ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జర్మనీలో ప్రవాస భారతీయులతో ముచ్చటించిన ప్రధానమంత్రి

Posted On: 03 MAY 2022 12:01AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెర్లిన్‌లోని ‘థియేటర్ అమ్ పోట్స్ డామర్ ప్లాట్జ్’లో ప్రవాస భారతీయులతో ముచ్చటించడంతోపాటు వారినుద్దేశించి ప్రసంగించారు. పలువురు విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు సహా జర్మనీలో నివసిస్తున్న శక్తిమంతమైన భారతీయ సమాజ సభ్యులు 1600 మంది ఇందులో పాల్గొన్నారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థతోపాటు సమాజ ప్రగతికి వారందిస్తున్న సహకారాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలో భాగంగా ’స్థానికతకు స్వగళం’ కార్యక్రమానికి తమవంతు సహకరించాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు.

 


(Release ID: 1822437) Visitor Counter : 147