వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 2022 ఏప్రిల్ 25 నుండి ఏప్రిల్ 30 వరకు ‘కిసాన్ భాగిదారి, ప్రాథమికత హమారీ’ నిర్వహించనున్నారు.


ఉమ్మడి సేవా కేంద్రం (సిఎస్సి) దేశవ్యాప్తంగా పంటల బీమాపై నిర్వహించే వర్క్‌షాప్‌ను ప్రారంభించనున్న కేంద్ర వ్యవసాయ మంత్రి

ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి మేళా, సహజ వ్యవసాయంపై నిర్వహించనున్న ఫీల్డ్ ఎగ్జిబిషన్

ఎంపిక చేసిన 75 మంది రైతులు, పారిశ్రామికవేత్తలతో జాతీయ స్థాయిలో ఆత్మ నిర్భర్ భారత్ కాన్క్లేవ్

కోటి మందికి పైగా రైతులు, వాటాదారులు ప్రచారంలో పాల్గొంటారని అంచనా

Posted On: 24 APR 2022 3:25PM by PIB Hyderabad

వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ ఇతర మంత్రిత్వ శాఖల సహకారంతో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద 2022 ఏప్రిల్ 25 నుండి 30 వరకు 'కిసాన్ భాగిదారీ, ప్రాథమికత హమారీ' ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రచారం సందర్భంగా, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ రైతుల కోసం ప్రాంతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి మేళాను, సహజ వ్యవసాయంపై క్షేత్ర ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఉమ్మడి సేవా కేంద్రం (సిఎస్సి) నిర్వహించే పంటల బీమాపై దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రారంభించనున్నారు. 

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు డిఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద వ్యవసాయ పర్యావరణ, పశువుల పద్ధతులపై ఒక ప్రసంగం ఉంటుంది. వారంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడిఓపి)పై వెబ్‌నార్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన 75 మంది రైతులు, పారిశ్రామికవేత్తలతో జాతీయ ఆత్మ నిర్భర్ భారత్ కాన్క్లేవ్ కూడా నిర్వహిస్తున్నారు. 

ఈ వారం రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఆధారిత వర్క్‌షాప్, వెబ్‌నార్, శాఖల వివిధ పథకాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

దేశవ్యాప్తంగా ప్రత్యక్ష (ఆఫ్‌లైన్), వర్చువల్ (ఆన్‌లైన్) మాధ్యమం ద్వారా 1 కోటి కంటే ఎక్కువ మంది రైతులు, వాటాదారులు ఈ ప్రచారంలో పాల్గొంటారని భావిస్తున్నారు.

భారత స్వాతంత్య్రం  పొందిన 75 సంవత్సరాలలో వ్యవసాయ అభివృద్ధి ఈ క్రింది మైలురాళ్ళు ఈ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తారు:

హరిత విప్లవం: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి;

· ఉద్యాన పంటల అతిపెద్ద ఉత్పత్తిదారు - అల్లం, అరటి, మామిడి & బొప్పాయి;

· పసుపు విప్లవం (ఆపరేషన్ గోల్డెన్ ఫ్లో);

· తీపి విప్లవం: తేనె ఉత్పత్తి;

· పంట నీటిపారుదలలో మెరుగుదల;

· వ్యవసాయంలో ఐసిటి ఉపయోగం;

· వ్యవసాయంలో రిమోట్ సెన్సింగ్/జిఐఎస్/డ్రోన్స్ అప్లికేషన్;

· వ్యవసాయంలో బయో-టెక్నాలజీ అప్లికేషన్;

· వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమం విజయం;

· విత్తనాలు మరియు ఎరువులలో స్వయం సమృద్ధి;

· వ్యవసాయ యాంత్రీకరణలో పురోగతి;

నేల ఆరోగ్య నిర్వహణ (ఐఎన్ఎం)

· తెగుళ్ల ప్రభావవంతమైన నిర్వహణ (ఐపిఎం);

కిసాన్ భాగిదారీ, ప్రాథమికత హమారీ ప్రచారం కేంద్ర ప్రభుత్వ  వివిధ ప్రధాన పథకాల క్రింద కార్యకలాపాలు, విజయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తుంది, అవి:

· ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి;

· ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన;

· ప్రధాన్ మంత్రి కృషి సంచయ యోజన 

· ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన;

· కిసాన్ క్రెడిట్ కార్డ్;

· వ్యవసాయ క్రెడిట్;

· ఇ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్);

· రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పిఓలు);

· సాయిల్ హెల్త్ కార్డ్;

· సేంద్రీయ, సహజ వ్యవసాయం;

· మొక్కల రక్షణ, మొక్కల క్వారంటైన్ ;

· తేనెటీగల పెంపకం;

· వ్యవసాయ యాంత్రీకరణ;

· జాతీయ ఆహార భద్రతా మిషన్;

· సీడ్,  నాటడం;

· హార్టికల్చర్ సమగ్ర అభివృద్ధిపై మిషన్;

· విస్తరణ సంస్కరణలు (ఆత్మ);

ఆర్కేవివై-రాఫ్టర్ - అగ్రి స్టార్టప్‌లు;

 

 

*****


(Release ID: 1819666) Visitor Counter : 219