వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2013-14 నుంచి నుంభారతదేశం యొక్క ఫార్మా ఎగుమతులు 103% వృద్ధి చెందాయి.
ప్రపంచ వాణిజ్యం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ 2021-22లో మనదేశ ఫార్మా ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదుచేశాయి.
ఫార్మా ట్రేడ్ బ్యాలెన్స్ భారతదేశానికి అనుకూలంగా కొనసాగుతోంది
భారతీయ ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 55% అధిక నియంత్రణ కలిగిన మార్కెట్లను అందిస్తోంది
Posted On:
01 MAY 2022 12:05PM by PIB Hyderabad
2013-14 నుంచి భారతీయ ఫార్మా ఎగుమతులు 103% వృద్ధిని సాధించాయి.2013-14లో రూ. 90, 415 కోట్లు, 2021-22లో రూ. 1,83,422 కోట్లు. 2021-22లో సాధించిన ఎగుమతులు ఫార్మా రంగంలో ఇప్పటిదాకా నమోదైన అత్యుత్తమ గణాంకాలు. 8 సంవత్సరాలలో ఫార్మా ఎగుమతులు దాదాపు 10 బిలియన్ల డాలర్ల పెరుగుదల ఫార్మరంగంలో చెప్పుకోదగిన పురోభివృద్ధి.కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్లో ఈ విజయాన్ని ఉటంకిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రియాశీల నాయకత్వంలో భారతదేశం 'ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్'గా సేవలందిస్తోందని పేర్కొన్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను కొనసాగిస్తూ.. 2021-22లో మరోసారి ఫార్మరంగం ఆరోగ్యకరమైన పనితీరును కనబర్చింది. మరియు కోవిడ్ సంబంధిత మందులకు డిమాండ్ ప్రపంచ వాణిజ్యంలో అంతరాయాలు ఎదురైనప్పటికీ.. 2021-22లో భారత్ ఫార్మ ఎగుమతుల్లో వృద్ధిని కొనసాగించింది. 15175.81 మిలియన్ల అమెరికన్ డాలర్ల మిగులుతో ఫార్మా ఎగుమతుల్లో భారతదేశం సానుకూల వృద్ధిని నమోదుచేస్తోంది.భారతీయ ఫార్మా కంపెనీలు తమ ధరల పోటీతత్వం మరియు మంచి నాణ్యతతో ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించాయి. ప్రపంచంలోని 60 శాతం వ్యాక్సిన్లు మరియు 20% జనరిక్ ఔషధాలు భారతదేశం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి.
వాల్యూం ప్రకారం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. ఇక విలువ ప్రకారం 14వ స్థానంలో ఉంది. భారతదేశ ఫార్మా విజయగాథ వెనుక మన ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యం, బలమైన మౌలిక సదుపాయాలు, ఖర్చు-పోటీతత్వం, శిక్షణ పొందిన మానవ వనరులు, ఆవిష్కరణలు ఉన్నాయి. భారతీయ ఔషధ పరిశ్రమ యొక్క ప్రస్తుత మార్కెట్ పరిమాణం 50 బిలియన్ల అమెరికన్ డాలర్లు.
మన ప్రపంచ ఎగుమతుల్లో ఫార్మాస్యూటికల్ మరియు డ్రగ్స్ వాటా 5.92%. ఫార్ములేషన్స్ మరియు బయోలాజికల్స్ భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 73.31% ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి, 4437.64 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఎగుమతులతో బల్క్ డ్రగ్స్ మరియు డ్రగ్ ఇంటర్మీడియట్లు ఉన్నాయి. భారతదేశ ఫార్మా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, రష్యా, మరియు నైజీరియా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
భారతదేశ ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 55% అధిక నియంత్రణ కలిగిన మార్కెట్లను అందజేయడం గమనార్హం. అమెరికా, మరియు ప్రిస్క్రిప్షన్ మార్కెట్లో భారతీయ ఫార్మా కంపెనీలకు గణనీయమైన వాటా ఉంది. అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో ఎఫ్డీఏలు ఆమోదించబడిన ప్లాంట్లు భారతదేశంలో ఉన్నాయి.
కోవిడ్ పరిస్థితులు ఎదురైనప్పటికీ 2020-21 సంవత్సరంలో కూడా భారతీయ ఔషధాలు మరియు ఫార్మాస్యూటికల్స్ గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి, 18% వృద్ధితో 24.4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఎగుమతిని సాధించింది.
తరచుగా లాక్ డౌన్లు, గ్లోబల్ సరఫరాలో అంతరాయాలు, అణగారిన ఉత్పాదక రంగం వంటి పరిస్థితుల్లో కూడా ఫార్మరంగం చెప్పుకోదగిన స్థాయిలో ఈ గణాంకాలను నమోదు చేసింది. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడంలో భారతీయ ఫార్మా పరిశ్రమ కీలక పాత్ర పోషించింది మరియు ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం నమ్మదగిన మరియు ఆధారపడే భాగస్వామిగా కొనసాగుతామని ప్రపంచానికి నిరూపించింది.
భారతీయ వ్యాక్సిన్ పరిశ్రమ అమెరికా మరియు ఈయూ వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఐసీఎంఆర్ మరియు ఎన్ఐబీ వంటి భారతదేశ పరిశోధనా సంస్థ సహకారంతో స్వదేశీ సాంకేతికతతో కోవిడ్ వ్యాక్సిన్ను తక్కువ సమయంలో అభివృద్ధి చేసింది. భారతదేశం 97 కంటే ఎక్కువ దేశాలకు 115 మిలియన్ డోస్ వ్యాక్సిన్లను అందించింది.
వాణిజ్య ఒప్పందాలలో భాగంగా, భారతదేశం యూఏఈ మరియు ఆస్ట్రేలియాతో సహకార ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మార్కెట్లకు భారతీయ ఫార్మా ఉత్పత్తులతో మెరుగైన ప్రాప్యతను అందిస్తుంది.
***
(Release ID: 1822253)
Visitor Counter : 235