ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
187.71 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం
12-14 ఏళ్ల వారికి 2.66 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,522
గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,541
ప్రస్తుత రికవరీ రేటు 98.75%
వారపు పాజిటివిటీ రేటు 0.54%
Posted On:
25 APR 2022 9:35AM by PIB Hyderabad
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం 187.71 కోట్ల ( 1,87,71,95,781 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,30,40,984 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
12-14 ఏళ్ల వారికి కొవిడ్-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.66 కోట్లకు పైగా ( 2,66,55,947 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 4,17,414 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
మొత్తం టీకా డోసులు
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
10404769
|
రెండో డోసు
|
10012236
|
ముందు జాగ్రత్త డోసు
|
4698351
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
18415022
|
రెండో డోసు
|
17532487
|
ముందు జాగ్రత్త డోసు
|
7361461
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
26655947
|
రెండో డోసు
|
2983166
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
58151729
|
రెండో డోసు
|
41393756
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
555492517
|
రెండో డోసు
|
475580091
|
ముందు జాగ్రత్త డోసు
|
92265
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
202884711
|
రెండో డోసు
|
187395613
|
ముందు జాగ్రత్త డోసు
|
325149
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
126839711
|
రెండో డోసు
|
116740697
|
ముందు జాగ్రత్త డోసు
|
14236103
|
ముందు జాగ్రత్త డోసులు
|
2,67,13,329
|
మొత్తం డోసులు
|
1,87,71,95,781
|
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,522. మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 0.04 శాతం.
భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,862 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,21,341 కి పెరిగింది.
గత 24 గంటల్లో 2,541 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో మొత్తం 3,02,115 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.50 కోట్లకు పైగా ( 83,50,19,817 ) పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 0.54 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతంగా నమోదయ్యాయి.
****
(Release ID: 1819748)
Visitor Counter : 149