలు క్రీడల శాఖ అంన్నారు. మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ అన్నారు.  పదుకొనే -ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ (సీఎస్ఈ)లో క్రీడాకారులతో  మంత్రి మాట్లాడారు. సీఎస్ఈలో కల్పించిన అత్యాధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో లో పోటీ పడేందుకు  మరిన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని క్రీడాకారులకు  శ్రీ అనురాగ్ ఠాకూర్  సూచించారు. 

బెంగళూరులో 15 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో పదుకొనే -ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ (సీఎస్ఈ)ని నిర్మించారు. బ్యాడ్మింటన్క్రికెట్ఫుట్‌బాల్టెన్నిస్స్విమ్మింగ్స్క్వాష్బాస్కెట్‌బాల్ మరియు షూటింగ్‌లలో శిక్షణ కోసం దీనిలో  అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఆసక్తి కలిగి తాము ఎంచుకున్న క్రీడాంశంలో ప్రతిభ కనబరిచి రాణించేందుకు పోటీతత్వ మరియు వినోదభరితమైన అథ్లెట్లుప్రొఫెషనల్ కోచ్‌లుస్పోర్ట్స్ అకాడమీలు మరియు ఔత్సాహిక యువత  ప్రతిభను గుర్తించి  ప్రోత్సహించడం లక్ష్యంగా సీఎస్ఈ పనిచేస్తున్నది. సీఎస్ఈని ఇటీవల బ్యాడ్మింటన్ మరియు స్విమ్మింగ్ రెండింటికీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగుర్తించింది. 

క్రీడల అభివృద్ధికి అవసరమైన  సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు నిర్మించడానికి  అవసరమైన క్షేత్ర  స్థాయి కార్యక్రమాలకు సీఎస్ఈ రూపకల్పన చేసే అమలు చేస్తున్నది.  అదే సమయంలో భవిష్యత్తులో అంతర్జాతీయ ఆటగాళ్లను తయారు చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.   సీఎస్ఈ లో   ఇప్పటికే లక్ష్య సేన్శ్రీహరి నటరాజ్అశ్విని పొన్నప్ప మరియు అపూర్వి చండేలీ వంటి క్రీడాకారులను  అత్యంత ప్రతిభావంతులైన మరియు విజయవంతమైన అథ్లెట్‌లుగా తీర్చి దిద్దింది. 

ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు విమల్ కుమార్ (ప్రకాష్ పదుకొణె బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్) మరియు నిహార్ అమీన్ (డాల్ఫిన్ ఆక్వాటిక్ ప్రధాన కోచ్)తో సహా అత్యంత నిష్ణాతులు సీఎస్ఈలో  కోచ్‌లుగా సేవలు అందిస్తున్నారు.  అత్యంత విజయవంతమైన మరియు ప్రసిద్ధ క్రీడాకారుల ద్వారా క్రీడలకు సంబంధించి శిక్షణ ఇస్తున్న సంస్థగా   అందిస్తున్న సంస్థగా   సీఎస్ఈ గుర్తింపు పొందింది. 

అంతర్జాతీయ పోటీలలో పాల్గొని రాణించేందుకు  అథ్లెట్ కు శాస్త్రీయ పద్దతిలో సహకారం శిక్షణ అవసరముంటుంది. దీనికి అనుగుణంగా సీఎస్ఈ లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించడం జరిగింది.   ప్రయాణంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటేప్రపంచ వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి క్రీడా శాస్త్రాల ద్వారా వారికి అవసరమైన మద్దతు.  అభినవ్ బింద్రా టార్గెటింగ్ పెర్ఫార్మెన్స్ సెంటర్ (ఏబీటీబి), వెసోమా స్పోర్ట్స్ మెడికల్ సెంటర్ మరియు సమిక్ష సైకాలజీ ఫిజియోథెరపీ,  హైడ్రోథెరపీజెరియాట్రిక్ కేర్స్పోర్ట్స్ న్యూట్రిషన్ మరియు స్పోర్ట్స్ సైకాలజీ ద్వారా క్రీడాకారులు, ఇతరులకు సేవలు అందిస్తున్నారు.

 ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన  అభినవ్ బింద్రా ఏబీటీబి ని స్థాపించారు. ఉన్నత క్రీడాకారులు, వినోదం కోసం క్రీడలు ఆడుతున్న వారికి శిక్షణ ఇచ్చి వారి ప్రతిభను గుర్తించేందుకు అవసరమైన సౌకర్యాలను ఏబీటీబి లో కల్పించారు.  పైలేట్స్ రూమ్  మరియు క్రియోథెరపీ ఛాంబర్‌ లో క్రీడాకారులకు ప్రవేశం కల్పించారు. 

 

 క్రీడలను ఇష్టపడే వ్యక్తులు మరియు కార్పొరేట్‌లకు కూడా కేంద్రం క్రీడా సభ్యత్వాన్ని అందిస్తుంది.  వారు ఎంచుకున్న క్రీడలో శిక్షణ ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో పనిచేస్తున్న  ఫిట్‌నెస్ సెంటర్‌ సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు, క్యాంపస్ నడిబొడ్డున ఉన్న రెండు అంతస్తుల క్లబ్‌హౌస్  'ది గ్రాండ్‌స్టాండ్'లో ప్రవేశించేందుకు వీరికి అనుమతి ఇస్తారు. 

క్రీడల మంత్రి తో పాటు  క్రికెటర్ శ్రీ రాహుల్ ద్రవిడ్, పదుకొనే-ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వివేక్ కుమార్, సభ్యులు మరియు సీనియర్ అధికారులు ప్రాంగణాన్ని సందర్శించారు. 



(Release ID: 1822486) Visitor Counter : 113