రక్షణ మంత్రిత్వ శాఖ
నూతనంగా ప్రారంభించిన ఏడు రక్షణ కంపెనీలలో ఆరు కంపెనీలు తమ వ్యాపార తొలి ఆరునెలల తాత్కాలిక వ్యక్తిగత లాభాల ప్రకటన
రూ. 8,400 టర్నోవర్ ( మొత్తం వ్యాపారం)ను సాధించిన కంపెనీలు
రూ.3000 కోట్ల విలువైన దేశీయ కాంట్రాక్టులను & రూ. 600 కోట్ల ఎగుమతి ఆర్డర్లను సంపాదించిన కంపెనీలు
రూ. 500 కోట్ల విలువైన యుద్ధ సామాగ్రికై అతిపెద్ద ఎగుమతి ఆర్డర్‌ను సాధించిన మ్యునిట్రాన్స్ ఇండియా లిమిటెడ్
Posted On:
29 APR 2022 10:58AM by PIB Hyderabad
రక్షణ రంగంలో విజయదశమి, అక్టోబర్ 15, 2021 సందర్భంగా జాతికి అంకితం చేసిన నూతన ఏడు కంపెనీలలో ఆరుకంపెనీలు తమ వ్యాపారంలో తొలి ఆరునెలల్లో- అంటే అక్టోబర్ 01,2021 నుంచి 31 మార్చి 2022 వరకు తాత్కాలిక లాభాలను సాధించినట్టు వెల్లడించాయి., ఒక్క యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) మినహా, మిగిలిన కంపెనీలు - మ్యునిటిషయన్స్ ఇండియా లిమిటెడ్ ( ఎంఐఎల్) , ఆర్మర్డ్ వెహికిల్స నిగమ్ లిమిటెడ్ (ఎవిఎఎన్ఐ), అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ ( ఎడబ్ల్యుఇ ఇండియా), ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (టిసిఎల్), ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐఒఎల్), గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (జిఐఎల్) తాత్కాలిక లాభాలను ప్రకటించాయి.
వాటి వివరాలు దిగువన ఇవ్వడం జరిగిందిః
సీ.నెం. నూతన రక్షణ కంపెనీ గత మూడేళ్ళల్లో సగటు ఆరునెలల లాభం (+). నష్టం (-) తాత్కాలిక లాభం,నష్టం (అక్టోబర్ 01, 2021 - మార్చి 31, 2022)
1. ఎంఐఎల్ -677.33 28
2. ఎవిఎన్ఎల్ -164. 33 33.09
3. ఐఒఎల్ -5.67 60,44
4, వైఐఎల్ -348.17 -111.49
5. ఎడబ్ల్యుఇఐఎల్ - 398. 5 4.84
6. జిఐఎల్ -43.67 13. 26
7. టిసిఎల్ -138. 17 26
వాటిని దేశానికి అంకితం చేసిన తర్వాత, తమ వ్యాపారాలను కార్పొరేట్ సంస్థలుగా ప్రారంభించేందుకు ఈ నూతన రక్షణ కంపెనీలకు తొలుత మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. గతంలో ఓఎఫ్ బి వద్ద ఉన్న మిగిలిన రూ. 70,776 కోట్ల విలువైన ఇండెంట్లను ఎటువంటి చట్టపరమైన మార్పులు చేయకుండా కాంట్రాక్టులుగా మార్చడం జరిగింది. ఆర్ధిక సంవత్సరం 2021-22 లక్ష్యాలలో భాగంగా వ్యాపారం ప్రారంభించే తేదీకి ముందే రూ. 7,765 కోట్లను కొత్త రక్షణ కంపెనీలకు 60% సమీకృత బయానాగా గా అందించింది. ఏడు కొత్త కంపెనీలకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మూలధన వ్యయం, ఈక్విటీ కోసం రూ. 2,765.96 కోట్లను విడుదల చేసింది.
నూతన కార్పొరేట్ సం్థలకు అందించిన క్రియాత్మక, ఆర్థిక స్వయంప్రతిపత్తితో పాటుగా ప్రభుత్వ మద్దతు కలిసి ఈ ఆయుధ కర్మాగారాల పనితీరులో మలుపు తేవడం జరిగింది. తొలి ఆరునెలల లోపే, ఈ ఆరు కంపెనీలు రూ. 8,400 కోట్లకు పైగా టర్నోవర్‌ను సాధించాయి. ముందు ఆర్థిక సంవత్సరాలలో గత ఓఎఫ్‌బి వాల్యూ ఆఫ్ ఇష్యూని పరిగిణలోకి తీసుకుంటే ఇది చెప్పుకోదగినది.
తొలి రోజు నుంచే, ఈ కంపెనీలు నూతన మార్కెట్లను అన్వేషించడం, ఎగుమతులు సహా వ్యాపారాన్ని విస్తరించడాన్ని ప్రారంభించాయి. వాటిని ప్రారంభించిన కొద్ది కాలంలోనే, ఈ కంపెనీలు వరుసగా రూ. 3,000 కోట్లు, రూ. 600 కోట్ల దేశీయ కాంట్రాక్టులను, ఎగుమతి ఆర్డర్లను సాధించాయి. వీటిలో ఎంఐఎల్ రూ. 500 కోట్ల విలువైన అతి భారీ ఆయుధ ఎగుమతి ఆర్డర్‌ను సంపాదించింది. ఈ కంపెనీలు సంస్థాగతంగా, సమన్వయ కృషి ద్వారా నూతన ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. భారతీ రైల్వేల నుంచి ఆక్సెల్స్ (ఇరుసులు) కోసం రూ. 251 కోట్ల విలువైన ఆర్డర్‌ను వైఐఎల్ సంపాదించింది.
తమ వనరులను అభిలషణీయంగా వినియోగించేందుకు, ఖర్చు తగ్గింపు దిశగా ఈ నూతన సంస్థలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఓవర్ టైం, ఉత్పత్తికి పనికిరాని కార్యకలాపాలు వంటి ప్రాంతాలలో ఖర్చు తగ్గించడంపై దృస్టి పెట్టిన ఈ కంపెనీలు తొలి ఆరునెలల కాలంలోనే దాదాపు 9.68% సంచిత పొదుపును సాధించాయి.
ఈ నూతన కంపెనీల పనితీరు విషయంలో అవసరమైతే సకాలంలో జోక్యం చేసుకునేందుకు క్రమ పద్ధతిలో శాఖ పర్యవేక్షిస్తోంది. తద్వారా ఓఎఫ్‌బి కార్పొరేటీకరణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వం 16 జూన్, 2021న రక్షణ రంగ ఉత్పత్తి వ్యవస్థలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భారీ సంస్కరణ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును మార్చాలన్న ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది.. రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉప కార్యాలయంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును వృత్తిపరమైన నిర్వహణతో ఏడు ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేట్‌సంస్థలుగా మార్చాలన్న నిర్ణయం తీసుకుంది.
(Release ID: 1821492)
Visitor Counter : 210