ఉక్కు మంత్రిత్వ శాఖ
ఉక్కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మూలధన వ్యయం -CAPEX జాతీయ ఉక్కు విధాన లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలను సమీక్ష చేసిన కేంద్ర ఉక్కు మంత్రి
Posted On:
19 APR 2022 4:27PM by PIB Hyderabad
2021-22 ఆర్థిక సంవత్సరంలో స్టీల్ CPSE చేసిన మూలధన వ్యయం (CAPEX)ని సమీక్షించడానికి ప్రస్తుత సంవత్సర-2022-23నికి CAPEX లక్ష్యాలను సాధించడానికి CPSEల ప్రణాళికలను అంచనా వేయడానికి కేంద్ర ఉక్కు మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహించారు.. ఉక్కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధినాయకులు SAIL, NMDC, RINL, KIOCL, MOIL, MECON ఉక్కు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఉక్కు ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంపొందించడానికి, పాత ప్లాంట్ పరికరాలను ఆధునిక రించడానికి భవిష్యత్తు కోసం పర్యావరణ సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకోవడానికి సకాలంలో మూలధన వ్యయం ప్రాముఖ్యతను ఉక్కు మంత్రి నొక్కి చెప్పారు. ఎటువంటి ఖర్చులు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పూరకాన్ని కూడా అందిస్తాయి. ఆర్ధిక సంవత్సరం 2021-22లో కేంద్ర ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థల ద్వారా CAPEX ఖర్చు రూ. 10,038 కోట్లు, ఇది రూ.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 7266.70 కోట్లు క్యాపెక్స్ కంటే 38% పెరుగుదల.
స్టీల్ CPSEలకు సంబంధించి ఆర్ధిక సంవత్సరం 2022-23కి CAPEX లక్ష్యం రూ. 1,3156.46 కోట్లు. కేంద్ర ఉక్కు మంత్రి CPSEలు తమ నెలవారీ మూలధన వ్యయం ప్రణాళికలకు కట్టుబడి ఉండాలని సమయానుకూలంగా అమలు చేయడం వార్షిక లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో విజయవంతంగా సాధించడం కోసం ప్రాజెక్టులను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. ఆర్ధిక సంవత్సరం 2022-23 కోసం CAPEX లక్ష్యాలను సాధిస్తామని స్టీల్ CPSEల CMD లు హామీ ఇచ్చారు.
సమీక్ష సందర్భంగా, జాతీయ ఉక్కు విధానం (NSP) 2017 కింద CPSEల ప్రణాళికలపై కూడా చర్చలు జరిగాయి, ఎందుకంటే ఇది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉక్కు పరిశ్రమను సృష్టించడానికి నాంది . NSP 2017 300 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యాన్ని 158 కిలోల తలసరి వినియోగాన్ని ఊహించింది. అయినప్పటికీ, మహమ్మారి ప్రభావ కాలంలో భారత ఉక్కు రంగం గత ఐదేళ్లలో 16.29 MTPA సామర్థ్యాన్ని జోడించి 154.27 MTPA సామర్థ్యాన్ని చేరుకుంది. ప్రస్తుత అంచనాల ఆధారంగా ప్రభుత్వం 2030-31 నాటికి 300 MTPA సామర్థ్యాన్ని చేరుకోగలదని విశ్వసిస్తోంది. కెపాసిటీ విస్తరణలో ఎక్కువ భాగం బ్రౌన్ ఫీల్డ్ ద్వారా వస్తుంది 2025-30 నాటికి కొంత గ్రీన్‌ఫీల్డ్ విస్తరణ నుంచి రావచ్చు.
జాతీయ ఉక్కు విధానం NSP – 2017కి అనుగుణంగా తమ మూలధన ప్రాజెక్టులను వివేకంతో ప్లాన్ చేసుకోవాలని మంత్రి ఉక్కు ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. వాటి సామర్థ్యం ప్రస్తుత స్థాయి నుంచి 80% పెరిగి 2030-31 నాటికి 45 MTPAకి చేరుకునేలా చూసేందుకు, ప్రస్తుత స్థాయి దాదాపు 25 MTPA. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఊహించిన సామర్థ్య విస్తరణకు కట్టుబడి ఉండేలా తమ భవిష్యత్ ప్రణాళికలలో గత ప్రస్తుత విస్తరణ ప్రాజెక్టుల నుంచి నేర్చుకున్న వాటిని పొందుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నొక్కి చెప్పారు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ ఉక్కు CPSE ల ముఖ్య కార్యనిర్వహణాధికారుల్ని తమ అన్వేషణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, వాతావరణ సమస్యలు దృష్టిలో ఉంచుకుని సామర్థ్య పెంపుదలకు కృషి చేయాలని పర్యావరణ అనుకూల ఉక్కు ఉత్పత్తి కి కృషి చేయాలని, 'అమృత్ కాల్',' కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం నైపుణ్యాన్ని తిరిగి ఆవిష్కరించడం అభివృద్ధి చేయడం తదనుగుణంగా వారి నైపుణ్యం గల రోడ్ మ్యాప్‌లను సిద్ధం చేయడం మార్కెట్‌లో పోటీతత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ప్రాధాన్యాలను వైవిధ్య పరచడం ముఖ్యమని అన్నారు.
*****
(Release ID: 1818308)
Visitor Counter : 148