సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బారాముల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం కింద అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష




ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం కింద సాధించిన విజయాలకు జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించిన మంత్రి

Posted On: 25 APR 2022 5:43PM by PIB Hyderabad

 

వివిధ అభివృద్ధి పారామితులను ప్రత్యక్షంగా అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా, శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర), భూ శాస్త్ర సహాయ (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం(స్వతంత్ర), ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి,అంతరిక్ష శాఖల మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈ రోజు జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలోని డాక్ బంగ్లా లో ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు, ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం (ఎడిపి) కింద జరుగుతున్న పనుల పురోగతి గురించి సమీక్షించారు.

 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన పౌరుల జీవన ప్ర మాణాలను మెరుగు పరచడానికి, అందరికీ సమ్మిళిత వృద్ధిని కల్పించడానికి కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా భాగస్వామ్యులయ్యేలా  ప్రజల సామర్థ్యాన్ని మెరుగుపరచడం పై ఏడీపీ నిశితంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/DJS-1PYBC.jpeg

 

పీఎం ఫసల్ బీమా యోజన, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ప్రతి పంచాయతీలో భారత్ నెట్ సదుపాయం, ఆర్థిక సమ్మేళనం వంటి అంశాలు ఏడీపీ కింద ప్రస్తావించాల్సిన అంశాలు అని మంత్రి తెలిపారు.

కార్యక్రమం యొక్క మెకానిజం గురించి చర్చించిన డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, జిల్లాలు మొదట తమ రాష్ట్రంలోనే అత్యుత్తమ జిల్లాగా నిలిచేలా ప్రోత్సహిస్తున్నామని, తదనంతరం ఇతరులతో పోటీపడి, నేర్చుకుంటూ దేశంలోని ఉత్తమ జిల్లాలలో ఒకటిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఎడిపి కింద బారాముల్లాలో చేసిన కృషిని ప్రశంసిస్తూ, ఆకాంక్షాత్మక జిల్లా ద్వారా పని సంస్కృతి, సామాజిక సంస్కృతి మరియు ప్రవర్తనా సంస్కృతి యొక్క వివిధ స్థాయిలలో ప్రామాణిక నిర్దేశిత బెంచ్ మార్క్ ను సాధించడానికి సహకారం ఉందని ఆయన అన్నారు. నమూనా యొక్క ఉపయోగాన్ని ఆయన ప్రశంసించారు మరియు ఇది డైనమిక్ రియల్ టైమ్ మదింపు యొక్క పరిధిని కలిగి ఉన్న శాస్త్రీయ విధానంపై ఆధారపడి ఉందని తెలిపారు.

బారాముల్లాను సుస్థిర అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధిలో దాని సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎప్పటికప్పుడు సరైన అనుసరణీయతతో ఉందని ఆయన అన్నారు. జిల్లాలోని జీవవైవిధ్యాన్ని ప్రశంసిస్తూ ఆయన మాట్లాడుతూ, భారీ అటవీ నిల్వలు కలిగిన జమ్మూ కాశ్మీర్ లోని పురాతన జిల్లాలలో బారాముల్లా ఒకటని అన్నారు. సమర్థవంతమైన ఖర్చు మరియు సమయ నిర్వ హణ కోసం సాంకేతిక ఆవిష్కరణల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ ప్రాంతంలో బయోటెక్నాలజీ కార్యక్రమాలను నిర్వహించాలన్న తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/DJS-2DXL0.jpg

 

భారతదేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాలలో ఒకటిగా బారాముల్లాను రూపొందించడానికి దోహదపడిన వివిధ పారామితులను సమగ్రంగా సమీక్షించిన తర్వాత, ఏడీపీ కింద సాధించిన విజయాలలో జిల్లా పరిపాలన పాత్రను డాక్టర్ సింగ్ ప్రశంసించారు. కార్యక్రమ ర్యాంకుల్లో అగ్రగామిగా నిలిచేందుకు సంబంధిత అధికారులు అత్యంత అంకితభావంతో పని చేయాలని ఆదేశించారు.

ఇంతలో, మొత్తం పురోగతికి ఆటంకం కలిగించే వివిధ సమస్యలు సమావేశంలో కూలంకషంగా చర్చించబడ్డాయి, సకాలంలో వాటి పరిష్కారం కోసం పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బారాముల్లా, జిల్లా అధికార యంత్రాంగం ఇతర అధికారులు పాల్గొన్నారు.

చొరవ యొక్క గ్రౌండ్ లెవల్ మదింపు యొక్క అధికారిక మదింపు కోసం వివిధ ఆకాంక్షలు ఉన్న జిల్లాలను సందర్శించాలని కేంద్రం కేంద్ర మంత్రులను ఆదేశించడం గమనించదగ్గ విషయం. జనవరి 2018లో ప్రధానమంత్రి ప్రారంభించిన ఏడీపీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందని జిల్లాలను త్వరగా మరియు సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమం యొక్క విస్తృత రూపురేఖలు నెలవారీ డెల్టా ర్యాంకింగ్ ద్వారా జిల్లాల మధ్య కన్వర్జెన్స్, సహకారం మరియు పోటీని కలిగి ఉంటాయి, అన్నీ ప్రజా ఉద్యమం ద్వారా నడపబడతాయి.

ప్రతి జిల్లా పరిధిలోని బ్లాక్-లెవల్‌లో పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడం కార్యక్రమం యొక్క మరొక దృష్టి. జిల్లా మొత్తం అభివృద్ధికి దారితీసే బ్లాకుల పురోగతిని పర్యవేక్షించడానికి జిల్లాలను ప్రోత్సహించారు. ఏడీపీ తప్పనిసరిగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించడం, దేశ ప్రగతికి దారితీయడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

 

*****

 


(Release ID: 1820010) Visitor Counter : 185


Read this release in: English , Urdu , Hindi , Punjabi