వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రేపు 'కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్


అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక రోజు కిసాన్ మేళా నిర్వహణ

Posted On: 25 APR 2022 4:31PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వివిధ ప్రభుత్వ పథకాల్లో రైతులను భాగస్వాములను చేసేందుకు అమలు చేయనున్న కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన   'కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీప్రచార కార్యక్రమాన్ని రేపు (26.04.2022) కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ ప్రారంభిస్తారు. . 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేడుకల్లో భాగంగా   కిసాన్ భగీదారీ ప్రథమిక హమారీ ప్రచార కార్యక్రమాన్ని 2022 ఏప్రిల్  25 నుంచి  30 వరకు నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం   ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ఇతర అనుబంధ మంత్రిత్వ శాఖలు, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖగ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సహకార మంత్రిత్వ శాఖ సహకారం తో అనేక  పథకాలు మరియు కార్యక్రమాలను అమలు చేస్తోంది. పథకాలు, కార్యక్రమాలపై  దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు అవగాహన , ప్రచారం కల్పించడానికి ఇతర మంత్రిత్వ శాఖలతో కలిసి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచార కార్యక్రమాలను  నిర్వహిస్తుంది. 

కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ' ప్రచారంలో భాగంగా 26.04.2022న, అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ  సహకారంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలలో  ఒక రోజు పాటు కిసాన్ మేళా నిర్వహించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది.  రోజంతా జరిగే కిసాన్ మేళాలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న  పథకాలకు సంబంధించిన సమాచారం రైతులకు అందజేయడం జరుగుతుంది.  ప్రగతిశీల మరియు వినూత్న విధానాలతో వ్యవసాయం చేస్తున్న రైతులను సన్మానిస్తారు.  చిన్న మరియు మధ్య తరహా  రైతులు, మహిళా రైతులు మరియు సహజ వ్యవసాయం పై అవగాహన కల్పించేందుకు ప్రదర్శనలు ఏర్పాటు చేసి  రైతులు-శాస్త్రవేత్త ల మధ్య చర్చ కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలను కిసాన్ మేళా లో నిర్వహిస్తారు.  సమగ్ర పోషక విధానాలు, పంటల విభజన, ఆర్ కె వి వై వ్యవసాయ ఉత్పత్తుల  మార్కెటింగ్,ఉద్యానవనాలు పెంపకం లాంటి అంశాలపై వ్యవసాయరైతు సంక్షేమ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న  నేషనల్ హార్టికల్చర్ మిషన్ వంటి  వివిధ విభాగాలు 26.04.2022న ప్రచారంలో కార్యక్రమాలను నిర్వహిస్తాయి. 

వారం రోజుల పాటు జరిగే  ప్రచార కార్యక్రమంలో దేశవ్యాప్తంగా  పంట బీమాపై ఉమ్మడి సేవా కేంద్రం నిర్వహించే  వర్క్‌షాప్‌ను కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రారంభిస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ లో భాగంగా పర్యావరణ మరియు పశువుల విధానాలపై  గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తో కలిసి వ్యవసాయ మంత్రిత్వ శాఖ సదస్సు నిర్వహిస్తుంది. ప్రచార వారోత్సవాల్లో భాగంగా  ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడీఓపీ)పై  వాణిజ్య మంత్రిత్వ శాఖ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు  వెబ్‌నార్ నిర్వహిస్తాయి.  ఎంపిక చేసిన 75 మంది రైతులు మరియు పారిశ్రామికవేత్తలతో జాతీయ ఆత్మ నిర్భర్ భారత్ సదస్సు కూడా నిర్వహించబడుతుంది.

దేశవ్యాప్తంగా ప్రత్యక్ష, పరోక్ష విధానాల్లో  రైతులు, సంబంధిత వర్గాలకు చెందిన కోటి మందికి పైగా ఈ   కార్యక్రమంలో  పాల్గొంటారని భావిస్తున్నారు.

 

***



(Release ID: 1820304) Visitor Counter : 240