భారత ఎన్నికల సంఘం

విదేశాల్లో వోటర్లుగా నమోదు చేసుకోండి


ప్రవాస భారతీయులకు
ఎన్నికల ప్రధాన కమిషనర్ విజ్ఞప్తి...

వారికి ఇ.టి.పి.బి.ఎస్. సదుపాయం
కల్పించే అంశం పరిశీలిస్తున్నామన్న సుశీల్ చంద్ర..

దక్షిణాఫ్రికా, మారిషస్ దేశాల్లో
ఇ.సి.ఐ. ప్రతినిధివర్గం పర్యటన

Posted On: 22 APR 2022 1:04PM by PIB Hyderabad

  ఎన్నికల ప్రధాన కమిషనర్ (సి.ఇ.సి.) సుశీల్ చంద్ర నాయకత్వంలోని ఎన్నికల కమిషన్ ప్రతినిధి బృందం దక్షిణాఫ్రికా, మారిషస్ దేశాల్లో పర్యటించారు. 2022, ఏప్రిల్ 9వ తేదీనుంచి 19వరకు వారీ పర్యటన జరిపారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, మారిషస్ దేశాల ఎన్నికల కమిషన్ల ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. అలాగే, ఉభయదేశాల్లోని ప్రవాస భారతీయులతోనూ వారు ముచ్చటించారు. భారత ఎన్నికల సంఘం అవగాహనా ఒప్పందంలో రెండు దేశాల ఎన్నికల సంఘాలకు భాగస్వామ్యం ఉంది. తన పర్యటన సందర్భంగా భారతీయ సంతతి ప్రతినిధులతో ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ, భారతీయ సంతతి వారంతా,  విదేశాల్లో వోటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే ప్రస్తుతం విదేశాల్లో ప్రవాస వోటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. విదేశాల్లోని వోటర్లకోసం ఎలెక్ట్రానికల్లీ ట్రాన్సిమిటెడ్ పోస్టల్ బ్యాలట్ సిస్టమ్ (ఇ.టి.పి.బి.ఎస్.) సదుపాయాన్ని కల్పించే అంశం ప్రస్తుతం తమ పరిశీలనలో ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

https://ci3.googleusercontent.com/proxy/XVTIRvXjuI0WL1mpt_tist01Z0ZFN6_FHOfTtL0-lrVi73LJ7vSDo_5cHqjZfR7-WCEa3RWyfSF00okvbc4b669HiEmbpCeklriMTXbAg1lG_75Jgjeyxzp7IA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0019VTS.jpg

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సి.ఇ.సి.) సుశీల్ చంద్ర 2022 ఏప్రిల్ 12న దక్షిణాఫ్రికా

ఎన్నికల కమిషన్ చైర్ పర్సన్ గ్లెన్ వి. మాషినినీతో, ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం (ఎ-వెబ్) 

ప్రధాన కార్యదర్శి జోగ్యూన్ చోయీతో సమావేశమైనప్పటి చిత్రం

https://ci5.googleusercontent.com/proxy/raQwAilcjaveZfXMj5KxzIJ2-NcgIBdWv6ljIZGacHuO2ypelAvXji4vRrrVIwwYuJCQLlVF3JRYYZmyE2wbYSaiFi2sowZeAWeY5Amn7pFZKYsG4z_kvYqkhQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002A0YD.jpg

  కాగా, భారతీయ ఎన్నికల కమిషన్ (ఇ.సి.ఐ.), దక్షిణాఫ్రికా ఎన్నికల కమిషన్ చైర్ పర్సన్ గ్లెన్ మాషినినీ, ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం (ఎ-వెబ్) ప్రధాన కార్యదర్శి జోగ్యూన్ చోయీల మధ్య ఏప్రిల్ 12న ప్రిటోరియా నగరంలో జరిగిన అరుదైన త్రైపాక్షిక సమావేశం ఈ పర్యటనలో  ఒక విశేషంగా నిలిచింది. 118 దేశాల ఎన్నికల నిర్వహణా కమిషన్ల కలయికతో ఏర్పడిన ఎ-వెబ్.కు ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ సంఘానికి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్ష హోదాలో బాధ్యతలు నిర్వహిస్తోంది. 

  ఎ-వెబ్ పదేళ్ల వ్యవస్థాపక వార్షికోత్సవాలను పూర్తి చేసుకుని నూతన దశాబ్దంలో అడుగిడుతున్న తరుణంలో ఈ త్రైపాక్షిక సమావేశం జరిగింది. సంస్థాగతంగా ఎ-వెబ్ ఎలా ముందుకు సాగాలన్న అంశంపై చర్చ జరగాల్సిన తరుణంలో ఈ సమావేశం నిర్వహించారు. సభ్య దేశాలు పరస్పరం తమ పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని పంచుకునేందుకు ఎ-వెబ్ సంస్థ ఒక విశిష్ట వేదికను అందిస్తుంది.  ఎంతో అనుభవం, నైపుణ్యం కలిగిన ఎన్నికల నిర్వహణా కమిషన్లు ఈ ప్రపంచ సంఘంలో ఉన్నాయని,.. తమ వ్యవస్థల పురోగమనం, నవీకరణకోసం ప్రయత్నిస్తున్న మిగతా ఎన్నికల నిర్వహణా కమిషన్లకు అనుభవం కలిగిన సంఘాలు సహకారం అందించి, సూచనలు చేయవచ్చని ఈ సమావేశంలో గుర్తించారు. సభ్యత్వం పెంచి, సభ్యత్వ దేశాల ఎన్నికల సంఘాల్లో బాధ్యతను పెంపొందించే చర్యలు తీసుకోవలసిన తరుణం ఇదేనని ఈ సమావేశం అభిప్రాయపడింది. సభత్వ సంఘాలన్నీ తరుచుగా సమావేశమయ్యే అవకాశాల గురించి అన్వేషించాలన్న భావన కూడా ఈ సమావేశంలో వ్యక్తమైంది.

  సమావేశం సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ, సమావేశం నిర్వహించిన దక్షిణాఫ్రికా ఎన్నికల కమిషన్ చైర్ పర్సన్.కు అభినందనులు తెలిపారు. ప్రజాస్వామ్య పథంలో దక్షిణాఫ్రికా ఎంతో పురోగమించిందని, 2022 అక్టోబరులో జరగనున్న ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం సర్వ సభ్య సమావేశాన్ని కూడా నిర్వహించబోతోందని అన్నారు. ఎ-వెబ్.తో భారతదేశానికి ఎంతో క్రియాశీలకమైన, గాఢమైన బంధం ఉందన్నారు. ఈ సంఘంలో భారతదేశం, దక్షిణాఫ్రికాలకు వ్వవస్థాపక సభ్వత్వం ఉందన్నారు. గాంధీజీని మహాత్ముడిగా తీర్చిదిద్దిన నేలకు, నెల్సన్ మండేలా వంటి దక్షత కలిగిన నాయకుడి స్థలానికి రావడం తనకు సిసలైన యాత్రకు వచ్చినంత అనుభవాన్ని మిగిల్చిందన్నారు.

  ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘంలో సభ్యత్వం ఉన్న ఎన్నికల కమిషన్ల మధ్య సహకారం పెంపొందించేందుకు భారత ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను సుశీల్ చంద్ర క్లుప్తంగా వివరించారు. వెబినార్ సదస్సులు, అంతర్జాతీయ ఎన్నికల పర్యటనా కార్యకలాపాలు వంటి చర్యల ద్వారా భారత ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుందన్నారు. అనేక అంతర్జాతీయ ప్రచురణలను కూడా తీసుకవస్తోందని తెలిపారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రబలిన నేపథ్యంలో 11 రాష్ట్రాల రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు నిర్వహించడం, వివిధ ప్రాంతాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడం తదితర అనుభవాలను ఆయన ఈ సమావేశంలో సభ్య దేశాలతో పంచుకున్నారు. మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయంలో ఎన్నికల నిర్వహణకోసం వోటర్ల సంక్షేమం, ఎన్నికల సిబ్బంది భద్రత దృష్ట్యా ఇ.సి.ఐ. రూపొందించిన కొత్త నియమ నిబంధనలను గురించి ఆయన వివరించారు.

  ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం మూడు అంశాల విషయంలో మరింత బలోపేతం కావలసిన అవసరం ఉందని సుశీల్ చంద్ర అభిప్రాయపడ్డారు. మొదటగా,.. ఎన్నికల నిర్వహణా అంశాలకు సంబంధించి ప్రమాణబద్ధమైన నియమాలను ప్రపంచ ఎన్నికల కమిషన్ల సంఘం రూపొందించుకోవాలని, వాటినే ప్రపంచ ప్రమాణాలుగా పరిగణిస్తారని, ఆశించిన లక్ష్యాల సాధనకోసం ఎన్నికల నిర్వహణా కమిషన్లు చేరుకోవడానకి ఇవే దోహదపడతాయని ఆయన అన్నారు.

  ఇక రెండవ అంశంగా,..ప్రాంతీయ సమ్మేళనాల ద్వారా సభ్య కమిషన్ల మధ్య ముఖ్యమైన తేదీల్లో సమావేశాలను పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. భారతదేశం నిర్వహించే జాతీయ వోటర్ల దినోత్సవం తరహాలో ఎ-వెబ్ వ్యవస్థాపక దినోత్సవం వంటి తేదీల్లో ఈ సమావేశాలు జరుపుకోవచ్చని అన్నారు. ఆ విధంగా ఎ-వెబ్ వార్షిక కార్యకలాపాల ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.

  ఇక మూడవ అంశంగా,..ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్తమ విధానాలను, శిక్షణా ప్రక్రియలను, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను గురించి పరస్పరం చర్చించాలని అన్నారు. ఎ-వెబ్ లో సభ్యత్వం కలిగిన ఎన్నికల సంఘాలకోసం మరిన్ని శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సంసిద్ధంగా ఉందని అన్నారు. భారతదేశ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య, ఎన్నికల నిర్వహణా సంస్థ (ఐ.ఐ.ఐ.డి.ఇ.ఎం.)లో  ఎ-వెబ్ సభ్యత్వ సంఘాలకు ఈ శిక్షణా కార్యక్రమాల నిర్వహించేందుకు ఇ.సి.ఐ. సుముఖంగా ఉందన్నారు. 

  దక్షిణాఫ్రికాలో పర్యటన సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ 2022 ఏప్రిల్ 15న జోహాన్నెస్ బర్గ్ నగరంలోని కాన్సిస్ట్యూషన్ హిల్ మ్యూజియం భవన సముదాయంలో మహాత్మా  విగ్రహానికి పూలమాల వేసి జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. ఒకప్పుడు కారాగారంగా ఉన్న ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చివేశారు. ఇక్కడ గాంధీ-మండేలా ఎగ్జిబిషన్ కేంద్రాన్ని కూడా సుశీల్ చంద్ర సందర్శించారు.

https://ci6.googleusercontent.com/proxy/pytv_hOU-z9Tyk80ybN3mu7ATN03KyI_otoaK3dVKVKg_DvykvKoApw1mY_VOjPA5pCf20i4JDQrXhRNfCVL2ONSx-hfUz2yYBSX6HU3jv0e25IahmqGwdJ6gw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003O762.jpg

దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర కాన్సిస్ట్యూషన్

 హిల్ మ్యూజియంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బాపూజీకి

నివాళులు అర్పించిన దృశ్యం

 

https://ci3.googleusercontent.com/proxy/zqT_v5kXTwrnWk_S9nH-hg6N7UecZQCHHD_K1TCzyQHrYamO3rTHn4is2vZDb6BtMQSnELRSkVo3kjCL6ToNAZXqbmxii6_-4UOEg1FlHRCUN4zdIEs_hwS1dw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004799N.jpg

2022 ఏప్రిల్ 15న కాన్సిస్టిట్యూషన్ హిల్ వద్ద గాంధీ-మండేలా ఎగ్జిబిషన్ సెంటర్.ను

 సందర్శించిన కేంద్ర ఎన్నికల కమిషనర్

---------------------------------------

     2022 ఏప్రిల్ 18న పోర్ట్ లూయీ నగరంలో మారిషస్ ఎన్నికల కమిషనర్ మొహ్మద్ అబ్దుల్ రెహ్మాన్.ను ఎన్నికల ప్రధాన కమిషనర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉభయ దేశాల మధ్య సోదర బాంధ్యవాన్ని, ప్రాచీన బంధాన్ని, ఆప్యాయతలను గురించి ప్రస్తావించారు. రెండు ఎన్నికల కమిషన్లూ అవగాహనా ఒప్పందంతోనే కాకుండా, ఉభయ వ్యవస్థలపై సన్నిహిత అవగాహనతో మరింత చేరువ అయ్యాయని అన్నారు. పరస్పరం మద్దతుతో ఉభయదేశాల ఎన్నికల కమిషన్లు మరింత బలోపేతం కాబోతున్నట్టు ఆయన చెప్పారు. ఇటీవల భారతదేశంలో నిర్వహించిన ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. ఉభయదేశాల ఎన్నికల కమిషన్లు తమ ఉత్తమ విధానాలను, నైపుణ్యాలను, అనుభవాలను భవిష్యత్తులో కూడా పరస్పరం పంచుకుంటూనే ఉంటాయని చెప్పారు.

https://ci3.googleusercontent.com/proxy/VC6qeJh2ea_XiJUktj-r49YCEimJxmy7PVYXybOkCntjlWt0FBkmV_Lb9G-tT48jTNX6mx8qbsSdaUI8bkKKllU355U1rw7S7LnaI5tZt7djluL37LWyScplIA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0055IAQ.jpg

2022 ఏప్రిల్ 18న పోర్ట్ లూయీలో మారిషస్ ఎన్నికల కమిషనర్ మొహ్మద్ ఇర్ఫాన్ అబ్దుల్

రెహ్మాన్.తో సమావేశమైన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్

 

ప్రవాస భారతీయులతో భేటీ

  దక్షిణాఫ్రికా, మారిషస్ దేశాల్లో భారత ఎన్నికల కమిషన్ పర్యటన సందర్భంగా ఉభయ దేశాల్లో ప్రవాస భారతీయ సంఘాలతో సమావేశాలు జరిగాయి. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో ఏప్రిల్ 10వ, జోహాన్నెస్ బర్గ్.లో ఏప్రిల్ 12న, పోర్ట్ లూయీ నగరంలో ఏప్రిల్ 18న ప్రవాస భారతీయులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనుభవాలను సుశీల్ చంద్ర ప్రవాస భారతీయ ప్రతినిధులతో పంచుకున్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 95 కోట్ల మంది వోటర్లతో దేశన్యాప్తంగా పది లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో కమిషన్ ఎన్నికలను నిర్వహిస్తూ ఉంటుందని సుశీల్ చంద్ర అన్నారు. గత కొన్నేళ్లలో భారతదేశంలో ఎన్నికల నిర్వహణా వ్యవస్థ ఎంతో ప్రగతి సాధించిందని, దీనితో మహిళలు, వికలాంగ వోటర్లు, వయోజన వోటర్లు మరింత ఎక్కువ సంఖ్యలో వోటింగ్.లో పాల్గొనేందుకు వీలు కలిగిందని అన్నారు. విభిన్న మత సంస్కృతుల కలయికతో కూడిన ప్రజలున్న భారతదేశంలో స్వేచ్ఛగా, సజావుగా, భాగస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ సాధించిన గణనీయమైన విజయమేనని అన్నారు. వోటర్లు ఎక్కువ సంఖ్యలో తమ వోటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల నిర్వహణలో అనేక పటిష్ట పద్ధతులను చేపట్టినట్టు చెప్పారు. సి.విజిల్ (cVIGIL), స్వీప్ (SVEEP) వ్యవస్థ ద్వారా వోటర్లకు అవగాహన, ఇ.వి.ఎం.-వి.వి.పి.టి. (EVM-VVPAT) వ్యవస్థల వినియోగం, అందరూ మహిళలే పోలింగ్ కేంద్రాలను నిర్వహించడం, డిజిటల్ వేదికపై ఏకీకృత వోటర్ల జాబితా, కేంద్ర ఎన్నికల పరిశీలకులను నియోగించడం, వ్యయ నియంత్రణకు పటిష్టమైన యంత్రాంగాల వినియోగం,.. తదితర  చర్యల ద్వారా ఎక్కువ సంఖ్యలో వోటర్లు ఎన్నికల్లో పాలంపంచుకునేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/o21Tt8G8NBxOWuwWUIQxke2T1y399vdF1D71NOGVr2Rw-mCrfO0U7-CmW9R8iKXGiUFbfQnhRyomP9vguwEmZYFwZsXVtfwXXGwxJFBCvs1Kuj5ptWqt0ojMOA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006TOBJ.jpg

భారత ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులతో కలసి

2022, ఏప్రిల్ 10న దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్.లో ఇండియా కాన్సులేట్ కార్యాలయ

 అధికారులతో, ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులతో సమావేశమైనప్పటి చిత్రం.

-------------

 

https://ci4.googleusercontent.com/proxy/qtmc4mq-vdd84fkEc8Yhv63rqh2fAT-qHi6ciHlnZR1ThV1Po1gyzhqD_0Fi07UfRKTGjwNrtYqSix5vDZJnQIp-6BCrsTsu7dmm-HzBeU5ETt0eDo6RJ7SK1Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007YAHW.jpg

మారిషస్ లోని పోర్టు లూయీలో 2022 ఏప్రిల్ 18న  భారతీయ హైకమిషన్

 అధికారులతో, ప్రవాస భారతీయసంఘాల ప్రతినిధులతో సమావేశమైన

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర.

 

  గత కొన్ని నెలలుగా తాము చేపట్టిన ఎన్నికల సంస్కరణలను గురించి ఎన్నికల ప్రధాన కమిషనర్ సతీష్ చంద్ర ప్రధానంగా ప్రస్తావించారు. అర్హత కలిగిన పౌరులు వోటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు సంవత్సరంలో నాలుగు అర్హతా తేదీలను ప్రకటించామని ఈ సందర్భంగా చెప్పారు. అంతకు ముందు పౌరులు వోటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవడానికి సంవత్సరంలో కేవలం ఒకసారే అవకాశం ఉండేదన్నారు. ఆధార్ సమాచారాన్ని ఎన్నికల జాబితాతో అనుసంధానం చేయడం, 80 ఏళ్ల వయస్సుకు మించిన వయోజనులకు, అంగ వికలులకు, కోవిడ్ సోకిన వ్యక్తులు పోస్టల్ బ్యాలట్ ద్వారా వోటు వేయడానికి అనుమతించడం తదితర చర్యలను ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 

****



(Release ID: 1819188) Visitor Counter : 186