ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 22న జరిగిన ఆయుష్మాన్ భారత్ క్షేత్రస్థాయి ఆరోగ్య మేళాల్లో 4 లక్షల 53 వేల మందికి పైగా పాల్గొన్నారు; 496 బ్లాక్‌లు దేశవ్యాప్తంగా ఐదవ రోజు ఆరోగ్య మేళాలను నిర్వహించాయి
59,000 కంటే ఎక్కువ ఏబీహెచ్ఏ హెల్త్ ఐడీలు సృష్టించబడ్డాయి; 17,000 పిఎంజేఏవై గోల్డెన్ కార్డ్‌లు జారీ చేయబడ్డాయి, 28,000 టెలికన్సల్టేషన్‌లు మరియు 12000 క్షయవ్యాధి పరీక్షలు జరిగాయి
Posted On:
23 APR 2022 12:33PM by PIB Hyderabad
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ (ఏబీ-హెచ్‌డబ్ల్యూస్‌లు) 4వ వార్షికోత్సవాన్ని 16 ఏప్రిల్ నుండి 22 ఏప్రిల్ 2022 వరకు జరుపుకుంది. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కేంద్ర ఆరోగ్య మంత్రి, రాష్ట్రాలు/యూటీల ఆరోగ్య మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీలు/ రాష్ట్రాలు/యూటీల ఆరోగ్య కార్యదర్శులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, ప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు కూడా వీటిని సందర్శించారు. మరియు ఏబీ-హెచ్‌డబ్ల్యూస్‌లు మరియు అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఏబీ-హెచ్‌డబ్ల్యూస్‌ల ప్రాముఖ్యత పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
ఏప్రిల్ 18 నుండి 22, 2022 వరకూ రాష్ట్రం/యుటిలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక బ్లాక్‌లో లక్ష కంటే ఎక్కువ బీ-హెచ్‌డబ్ల్యూసిల వద్ద బ్లాక్ స్థాయి ఆరోగ్య మేళాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. ప్రతి బ్లాక్ స్థాయి ఆరోగ్య మేళా ఒక రోజు పాటు ఉంటుంది మరియు రాష్ట్రం/యూటీలోని ప్రతి బ్లాక్ కవర్ చేయబడుతుంది.
ఆరోగ్య మేళాలో ఐదవ రోజు 4 లక్షల 53 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు మరియు దేశవ్యాప్తంగా 496 బ్లాక్‌లు ఆరోగ్య మేళాలను నిర్వహించాయి. ఇంకా, 59,000 కంటే ఎక్కువ ఏబీహెచ్ఏ హెల్త్ ఐడీలు సృష్టించబడ్డాయి మరియు 17,000 పిఎంజేఏవై గోల్డెన్ కార్డ్‌లు జారీ చేయబడ్డాయి. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం, క్షయవ్యాధి మొదలైన వాటి కోసం వేలాది స్క్రీనింగ్‌లు చేయబడ్డాయి.
16 ఏప్రిల్ 2022న ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లలో (ఏబీ-హెచ్‌డబ్ల్యూసీలు) ఈ-సంజీవని ప్లాట్‌ఫారమ్ ద్వారా ఒక రోజులో 3 లక్షల టెలికన్సల్టేషన్‌లు జరిగాయి. ఏబీ-హెచ్‌డబ్ల్యూసీలలో ఒకే రోజు జరిగిన అత్యధిక టెలికన్సల్టేషన్‌లు ఇవే. గత రికార్డు అయిన రోజుకు 1.8 లక్షల టెలికన్సల్టేషన్‌లను ఇది అధిగమించింది. 22 ఏప్రిల్ 2022న దేశవ్యాప్తంగా 28,000 కంటే ఎక్కువ టెలికన్సల్టేషన్‌లు జరిగాయి.
22.04.2022 నాటికి రాష్ట్రాల వారీగా బ్లాక్ హెల్త్ మేళా నివేదిక క్రింది విధంగా ఉంది:
****
(Release ID: 1819336)
Visitor Counter : 131