ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 28వ తేదీన అస్సాంలో పర్యటించనున్న - ప్రధానమంత్రి


దిఫు వద్ద 'శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీ' లో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి

కర్బీ అంగ్లాంగ్‌ లో 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన విద్యా రంగ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న - ప్రధానమంత్రి

అస్సాం అంతటా ఏడు క్యాన్సర్ ఆసుపత్రులను జాతికి అంకితం చేసి, మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేయనున్న - ప్రధానమంత్రి

అస్సాంలో దాదాపు 1150 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న 2,950 కంటే ఎక్కువ అమృత్ సరోవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న - ప్రధాన మంత్రి

Posted On: 26 APR 2022 6:52PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, 2022 ఏప్రిల్, 28వ తేదీన అస్సాంలో పర్యటించనున్నారు.  ఉదయం 11:00 గంటలకు కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డిఫు వద్ద 'శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీ' లో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.  ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.  ఆ తర్వాత, మధ్యాహ్నం ఒంటిగంటా 45 నిముషాలకు, ప్రధాన మంత్రి దిబ్రూగఢ్ లోని అస్సాం మెడికల్ కాలేజీ చేరుకుని, దిబ్రూగఢ్ క్యాన్సర్ ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తారు.  అనంతరం,  మధ్యాహ్నం 3 గంటలకు డిబ్రూఘర్‌ లోని ఖనికర్ మైదానంలో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు.  అక్కడ, ఆయన, ఆరు క్యాన్సర్ ఆసుపత్రులను దేశానికి అంకితం చేయడంతో పాటు, మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తారు. 

దిఫు, కర్బీ అంగ్లాంగ్ వద్ద ప్రధానమంత్రి 

భారత ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం ఆరు కర్బీ మిలిటెంట్ సంస్థలతో ఇటీవలి అవగాహన ఒప్పందం (ఎం.ఓ.ఎస్) పై సంతకం చేయడంతో ఈ ప్రాంతం యొక్క శాంతి, అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి తిరుగులేని నిబద్ధత ఉదహరించబడింది.  ఈ అవగాహన ఒప్పందం ఈ ప్రాంతంలో శాంతి యుగానికి నాంది పలికింది.  ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీ’ లో ప్రధానమంత్రి ప్రసంగం మొత్తం ప్రాంతంలో శాంతి కార్యక్రమాలకు పెద్ద ఊపును అందిస్తుంది.

పశువైద్య కళాశాల (డిఫు), డిగ్రీ కళాశాల (పశ్చిమ కర్బీ అంగ్లాంగ్), వ్యవసాయ కళాశాల (కొలోంగా, పశ్చిమ కర్బీ అంగ్లాంగ్) లకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.  500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో నైపుణ్యం, ఉపాధికి కొత్త అవకాశాలను తెస్తాయి.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి 2,950 కి పైగా అమృత్ స‌రోవ‌ర్ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తారు.  దాదాపు 1,150 కోట్ల రూపాయలతో ఈ అమృత్ సరోవర్లను రాష్ట్రం అభివృద్ధి చేయనుంది.

దిబ్రూఘర్ వద్ద ప్రధానమంత్రి 

అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్ట్‌ ల సంయుక్త ఆధ్వర్యంలో, రాష్ట్రవ్యాప్తంగా 17 క్యాన్సర్ కేర్ ఆసుపత్రులతో దక్షిణాసియాలో అతిపెద్ద సరసమైన క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్‌ ను నిర్మించే ప్రాజెక్ట్‌ ను అస్సాం క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ అమలు చేస్తోంది.  ఈ ప్రాజెక్టు మొదటి దశ కింద చేపట్టిన 10 ఆసుపత్రులలో, ఏడు ఆసుపత్రుల నిర్మాణం పూర్తికాగా, మూడు ఆసుపత్రుల నిర్మాణం వివిధ స్థాయిలలో ఉంది.  ఈ ప్రాజెక్టు రెండవ దశ కింద మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నారు. 

ప్రాజెక్టు 1వ దశ కింద పూర్తి చేసిన ఏడు క్యాన్సర్ ఆసుపత్రులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.  ప్రాజెక్టు 1వ దశ కింద పూర్తి చేసిన ఏడు క్యాన్సర్ ఆసుపత్రులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.  ధుబ్రి, నల్బరీ, గోల్‌ పరా, నాగావ్, శివసాగర్, టిన్‌సుకియా మరియు గోలాఘాట్‌లలో ప్రాజెక్టు 2వ దశ కింద నిర్మించనున్న ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

 

 


(Release ID: 1820330) Visitor Counter : 155