యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
డెఫ్లింపిక్స్ 2021 కోసం 65 మంది అథ్లెట్ల భారత టీమ్ బృందానికి వీడ్కోలు అందించిన శ్రీ అనురాగ్ ఠాకూర్
ఒలింపిక్స్, పారాలింపిక్స్ లేదా డెఫ్లింపిక్స్ వంటి క్రీడల్లో భారత్ అతిపెద్ద క్రీడా శక్తిగా అవతరిస్తుంది: అనురాగ్ ఠాకూర్
Posted On:
25 APR 2022 6:00PM by PIB Hyderabad
మే 1 నుంచి డెఫ్లింపిక్స్ ఆటలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత డెఫ్లింపిక్స్ 2021 బృందానికి సోమవారం ఘనమైన వీడ్కోలు లభించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రామాణిక్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బ్రెజిల్‌లోని కాక్సియాస్ డు సుల్‌లో జరిగే ఈ ఆటల పోటీలకు మొత్తం 65 మంది భారత అథ్లెట్లు పాల్గొంటారు. డెఫ్లింపిక్స్‌లో దేశం నుంచి ఇప్పటివరకు పాల్గొన్న పోటీల్లో అతిపెద్ద, అతి పిన్న వయస్కుల బృందంగా నిలిచింది. దేశ క్రీడాకారులు మొత్తం 11 క్రీడా విభాగాల్లో పాల్గొంటారు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, జూడో, గోల్ఫ్, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో మరియు రెజ్లింగ్‌లలో తమ ప్రతిభను చూపనున్నారు. ఈ ఆటల పోటీలు మే 1 నుండి మే 15 వరకు జరుగనున్నాయి.
భారత డెఫ్లింపిక్స్ బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ అనురాగ్ ఠాకూర్, “దేశంలోని ప్రతి ఒక్కరి తరపున, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, మీరు ఇప్పటికే ఎంపిక కావడం ద్వారా మీ సత్తాను చాటుకున్నారు' అని తెలిపారు. దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద జట్టు కాబట్టి అత్యధిక పతకాలు కూడా సాధిస్తారని అనుటుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ లేదా డెఫ్లింపిక్స్ ఏదైనా భారత్ తదుపరి పెద్ద క్రీడా శక్తిగా మారుతుంది. ఈ శతాబ్దం మనది, అన్ని క్రీడా రంగాల్లో భారత పతాకాన్ని రెపరెపలాడిస్తాం అని మంత్రి పేర్కొన్నారు.
ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ది డెఫ్ (ఏఐఎస్‌సీడీ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అథ్లెట్లకు అందిస్తున్న అపారమైన మద్దతు గురించి కేంద్రమంత్రి ప్రస్థావించారు. “ఏఐఎస్‌సీడీ, ఎస్ఏఐ రెండూ అథ్లెట్లకు చాలా మద్దతునిచ్చాయి. డెఫ్లింపిక్స్-బౌండ్ అథ్లెట్ల కోసం ఎస్ఏఐ కేంద్రాలలో 30-రోజుల జాతీయ కోచింగ్ క్యాంప్ సదుపాయం చేయబడింది. అంతే కాకుండా, అథ్లెట్లకు కిట్‌లు, డెఫ్లింపిక్స్‌కు సెరిమోనియల్ దుస్తులు ఇవ్వడంతో పాటు వారి వసతి, బస, బోర్డింగ్, రవాణా ఏర్పాట్లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది.
యువ భారత్‌కు ఈ బృందం అందిస్తున్న స్ఫూర్తి గురించి సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రమాణిక్ ప్రసంగించారు. “గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ దృష్టికి అనుగుణంగా దేశ క్రీడా వ్యవస్థ అభివృద్ధి చెందడాన్ని మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి పిలుపు ‘చీర్ ఫర్ ఇండియా’ ఒక గేమ్ ఛేంజర్‌గా మిగిలిపోయింది. అది ఒలింపిక్స్, పారాలింపిక్స్ లేదా డెఫ్లింపిక్స్ అయినా, భారతదేశం క్రీడలలో అత్యంత కీర్తిని పొందేందుకు సిద్ధంగా ఉంది."
శ్రీ నిశిత్ ప్రమాణిక్ బ్రెజిల్ డెఫ్లింపిక్స్ గురించి ప్రస్తావిస్తూ, “ఈసారి డెఫ్లింపిక్స్‌లో దేశం తరఫున అతిపెద్ద బృందం పాల్గొంటోంది. మీరు ఇప్పటికే యువ భారత్‌కు గొప్ప ప్రేరణగా నిలిచారు. అడ్డంకులను అధిగమించిన విధానం గమనించదగినది. బ్రెజిల్‌కు వెళ్లకముందే మీరు గెలవాలనే మీ అభిరుచి మరియు శక్తి అభినందనీయం”
2017లో టర్కీలో జరిగిన చివరి డెఫ్లింపిక్స్‌లో భారత్ 1 స్వర్ణం, 1 రజతం మరియు 3 కాంస్య పతకాలతో సహా మొత్తం 5 పతకాలను కైవసం చేసుకుంది. ఇందులో భారత్ 46 మంది ప్రతినిధుల బృందాన్ని పంపింది.
భారత బృందానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
*******
(Release ID: 1820311)
Visitor Counter : 114