శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డిఎస్ఆర్ఐ) కి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్ )లో మానవ వనరులు, చరాస్తులు మరియు బాధ్యతలతో పాటు కన్సల్టెన్సీ డెవలప్‌మెంట్ సెంటర్ (సిడిసి)ని విలీనం చేసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
Posted On:
27 APR 2022 4:49PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఈ కింది ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది:-
(i ) సిఎస్ఐఆర్ లో పదమూడు (13) సూపర్‌న్యూమరీ పోస్టులను సృష్టించి ప్రస్తుతం సిడిసి లో పనిచేస్తున్న ఉన్న 13 మంది ఉద్యోగులను వాటిలో నియమించడం
(ii) న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో సిడిసి పనిచేస్తున్నప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి కేటాయింపు కోసం ఇండియా హాబిటాట్ సెంటర్‌కు అందజేస్తారు. తిరిగి కేటాయించడం ద్వారా వచ్చే ఆదాయం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లో జమ చేయబడుతుంది.
(iii) విలీనం తర్వాత సిడిసి చరాస్తులు మరియు అప్పులు సిఎస్ఐఆర్ కి బదిలీ చేయబడతాయి.
ప్రధాన ప్రభావం :
రెండు సంస్థలను విలీనం చేయడం వల్ల విభాగం మెరుగు పడడమే కాకుండా కనీస ప్రభుత్వం గరిష్ట పాలన అన్న ప్రధాన మంత్రి లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశం కలుగుతుంది. విద్య, సాంకేతిక పరిజ్జానం ఎగుమతి తదితర రంగాల్లో సిడిసి సిబ్బంది కలిగివున్న అనుభవంతో సిఎస్ఐఆర్ ప్రయోజనం పొందుతుంది. సిఎస్ఐఆర్ అందిస్తున్న కింది సేవలకు విలువ ఆధారిత ప్రయోజనం కలుగుతుంది.
(i) ప్రాజెక్ట్‌ల సాంకేతిక-వాణిజ్య అంచనాలు
(ii) సామాజిక-ఆర్థిక రంగంలో అమలవుతున్న సిఎస్ఐఆర్ సాంకేతిక అంశాల ప్రభావ విశ్లేషణ
(iii) సిఎస్ఐఆర్ సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ప్రోటోటైప్‌ల అభివృద్ధికి అవసరమైన వివరణాత్మక డిజైన్ మరియు ఇంజనీరింగ్ కోసం తగిన కన్సల్టెంట్‌ల ఎంపిక మరియు వాటాదారుల అవసరాలు మరియు/లేదా మార్కెట్ సంసిద్ధత కోసం సిఎస్ఐఆర్ సాంకేతిక పరిజ్జానం అమలు.
(iv) వ్యాపార అభివృద్ధి కార్యకలాపాలు.
నేపథ్యం:
కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలో సిఎస్ఐఆర్, సిడిసి సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేస్తున్నాయి. 1942లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ XXI 1860 ప్రకారం భారతదేశ ఆర్థిక వృద్ధి మరియు మానవ సంక్షేమం కోసం శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన కోసం జాతీయ పరిశోధన, అభివృద్ధి సంస్థగా సిఎస్ఐఆర్ స్థాపించబడింది.
దేశంలో కన్సల్టెన్సీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం మరియు ప్రోత్సహించడం కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్సహకారంతో ఒక సొసైటీగా 1986లో సిడిసి స్థాపించబడింది. 13 అక్టోబర్ 2004న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సిడిసిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద స్వయంప్రతిపత్త సంస్థగా సిడిసి ని గుర్తిస్తూ తీర్మానం ఆమోదించింది. సిడిసి ని స్వతంత్ర ప్రతిపత్తి ని ఆమోదిస్తూ 16 జనవరి, 2008న మెమోరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ విడుదల అయ్యాయి. న్యూఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్ లో సిడిసి 1000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల భవనంలో పని చేస్తున్నది. 08.03.1990న గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ స్థలాన్ని సిడిసికి లీజుకు కేటాయించింది. సిడిసిలో మొత్తం 13 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా నీతి ఆయోగ్ వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థల పనితీరుపై సమీక్షలు నిర్వహించింది. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పనిచేస్తున్న సిఎస్ఐఆర్ మరియు సిడిసి పనితీరును నీతి ఆయోగ్ 10వ, 13వ మరియు 18వ సమావేశాలలో సమీక్షించారు. సిఎస్ఐఆర్ లో సిడిసిని విలీనం చేయాలని సమీక్ష కమిటీ సిఫార్సు చేసింది. విలీనం తర్వాత కూడా సిడిసి పని చేయవచ్చునని నివేదిక పేర్కొంది. దీని వల్ల సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం డిఎస్ఆర్ఐ కేవలం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ను మాత్రమే కలిగి ఉంటుందని ఉంటుందని కమిటీ తన నివేదికలో పేర్కొంది.విలీన విధానాలను సిఫార్సు చేయడానికి ఏర్పాటైన సలహా కమిటీ సిఫార్సుల ఆధారంగా
సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం అవసరమైన ప్రక్రియలను సిడిసి, సిఎస్ఐఆర్ మండళ్లు ఆమోదించి రెండు సంస్థల విలీన ప్రతిపాదనకు ఆమోదించాయి.
***
(Release ID: 1820838)
Visitor Counter : 171