విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విజయవంతంగా ప్రారంభమైన నేషనల్ ఓపెన్ యాక్సెస్ రిజిస్ట్రీ (ఎన్ఒఎఆర్)
అంతర్ రాష్ట్ర ప్రసార వ్యవస్థ యాంత్రిక చెల్లింపు గేట్ వేను కల్పించడం ద్వారా స్వల్పకాలిక ఓపెన్ ఆక్సెస్ నిర్వహణ
Posted On:
02 MAY 2022 3:48PM by PIB Hyderabad
నేషనల్ ఓపెన్ ఆక్సెస్ రిజిస్ట్రీ ( అందరికీ అందుబాటులో ఉండే బహిరంగ రిజిస్ట్రీ - ఎన్ఒఎఆర్) 1 మే 2022 నుంచి పూర్తి స్థాయిలో విజయవంతంగా ప్రారంభమైంది. భాగస్వాములతో సహా ఉపయోగించే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎన్ఒఎఆర్‌ను సమగ్ర ఏకగవాక్ష ఎలక్ట్రానిక్ వేదికలా రూపకల్పన చేశారు.ముఖ్యంగా, వ్యాపారులు, విద్యత్ ఎక్స్‌చేంజీలు, జాతీయ/ ప్రాంతీయ / రాష్ట్ర లోడ్ డిస్పాచ్ కేంద్రాల స్వల్ప కాలిక బహిరంగ ప్రవేశ అనువర్తన ల ఎలక్ట్రానిక్ ప్రక్రియలను రూపొందించడం ద్వారా అంతర్ రాష్ట్ర ప్రసార వ్యవస్థలో స్వల్పకాలిక అందరికీ అందుబాటులో ఉండే పరిపాలనను యాంత్రికం చేస్తుంది.
ఆర్ ఎల్‌డిసిలు లేదా ఎస్ఎల్‌డిసిలు, బహిరంగ ప్రవేశాన్ని కేటాయించిన ఓపెన్ ఆక్సెస్ వినియోగదారులు తదితరులు సహా అంతర్ రాష్ట్ర ప్రసారంలో ఎన్ఒఎఆర్ వేదిక సమాచార ఖజానాగా పని చేస్తూ, అటువంటి సమాచారం భాగస్వాములకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చూస్తుంది. చెల్లింపుల కోసం పేమెంట్ గేట్‌వేను అందించడమే కాక ఎన్ఒఎఆర్‌తో సమన్వయపరిచి, స్వల్పకాలిక ఓపెన్ ఆక్సెస్ బదలాయింపుల ఆర్థిక గణనలకు, ట్రాకింగ్‌కు సౌలభ్యాన్ని కల్పిస్తుంది.
పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఒఎస్ఒసిఒ) ప్రారంభించిన నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్‌డిసి)ని ఎన్ఒఎఆర్ అమలు, నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా నియమించింది. వేగవంతమైన విద్యుత్ మార్కెట్లకు సౌలభ్యం కల్పించడంలో పునరావృత ఇంధన వనరులను గ్రిడ్‌లో సమన్వయపరచడంలో ఎన్ఒఎఆర్ కీలకంగా పని చేస్తుంది.
భారతదేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌లో దాదాపు 10% గా ఉన్న స్వల్పకాలిక విద్యుత్ మార్కెట్ సులభంగా, వేగవంతమైన అందుబాటుతో ఓపెన్ యాక్సెస్ వినియోగదారుడు సజావుగా మార్కెట్‌లో పాలుపంచుకునేందుకు ఎన్ఒఎఆర్ అవకాశం కల్పిస్తుంది.
ఎన్ఒఎఆర్ భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖలో భాగమైన చొరవ. దీనికి అవసరమైన నియంత్రణ చట్రాన్ని సిఇఆర్‌సి అంతర్ రాష్ట్ర ప్రసారాల ఓపెన్ యాక్సెస్ లోని 5వ సవరణ నిబంధనను కార్యాచరణలోకి తేవడం ద్వారా నోటిఫై చేసింది.
***
(Release ID: 1822251)
Visitor Counter : 242